Site icon NTV Telugu

200MP కెమెరా, 9,000mAh బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6తో OnePlus 16

Oneplus

Oneplus

OnePlus 16: 2026లో వన్‌ప్లస్ 16కు సంబంధించిన వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. వన్‌ప్లస్ 16లో కెమెరా, డిస్‌ప్లే, బ్యాటరీ విభాగాల్లో భారీ మార్పులు ఉండబోతున్నాయని తెలుస్తోంది. కంపెనీ ప్రస్తుతం కొత్త హార్డ్‌వేర్‌ను టెస్టింగ్ చేస్తోందని ప్రచారం జరుగుతుంది. హై-రిజల్యూషన్ పెరిస్కోప్ కెమెరా, అతి వేగవంతమైన రిఫ్రెష్ రేట్ ఉన్న ఫ్లాట్ డిస్‌ప్లే, భారీ సామర్థ్యం గల “గ్లేషియర్ బ్యాటరీ” వంటివి ఇందులో కీలకంగా కనిపిస్తున్నాయి. ఈ అప్‌గ్రేడ్స్ వన్‌ప్లస్ 16ను మరింత శక్తివంతమైన ఫ్లాగ్‌షిప్‌గా నిలబెట్టే అవకాశం ఉంది.

Read Also: Calorie Deficit: కిలో కొవ్వు తగ్గడానికి ఎన్ని రోజులు పడుతుంది? కేలరీ డెఫిసిట్‌పై సెలబ్రిటీ కోచ్ వివరణ..

200 మెగాపిక్సెల్ పెరిస్కోప్ కెమెరా 
వన్‌ప్లస్ 16లో 200 మెగాపిక్సెల్ పెరిస్కోప్ స్టైల్ టెలిఫోటో కెమెరాను పరీక్షిస్తున్నారు. ఈ కెమెరా సెన్సార్ వన్‌ప్లస్ 15లో ఉన్నదాని కంటే చాలా పెద్దదిగా, దాదాపు 1/1.x ఇంచ్ సైజ్‌లో ఉండే అవకాశం ఉంది. ఇది జూమ్ క్వాలిటీతో పాటు లో-లైట్ ఫోటోగ్రఫీ పని తీరును గణనీయంగా మెరుగుపడే అవకాశం ఉంది.

కెమెరా సెటప్
వన్‌ప్లస్ 16లో ఒప్పో ఫైండ్ ఎన్6 తరహా కెమెరా సిస్టమ్‌ను ఉపయోగించే ఛాన్స్ ఉంది. ఇందులో రెండు 50 మెగాపిక్సెల్ సెన్సర్లు, ఒక 200 మెగాపిక్సెల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మల్టీ స్పెక్ట్రల్ సెన్సర్ ఉండొచ్చని సమాచారం. ఈ మల్టీ స్పెక్ట్రల్ సెన్సర్ రంగుల ఖచ్చితత్వాన్ని, ఫోటోల నాణ్యతను మరింత మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

Read Also: Jana Nayagan : ‘జన నాయగన్’ సెన్సార్ గండం దాటుతుందా? నేడే ఫైనల్ తీర్పు!

200Hzకు పైగా రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే..
డిస్‌ప్లే విభాగంలో కూడా వన్‌ప్లస్ 16 సంచలన మార్పులతో రాబోతుంది. ప్రస్తుతం వన్‌ప్లస్ 15లో 165Hz రిఫ్రెష్ రేట్ ఉండగా.. వన్‌ప్లస్ 16లో 200Hzకన్నా ఎక్కువ రిఫ్రెష్ రేట్ ఉన్న ఫ్లాట్ స్క్రీన్‌ను కంపెనీ టెస్టింగ్ చేస్తోంది. ఇది స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన డిస్‌ప్లేలలో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది. అయితే, సాధారణ వినియోగంలో ఇది ఎంత వరకు తేడా చూపిస్తుంది అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.

9,000mAh గ్లేషియర్ బ్యాటరీ
బ్యాటరీ విభాగంలో వన్‌ప్లస్ 16 సెన్సేషన్‌గా మారే అవకాశం ఉంది. ఈ ఫోన్‌లో నెక్స్ట్ జనరేషన్ “గ్లేషియర్ బ్యాటరీ”ని ఉపయోగించనున్నారు. దీని సామర్థ్యం దాదాపు 9,000mAh వరకు ఉండొచ్చని అంచనా. ప్రస్తుతం వన్‌ప్లస్ 15లో ఉన్న 7,300mAh బ్యాటరీతో పోలిస్తే ఇది చాలా పెద్ద అప్‌గ్రేడ్. దీని వల్ల బ్యాటరీ బ్యాకప్‌లో వన్‌ప్లస్ 16 కొత్త బెంచ్‌మార్క్‌ను నెలకొల్పే ఛాన్స్ ఉంది.

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6 ప్రాసెసర్‌..
వన్‌ప్లస్ 16లో క్వాల్కమ్ తాజా ఫ్లాగ్‌షిప్ చిప్‌సెట్ అయిన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6ను ఉపయోగించే అవకాశం ఉందని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కానీ, దీనిపై కంపెనీ నుంచి ఇంకా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. అయితే, వన్‌ప్లస్ 16 విడుదలకు ఇంకా చాలా నెలల సమయం పట్టనుంది. ఇప్పటి వరకు వచ్చిన సమాచారం అంతా లీకులపైనే ఆధారపడింది. డెవలప్‌మెంట్ కొనసాగుతున్న సమయంలో స్పెసిఫికేషన్లు మారే ఛాన్స్ కూడా ఉంటుంది. అందువల్ల వినియోగదారులు మరిన్నీ వివరాల కోసం వేచి ఉండాలని టెక్ నిపుణులు సూచిస్తున్నారు.

స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో సంచలనంగా మారనున్న వన్‌ప్లస్ 16
మొత్తంగా చూస్తే 200 మెగాపిక్సెల్ కెమెరా, 200Hzకు పైగా రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, దాదాపు 9,000mAh బ్యాటరీ లాంటి ఫీచర్లతో వన్‌ప్లస్ 16 స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో సంచలనంగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Exit mobile version