NTV Telugu Site icon

OnePlus: వన్‌ప్లస్‌ నుంచి మరో బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ వచ్చేస్తోంది..

Oneplus

Oneplus

స్మార్ట్​ఫోన్​ దిగ్గజం వన్​ప్లస్ నుంచి త్వరలోనే అతి చౌక ధరలో స్మార్ట్​ఫోన్ ​రానుంది. చైనాకు చెందిన వన్‌ప్లస్‌ అంటే ఒకప్పుడు కేవలం ప్రీమియం ఫోన్‌లు మాత్రమే గుర్తొచ్చేవి. వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ కనీసం రూ. 50 వేలు పెడితేనే వస్తుందనే ఆలోచన ఉండేది. కానీ ఇటీవల వన్‌ప్లస్‌ బడ్జెట్‌ ఫోన్‌లను లాంచ్‌ చేస్తూ వస్తోంది. ముఖ్యంగా రూ. 20 వేల నుంచి రూ. 30 వేల మధ్య మిడ్‌ వేరియంట్‌ ఫోన్‌లను తీసుకొస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా వన్‌ప్లస్ నార్డ్‌ 2 స్మార్ట్‌ఫోన్‌కి అప్‌గ్రేడ్‌ వెర్షన్‌గా వన్‌ప్లస్‌ నార్డ్‌ 2టీ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. ఈ నెల చివర్లో ఈ ఫోన్‌ అందుబాటులోకి రానుంది. ఇప్పటికే యూరప్‌లో ఈ ఫోన్‌ను లాంచ్‌ చేశారు. మనదేశంలో త్వరలోనే లాంచ్ కానున్న ఈ ఫోన్ ఫీచర్లు ఏంటో తెలుసుకుందాం.

ఈ స్మార్ట్‌ఫోన్‌లో 90Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.43 ఇంచెస్‌ ఫుల్‌ హెచ్‌డీ+ ఫ్లుయిడ్‌ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 డిస్‌ప్లే ప్రొటెక్షన్ ఈ ఫోన్‌కు ప్రత్యేక ఆకర్షణగా ఉండనుంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్‌ మీడియాటెక్ డైమన్సిటీ 1300 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్‌ 12 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 12.1పై వన్‌ప్లస్‌ నార్డ్ 2టీతో పనిచేస్తుంది. కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 32 మెగాపిక్సెల్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందిస్తున్నారు. వన్‌ప్లస్‌ నార్డ్‌ 2టీ రెండు వేరియంట్లలో రానుంది. 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్, 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ మోడళ్లలో విడుదల చేశారు. యూరప్‌లో బేస్‌ వేరియంట్‌ ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర 399 యూరోలుగా ఉంది. మన కరెన్సీలో చెప్పాలంటే రూ. 32,030గా ఉంటుంది. అయితే భారత్‌లో వన్‌ప్లస్‌ నార్డ్‌ 2టీ ప్రారంభ ధర రూ. 30,000గా ఉండనుందని అంచనా వేస్తున్నారు.