OnePlus 15R vs iQOO 15R: ఒకే ధర, సేమ్ స్పెసిఫికేషన్స్.. వన్‌ప్లస్ 15R, ఐకూ 15Rలో బెస్ట్ ఫోన్ ఏది?
- ఫ్లాగ్షిప్ సెగ్మెంట్‌కు రోజురోజుకు మరింత క్రేజ్
- వన్‌ప్లస్ 15R, ఐకూ 15Rలో సేమ్ స్పెసిఫికేషన్స్
- వన్‌ప్లస్ 15R, ఐకూ 15Rలో బెస్ట్ ఫోన్ ఏది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఫ్లాగ్షిప్ సెగ్మెంట్‌కు రోజురోజుకు మరింత క్రేజ్ పెరుగుతోంది. అన్ని మొబైల్ కంపెనీలు ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లను లాంచ్ చేస్తున్నాయి. కొన్నింటిలో ఒకే ధర, సేమ్ స్పెసిఫికేషన్స్ ఉంటున్నాయి. ఈ క్రమంలో ఏ ఫోన్ బెస్ట్ అనే సందేహాలు కొనుగోలుదారులతో ఉన్నాయి. తాజాగా రిలీజ్ అయిన OnePlus 15R, త్వరలో (ఫిబ్రవరి 24) లాంచ్ కానున్న iQOO 15R దాదాపు ఒకే స్పెసిఫికేషన్లతో ఉన్నాయి. ధర ఒకేలా ఉంటే.. అసలు ఏ ఫోన్ బెస్ట్ అనే ప్రశ్న చాలా మందిలో తలెత్తుతోంది. ఇప్పుడు ఈ రెండు ఫోన్లను స్పెక్స్ ఆధారంగా ఓ లుక్కేద్దాం.
డిస్ప్లే అండ్ డిజైన్:
వన్‌ప్లస్ 15Rలో 6.83 అంగుళాల ఫ్లాట్ OLED డిస్ప్లే ఉంది. 165Hz రిఫ్రెష్ రేట్‌తో గేమింగ్, స్క్రోలింగ్ అనుభవం చాలా స్మూత్‌గా ఉంటుంది. మరోవైపు ఐకూ 15Rలో 6.59 అంగుళాల ఫ్లాట్ OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్ అందిస్తోంది. పెద్ద డిస్ప్లే, ఎక్కువ రిఫ్రెష్ రేట్ ఇష్టపడేవారికి వన్‌ప్లస్ కొంచెం అడ్వాంటేజ్‌గా నిలుస్తుంది.
Also Read
- Vivo V70 Lite 4G: వివో V70 Lite 4G వచ్చేసింది.. 8100mAh బ్యాటరీ, 50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే
- OPPO Find X9s: సగం ధరకే ఒప్పో Find X9s.. 12GB RAM, 50MP కెమెరా, 7025mAh బ్యాటరీతో ప్రీమియం 5G ఫోన్
- Honor Turbo 5G: హానర్ టర్బో 5G విడుదల.. 8,560mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో కొత్త 5G ఫోన్
- 64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
పర్ఫార్మెన్స్:
ఈ రెండు ఫోన్లలోనూ లేటెస్ట్ Snapdragon 8 Gen 5 ప్రాసెసర్ ఉంది. అంటే రోజువారీ యూజ్, హెవీ మల్టీటాస్కింగ్, హైఎండ్ గేమింగ్ – అన్నింటిలోనూ టాప్ క్లాస్ పర్ఫార్మెన్స్ గ్యారెంటీ. పర్ఫార్మెన్స్ విషయంలో రెండింటి మధ్య పెద్ద తేడా లేదు.
కెమెరా సెటప్:
వన్‌ప్లస్ 15R, ఐకూ 15R రెండింటిలోనూ 50MP మెయిన్ కెమెరా + 8MP సెకండరీ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీల కోసం రెండింటిలోనూ 32MP ఫ్రంట్ కెమెరా అందిస్తున్నారు. కెమెరా స్పెక్స్ ఒకేలా ఉన్నప్పటికీ.. సాఫ్ట్వేర్ ట్యూనింగ్ వల్ల రియల్ లైఫ్ ఫోటోగ్రఫీలో కొంత తేడా ఉండే అవకాశం ఉంది.
Also Read: Directors’ Era: ఇండియాస్ బిగ్గెస్ట్ ఫిల్మ్స్.. డైరెక్టర్ల యుగం మొదలైందా?
బ్యాటరీ అండ్ చార్జింగ్:
బ్యాటరీ విషయాల్లో చిన్న తేడా ఉంది. వన్‌ప్లస్ 15Rలో 7400mAh బ్యాటరీతో 80W ఫాస్ట్ చార్జింగ్ ఉంది. ఐకూ 15Rలో మాత్రం 7600mAh బ్యాటరీతో 100W చార్జింగ్ సపోర్ట్ ఇస్తున్నారు. ఎక్కువ బ్యాటరీ బ్యాకప్, ఫాస్ట్ చార్జింగ్ కోరుకునే వారికి ఐకూ కొంచెం ప్లస్ పాయింట్.
డ్యూరబిలిటీ:
ఈ రెండు ఫోన్లకూ IP68 / IP69 రేటింగ్ ఉంది. అంటే నీరు, దుమ్ము నుంచి మంచి రక్షణ లభిస్తుంది. ప్రీమియం ఫీల్, బిల్డ్ క్వాలిటీ విషయంలో రెండూ టాప్ సెగ్మెంట్లోనే ఉన్నాయి.
ఫైనల్లీ:
# స్పెసిఫికేషన్ల పరంగా చూస్తే OnePlus 15R, iQOO 15R రెండూ దాదాపు ఒకే లెవెల్లో ఉన్నాయి.
# బిగ్ డిస్ప్లే + హయ్యర్ రిఫ్రెష్ రేట్ + క్లిన్ సాఫ్ట్వేర్ అనుభవం కావాలంటే OnePlus 15R మంచి ఛాయిస్.
# బిగ్ బ్యాటరీ + అల్ట్రా ఫాస్ట్ చార్జింగ్ + గేమింగ్ ఫోకస్ కావాలంటే iQOO 15R వైపు మొగ్గు చూపవచ్చు.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!