NTV Telugu Site icon

Nokia G42 5G Smartphone Price: నోకియా నుంచి సూపర్ 5G స్మార్ట్‌ఫోన్.. ధర, ఫీచర్స్ లీక్!

Nokia G42 5g Smartphone

Nokia G42 5g Smartphone

Nokia G42 5G Smartphone Launch and Price: ఫిన్‌లాండ్‌కు చెందిన ‘నోకియా’ మొబైల్ కంపెనీకి భారత మార్కెట్‌లో మంచి క్రేజ్ ఉంది. గతంలో మొబైల్ మార్కెట్‌ను షేక్ చేసిన నోకియా.. తిరిగి సత్తా చాటేందుకు ప్రయత్నాలు మొదలెట్టింది. ఈ క్రమంలోనే మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ను నోకియా విడుదల చేయనుంది. నోకియా జీ42 5G (Nokia G42 5G) పేరుతో ఓ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లో వదలనుంది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు ఇటీవల గీక్‌బెంచ్ మరియు బ్లూటూత్ ఎస్ఐజీ వెబ్‌సైట్‌లలో లీక్ అయ్యాయి. తాజాగా ధరను కూడా వెల్లడించాయి.

Nokia G42 5G Design:
లీకైన ప్రెస్ రెండర్‌ల ప్రకారం.. నోకియా G42 5G స్మార్ట్‌ఫోన్ రెండు రంగు ఎంపికలలో (పర్పుల్ మరియు బ్లాక్) వస్తుంది. ఫోన్ మూలల్లో కర్వ్ ఫ్రేమ్ మరియు బ్యాక్ ప్యానెల్ ఉంటుంది. ఇందులో మూడు కెమెరాలు ఉంటాయి. బెజెల్స్, వాటర్ డ్రాప్ నాచ్ ముందు భాగంలో చూడవచ్చు. ఈ ఫోన్ క్విక్ ఫిక్స్‌కు మద్దతు ఇస్తుంది.

Also Read: World Cup Qualifiers 2023: వన్డే క్రికెట్‌లో జింబాబ్వే సరికొత్త రికార్డు.. పాకిస్తాన్ కూడా సాధించలేకపోయింది!

Nokia G42 5G Specs:
నోకియా G42 5G స్మార్ట్‌ఫోన్ 1612 x 700 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.56-అంగుళాల ఎల్సీడీ డిస్‌ప్లే ప్యానెల్‌ను కలిగి ఉంది. ఫోన్ పవర్ బటన్‌లో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కూడా కలిగి ఉంటుంది. ప్రధాన కెమెరా 50 మెగాపిక్సెల్స్. ఇది కాకుండా 2-2 మెగాపిక్సెల్ మాక్రో మరియు డెప్త్ కెమెరాలు ఉన్నాయి. ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఇది 128 గిగాబైట్ల స్టోరేజ్ స్పేస్ మరియు ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. నోకియా G42 5G బ్యాటరీ సామర్థ్యం 5000mAh.

Nokia G42 5G Price:
నోకియా G42 5G స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 480+ 5G ప్రాసెసర్ ఉండనుంది. ఈ ఫోన్ స్క్రీన్ 90Hz రిఫ్రెష్ రేట్ మరియు 20:9 యాస్పెక్ట్ రేషియో కలిగి ఉంటుంది. ఇందులో 4GB లేదా 6GB RAM ఉండవచ్చని లీక్‌ల ద్వారా తెలుస్తోంది. నోకియా G42 5G ధర భారత దేశంలో సుమారు 23 వేల రూపాయలు ఉంటుందని సమాచారం.

Also Read: ICC World Cup 2023: నింగి నుంచి నరేంద్ర మోదీ స్టేడియంలో దిగిన వన్డే ప్రపంచకప్‌ 2023 ట్రోఫీ!