NVIDIA CEO Jensen Huang: ఈసారి మంచి సీఈఓగా ఉంటా.. కౌగిలించుకున్న మహిళా ఉద్యోగి.. భావోద్వేగానికి గురైన జెన్సన్ హువాంగ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NVIDIA CEO Jensen Huang: అమెరికాకు చెందిన ప్రముఖ చిప్ తయారీ సంస్థ ఎన్విడియా (NVIDIA) సీఈఓ జెన్సన్ హువాంగ్‌కు కంపెనీ ఉద్యోగులు ఘన స్వాగతం పలికారు. కాలిఫోర్నియాలోని శాంటా క్లారా ప్రధాన కార్యాలయానికి ఆయన తిరిగి రావడంతో ఉద్యోగులంతా చప్పట్లతో, నినాదాలతో స్వాగతించారు. కొందరు ఉద్యోగులు ఆయనను ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
తనకు మరో అవకాశం ఇచ్చిన ఉద్యోగులకు జెన్సన్ హువాంగ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈసారి మరింత మెరుగైన సీఈఓగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. “నాకు రెండో అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈసారి నేను మరింత మెరుగైన సీఈఓగా ఉంటాను” అని ఆయన తన గుండెపై చేయి వేసుకుని భావోద్వేగంగా చెప్పారు. దీంతో ఉద్యోగులంతా “మేము నిన్ను ప్రేమిస్తున్నాం జెన్సన్!” అంటూ నినాదాలు చేశారు. మరికొందరు “ఇక పని ప్రారంభిద్దాం!” అని ఉత్సాహంగా అన్నారు. ఈ క్రమంలో ఉద్యోగులంతా కలిసి “జెన్సన్! జెన్సన్! జెన్సన్!” అంటూ కార్యాలయాన్ని మారుమోగించారు. అనంతరం ఉద్యోగులను నవ్విస్తూ.. “ధన్యవాదాలు. ఈరోజు నా మొదటి రోజు. నా దగ్గర కంప్యూటర్ లేదు. కాబట్టి ఐటీ విభాగం నాకు కొత్త పీసీ ఇవ్వాలి” అని సరదాగా వ్యాఖ్యానించారు.
Also Read
- WhatsApp Web Security Alert: వాట్సాప్ వెబ్ వాడుతున్నారా?.. కేంద్రం బిగ్ అలర్ట్.!
- 200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, OLED డిస్ప్లేలతో HONOR 700 Series లాంచ్..!
- చిన్న గదికి అదిరిపోయే స్మార్ట్ టీవీ.. Xiaomi Google TVపై రూ.12,000ల భారీ డిస్కౌంట్..!
- Motorola G Max: రూ.19,499కే Motorola G Max 5G ఫోన్.. 7000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో అదిరిపోయే డీల్!
ఉద్యోగులకు క్షమాపణలు.. కౌగిలించుకున్న మహిళా ఉద్యోగి
మరో వీడియోలో జెన్సన్ హువాంగ్ ఉద్యోగులకు క్షమాపణలు చెబుతూ కనిపించారు. తన వల్ల ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొన్నందుకు విచారం వ్యక్తం చేశారు. “మీ అందరికీ ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. ఈ పరిస్థితులన్నింటి ద్వారా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు నిజంగా క్షమించండి. నేను కొన్ని తీవ్రమైన తప్పులు చేశాను. వాటి నుంచి బయటపడి తిరిగి మంచి స్థాయికి రావడానికి కృషి చేస్తాను” అని ఆయన పేర్కొన్నారు. ఆయన మాట్లాడిన కొద్దిసేపటికే ఓ మహిళా ఉద్యోగి పరుగెత్తుకుంటూ వచ్చి జెన్సన్ను ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. దీంతో అక్కడున్న ఉద్యోగులంతా ఆనందంతో కేరింతలు కొట్టారు.
సోమవారం ఎన్విడియా డైరెక్టర్ల బోర్డు కీలక ప్రకటన చేసింది. జెన్సన్ హువాంగ్ను తక్షణమే కంపెనీ అధ్యక్షుడిగా (President), ముఖ్య కార్యనిర్వహణ అధికారి (CEO)గా, అలాగే బోర్డు సభ్యుడిగా తిరిగి నియమించినట్లు వెల్లడించింది. బోర్డు సభ్యులు ఆయనతో వరుసగా చర్చలు, సమావేశాలు నిర్వహించిన అనంతరం ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన నిజాయితీగా వ్యవహరించిన తీరు, కంపెనీని నడిపించే నాయకత్వ సామర్థ్యంపై సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిపింది.
Jensen Huang PULLED into LONG, TIGHT HUG by FEMALE EMPLOYEE moments after APOLOGIZING to NVIDIA STAFF https://t.co/eDfw3ZzRx6
— RT (@RT_com) November 23, 2026
BREAKING: Jensen Huang returns to NVIDIA headquarters as CEO, welcomed with cheers, shout-outs and an outpouring of support from employees.
“Thank you all for the second chance. I am going to be a better CEO the second time around.” https://t.co/ye9duf25NF
— DogeDesigner (@cb_doge) November 23, 2026
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-10 Live : కోటి దీపోత్సవంలో శివారాధన.. భక్తుల చేతుల మీదుగా నవధాన్యార్చన.!
-
NVIDIA CEO Jensen Huang: ఈసారి మంచి సీఈఓగా ఉంటా.. కౌగిలించుకున్న మహిళా ఉద్యోగి.. భావోద్వేగానికి గురైన జెన్సన్ హువాంగ్!
-
Astrology: నవంబర్ 24 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారు.. ఈ పరిహారం చెల్లించండి..!
-
Koti Deepotsavam 2026 : కార్తీక సోమవారం.. కోటి దీపోత్సవంలో ఏకామ్రేశ్వరస్వామి కల్యాణ శోభ
-
Gas Stove Knob Cleaning Tips : గ్యాస్ స్టవ్ నాబ్లపై జిడ్డు మరకలా?.. ఈ సింపుల్ ట్రిక్‌తో మాయం!
-
Stock Market: ఎన్విడియా సీఈఓగా జెన్సన్ హువాంగ్ రీఎంట్రీ.. స్టాక్ మార్కెట్లో భారీ ర్యాలీ..
ట్రెండింగ్
-
WhatsApp Web Security Alert: వాట్సాప్ వెబ్ వాడుతున్నారా?.. కేంద్రం బిగ్ అలర్ట్.!
-
Woman Adopts Pig : పదేళ్ల పెళ్లి బంధానికి గుడ్‌బై.. పందిపిల్లతో కొత్త జీవితం
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, OLED డిస్ప్లేలతో HONOR 700 Series లాంచ్..!
-
Indian Rupee Falls: మళ్లీ పడిపోయిన రూపాయి.. ఒక్కరోజే 23 పైసలు పతనం..!
-
Mohammed Siraj-Gill: సిరాజ్‌ను అందుకే పక్కనపెట్టాం.. శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!