Noam Shazeer: గూగుల్‌కు బిగ్ షాక్.. జెమిని ఏఐ కీలక రూపశిల్పి రాజీనామా.. ఓపెన్ AI గూటికి టెక్ జీనియస్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Noam Shazeer: గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సామ్రాజ్యానికి ఊహించని షాక్ తగిలింది. ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇంజనీరింగ్, గూగుల్ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘జెమిని AI’ మోడల్స్ కో-లీడ్ నోమ్ షాజీర్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. గూగుల్‌కు గుడ్‌బై చెప్పేసి, చాట్‌జీపీటీ సృష్టికర్త అయిన ప్రత్యర్థి సంస్థ ‘ఓపెన్ AI’ గూటికి చేరారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రకటిస్తూ.. ఓపెన్ AI అద్భుతమైన బృందంతో కలిసి పనిచేసేందుకు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన ఏఐ నిపుణులలో ఒకరిగా, టైమ్ మ్యాగజైన్ టాప్-100 జాబితాలో నిలిచిన షాజీర్ నిష్క్రమణ గూగుల్‌కు కోలుకోలేని దెబ్బేనని టెక్ వర్గాలు భావిస్తున్నాయి.
షాజీర్‌కు గూగుల్‌తో ఉన్న బంధం, విడిపోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో 2021లో తాను అభివృద్ధి చేసిన ఒక చాట్‌బాట్‌ను విడుదల చేయడానికి గూగుల్ నిరాకరించడంతో తీవ్ర అసంతృప్తితో ఆయన ఆ సంస్థను వీడారు. బయటకు వచ్చి ‘క్యారెక్టర్.AI’ (Character.AI) అనే సొంత స్టార్టప్‌ను ప్రారంభించారు. అయితే, ఆయన ప్రతిభ తెలిసిన గూగుల్, ఎలాగైనా ఆయన్ని మళ్లీ కంపెనీలోకి తీసుకురావాలని పట్టుబట్టింది. ఇందుకోసం 2024లో ఏకంగా 2.7 బిలియన్ డాలర్ల భారీ మొత్తాన్ని వెచ్చించి, ఒక ప్రత్యేక ‘ఆక్వి-హైర్’ (acqui-hire) ఒప్పందం ద్వారా షాజీర్ను తిరిగి చేర్చుకుంది. అంతటి భారీ వ్యయంతో తీసుకొచ్చిన వ్యక్తి, కేవలం రెండేళ్లలోనే మళ్లీ గూగుల్‌ను వీడటం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
Also Read
- vivo X Fold6: 200MP కెమెరా.. 6900mAh బ్యాటరీ.. vivo కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది! ఫీచర్లు అదిరిపోయాయ్
- Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
- పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
- Realme P4s Lite 4G: రూ.16,499కే 7,000mAh బ్యాటరీతో Realme P4s భారత్ లో లాంచ్.. 120Hz డిస్ప్లే, 13MP కెమెరా!
గూగుల్ నుంచి తన రెండోసారి నిష్క్రమించడంపై షాజీర్ స్పందిస్తూ.. ఈ నిర్ణయం తీసుకోవడం తనకు చాలా కష్టమైందని, గూగుల్‌లోని అద్భుతమైన బృందంతో కలిసి పనిచేయడం ఒక గౌరవంగా భావిస్తున్నానని, తామంతా కలిసి నిర్మించిన సాంకేతికతపై తనకు ఎంతో గర్వంగా ఉందని భావోద్వేగంగా పంచుకున్నారు. మరోవైపు, షాజీర్ తమ సంస్థలోకి వస్తుండటంతో ఓపెన్ ఏఐ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ సామ్ ఆల్ట్‌మన్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. షాజీర్ పోస్ట్‌కు రిప్లై ఇస్తూ.. ఓపెన్ ఏఐ ప్రారంభించినప్పటి నుంచి తాను కలిసి పనిచేయాలని అత్యంత బలంగా కోరుకున్న వ్యక్తులలో నోమ్ షాజీర్ ఒకరని, ఈ కల నిజమవడానికి పదేళ్లు పట్టినప్పటికీ, ఈ నిరీక్షణకు తగ్గ ప్రతిఫలం ఖచ్చితంగా ఉంటుందని ఆల్ట్‌మన్ అత్యంత ఉత్సాహంగా వ్యాఖ్యానించారు. ఈ మెరుపు మార్పుతో టెక్ ప్రపంచంలో ఏఐ యుద్ధం మరింత ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!