TRAI Tightens Spam Call Rules:స్పామ్ కాల్స్‌పై ట్రాయ్ కఠిన నిబంధనలు.. AIతో ఫేక్ నంబర్ల గుర్తింపు, భారీ జరిమానాలు!
- స్పామ్ కాల్స్‌కు ట్రాయ్ చెక్
- 10 రోజుల్లో 3 ఫిర్యాదులొస్తే AIతో నిఘా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TRAI Tightens Spam Call Rules in India: రోజూ వచ్చే అనవసరమైన స్పామ్ కాల్స్, ఫేక్ కాల్స్, రోబోకాల్స్తో ఇబ్బంది పడుతున్న మొబైల్ వినియోగదారులకు భారత టెలికాం నియంత్రణ సంస్థ (TRAI) కీలక చర్యలు చేపట్టింది. స్పామ్ కాల్స్, సందేశాలను నియంత్రించేందుకు నిబంధనలను మరింత కఠినతరం చేసింది. అనుమానాస్పద నంబర్లు, రోబోకాల్స్‌ను గుర్తించేందుకు ఇకపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషిన్ లెర్నింగ్ (ML) టెక్నాలజీలను ఉపయోగించనున్నారు.
రోబోకాల్స్‌పై ప్రత్యేక నిఘా
కొత్త నిబంధనల ప్రకారం సాఫ్ట్వేర్ లేదా ఆటో-డయలింగ్ వ్యవస్థల ద్వారా చేసే Application-to-Person (A2P) కాల్స్, రోబోకాల్స్‌పై టెలికాం కంపెనీలు ప్రత్యేకంగా నిఘా పెట్టాలి. ఇలాంటి కాల్స్ చేసే సంస్థలు ముందుగానే టెలికాం కంపెనీలకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ముందస్తు ప్రకటన లేకుండా ఇలాంటి కాల్స్ చేస్తే వాటిని స్పామ్ కాల్స్‌గా పరిగణించే అవకాశం ఉంటుంది. అలాంటి కాల్స్‌పై నిమిషానికి 5 పైసల వరకు టెర్మినేషన్ ఛార్జ్ విధించే నిబంధనను తీసుకొచ్చారు.
Also Read
- Huawei Mate X8: 8.15 ఇంచుల డిస్ప్లే, 16GB RAMతో కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Huawei Mate X8 వచ్చేస్తోంది
- Cameras on Vegetable Vendors: కూరగాయల మార్కెట్లో AI కలకలం.. వ్యాపారుల తలపై వింత గ్యాడ్జెట్లు.. అసలేం జరుగుతోంది?
- Shubhanshu Shukla: 2040 నాటికి చంద్రుడిపై భారత జెండా.. ఇదే నా అసలైన లక్ష్యం: వ్యోమగామి శుభాంశు శుక్లా
- NASA Voyager 1 to Make History: 49 ఏళ్లుగా అంతరిక్షంలో ప్రయాణం.. చరిత్ర సృష్టించనున్న NASA Voyager 1
AI గుర్తించే అనుమానాస్పద స్పామర్లు
కొత్త నిబంధనల్లో AI ఆధారిత పర్యవేక్షణకు ప్రాధాన్యం ఇచ్చారు. ఏదైనా మొబైల్ నంబర్‌పై 10 రోజుల్లో మూడు లేదా అంతకంటే ఎక్కువ ఫిర్యాదులు వస్తే, అదే సమయంలో టెలికాం సంస్థకు చెందిన AI వ్యవస్థ కూడా ఆ నంబర్‌ను అనుమానాస్పదంగా గుర్తిస్తే వెంటనే చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే 10 రోజుల్లో ఐదు లేదా అంతకంటే ఎక్కువ అనుమానాస్పద నంబర్లు గుర్తించిన సందర్భాల్లో రీ-KYC, భౌతిక ధ్రువీకరణ వంటి ప్రక్రియలు చేపట్టనున్నారు.
పదేపదే నిబంధనలు ఉల్లంఘిస్తే కనెక్షన్ కట్
నిబంధనలను పదేపదే ఉల్లంఘించే వ్యక్తులు లేదా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. తీవ్రమైన లేదా పునరావృత ఉల్లంఘనల విషయంలో వారి టెలికాం కనెక్షన్లను పూర్తిగా నిలిపివేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా నిబంధనలు ఉల్లంఘించే టెలీమార్కెటర్లను ఏడాది పాటు బ్లాక్‌లిస్ట్ చేసే అవకాశం కూడా ఉంది.
1600, 1601, 140 నంబర్లకు ప్రత్యేక రక్షణ
అన్ని సర్వీస్ లేదా లావాదేవీ సంబంధిత కాల్స్‌ను స్పామ్‌గా భావించి బ్లాక్ చేయకుండా TRAI ప్రత్యేక నిబంధనలు తీసుకొచ్చింది. 1600/1601, 140 సిరీస్ నంబర్లు ముఖ్యమైన సేవలు, లావాదేవీలకు ఉపయోగించే నంబర్లుగా ఉండటంతో కాల్ మేనేజ్మెంట్ యాప్స్ వాటిని నేరుగా బ్లాక్ చేయకూడదు. అయితే వినియోగదారులు తమకు అవసరమైతే ఈ నంబర్లను స్వయంగా ఫిల్టర్ చేసుకునే అవకాశం ఉంటుంది.
కస్టమర్ విచారణకు 7 రోజుల వరకు కాల్ చేయొచ్చు
ఒక వినియోగదారు ఏదైనా ఉత్పత్తి లేదా సేవ గురించి కంపెనీని సంప్రదించినప్పుడు, ఆ కంపెనీ గరిష్ఠంగా 7 రోజుల వరకు కస్టమర్‌ను సంప్రదించవచ్చు. అయితే ఇలాంటి సంప్రదింపులకు సంబంధించిన రికార్డులను తప్పనిసరిగా నిర్వహించాల్సి ఉంటుంది.
స్పామ్ ఫిర్యాదుపై అప్పీల్ అవకాశం
టెలికాం సంస్థకు చేసిన స్పామ్ ఫిర్యాదుకు వచ్చిన పరిష్కారంతో వినియోగదారు సంతృప్తి చెందకపోతే, 15 రోజుల్లోపు అప్పీల్ చేసుకునే అవకాశం కూడా కల్పించారు.
వినియోగదారులకు మరింత రక్షణే లక్ష్యం
స్పామ్ కాల్స్, అనవసర సందేశాల కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, మానసిక ఒత్తిడిని తగ్గించడం, అలాగే టెలికాం వ్యవస్థపై వినియోగదారుల నమ్మకాన్ని పెంచడం ఈ కఠిన నిబంధనల ప్రధాన లక్ష్యమని TRAI తెలిపింది. AI, మెషిన్ లెర్నింగ్ ఆధారిత పర్యవేక్షణతో అనుమానాస్పద నంబర్లను వేగంగా గుర్తించడం, పదేపదే నిబంధనలు ఉల్లంఘించే టెలీమార్కెటర్లపై చర్యలు తీసుకోవడం ద్వారా స్పామ్ కాల్స్‌ను నియంత్రించేందుకు కొత్త విధానం ఉపయోగపడనుంది.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day 2: అంగరంగ వైభవంగా తిరుచెందూరు శ్రీసుబ్రహ్మణ్యస్వామి కల్యాణం.. రెండో రోజు విశేషాలివే..!
-
Shashank Srihari : రియల్ స్టార్ శ్రీహరి ఇంట పెళ్లి సందడి.. పెద్ద కుమారుడి నిశ్చితార్థం ఎప్పుడంటే.?
-
OTR: కేటీఆర్ సభ రద్దు వెనుక అసలు కారణమేంటి..? BRSలో హాట్ టాపిక్..
-
Aus Vs Eng: సెంచరీతో టామ్ బాంటన్ వీరవిహారం.. ఆస్ట్రేలియా గడ్డపై ఇంగ్లాండ్ అద్భుత విజయం..
-
Dhanashree Verma: చాహల్ మాజీ భార్య ధనశ్రీ హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ..
ట్రెండింగ్
-
Winter Skin Care Tips : పండ్ల తొక్కలతోనే మెరిసే అందం.. చలికాలంలో చర్మ సంరక్షణకు 6 చిట్కాలు
-
India Batters Score: భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం..! టాప్ స్కోరర్‌గా కోహ్లీ.. అయినా 100 పరుగులు కూడా దాటలే..
-
Aaryavir Sehwag: ఫైనల్లో టెన్షన్ తట్టుకోలేకపోయా నాన్నా.. ‘సీతారాం.. సీతారాం’ అంటూ జపించా!
-
WPL 2027: కీలక అప్డేట్.. ఆ మ్యాచ్‌లన్నీ వాంఖడే స్టేడియంలోనే..!
-
Rohit Sharma: రెండు డకౌట్లు, 7.50 సగటు మాత్రమే.. రోహిత్ శర్మ కెరీర్లోనే చెత్త రికార్డు!