Site icon NTV Telugu

Snapdragon 8 Gen 5 SoCతో వస్తున్న తొలి స్మార్ట్‌ఫోన్‌గా OnePlus 15R.. లాంచ్ డేట్, స్పెసిఫికేషన్లు ఇదిగో..!

Oneplus 15r

Oneplus 15r

OnePlus 15R: వన్‌ప్లస్ రాబోయే ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ OnePlus 15R గురించి కీలకమైన అప్‌డేట్‌ను అధికారికంగా ప్రకటించింది. క్వాల్కమ్ కంపానీ తాజాగా విడుదల చేసిన స్నాప్‌డ్రాగన్ 8 Gen 5 చిప్‌సెట్‌ (Snapdragon 8 Gen 5 SoC)ను మొట్టమొదటిగా ఉపయోగించనున్న స్మార్ట్‌ఫోన్ ఇదేనని కంపెనీ అధికారికంగా ధృవీకరించింది. CPU, GPU, AI పనితీరులో భారీ పెరుగుదలతో ఈ కొత్త చిప్‌సెట్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో కొత్త బెంచ్‌మార్క్‌లను సెట్ చేయనుందని కంపెనీ అంటుంది. OnePlus 15R భారత్‌లో డిసెంబర్ రెండో వారంలో OnePlus Pad Go 2తో కలిసి లాంచ్ కానుంది. ఈ రెండు డివైస్‌లు అమెజాన్, వన్ ప్లస్ ఆన్‌లైన్ స్టోర్‌ల ద్వారా అందుబాటులోకి రానున్నాయి.

పోకో నుండి సర్‌ప్రైజ్.. Poco Pad X1, Pad M1 గ్లోబల్‌గా లాంచ్.. ధరలు, స్పెసిఫికేషన్లు ఇవే..!

వన్‌ప్లస్ విడుదల చేసిన ప్రెస్ నోట్ ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా Snapdragon 8 Gen 5 చిప్‌సెట్‌తో లాంచ్ అయ్యే తొలి స్మార్ట్‌ఫోన్ OnePlus 15R అని పేర్కొంది. ఇదివరకు వచ్చిన OnePlus 13R మోడల్‌లో Snapdragon 8 Gen 3 చిప్‌సెట్‌ను ఉపయోగించారు. ఇందులో Qualcomm Oryon CPU, Adreno GPU, Hexagon NPU వంటి అధునాతన కంపోనెంట్లు ఉన్నాయి. Snapdragon X80 5G Modem-RF సిస్టమ్‌తో 6Rx యాంటెన్నా సపోర్ట్ ద్వారా గరిష్టంగా 3.5Gbps అప్లింక్ స్పీడ్‌ను అందిస్తుంది. అంతేకాకుండా ఫాస్ట్ కనెక్ట్ 7900 సిస్టమ్‌తో బ్లూటూత్ 6 మరియు Wi-Fi 7 సపోర్ట్ కూడా అందుబాటులో ఉంది. క్వాల్కమ్ ప్రకారం Snapdragon 8 Gen 5 చిప్‌సెట్ CPU పనితీరులో 36%, GPU పనితీరులో 11%, AI పనితీరులో 46% పెరుగుదల అందిస్తుంది.

OnePlus 15R భారతదేశంలో డిసెంబర్ 17న అధికారికంగా విడుదల కానుంది. ఈ ఫోన్ IP66, IP68, IP69, IP69K రేటింగ్‌లను కలిగి ఉంది. దీని వలన దుమ్ము, నీరు మాత్రమే కాకుండా హీట్ ప్రెషర్‌కు కూడా రక్షణ లభిస్తుంది. చార్కోల్ బ్లాక్, మింట్ బ్రీజ్ అనే రెండు రంగులలో ఈ ఫోన్ అమెజాన్ ద్వారా విక్రయించబడుతుంది. ఇదే ఈవెంట్‌లో OnePlus Pad Go 2 టాబ్లెట్ కూడా ప్రకటించబడనుంది.

T20 World Cup 2026: భారత్‌ ఫైనల్స్‌కు వెళ్తుంది.. రోహిత్ శర్మ జోస్యం!

లీక్‌లు ప్రకారం OnePlus 15Rలో 50MP ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రావైడ్ లెన్స్‌తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉండొచ్చని భావిస్తున్నారు. 6.7 అంగుళాల OLED డిస్ప్లే 1.5K రిజల్యూషన్‌తో అందుబాటులోకి రావచ్చు. బ్యాటరీ పరంగా 8,000mAh లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యం ఉండే అవకాశం ఉంది. అలాగే 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, గరిష్టంగా 16GB LPDDR5x Ultra ర్యామ్, 1TB UFS 4.1 స్టోరేజ్ ఆప్షన్‌లతో ఫోన్ మంచి పనితీరును అందించనుంది.

Exit mobile version