లాస్ వెగాస్‌లో జరిగిన కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (CES 2026)లో ‘మోటరోలా’ టెక్ ప్రపంచాన్ని ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పటివరకు ఫ్లిప్ టైప్ ఫోల్డబుల్ ఫోన్‌లకే పరిమితమైన మోటరోలా.. తొలిసారిగా బుక్-స్టైల్ ఫోల్డింగ్ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. ‘మోటరోలా రేజర్ ఫోల్డ్’ పేరుతో ఫోల్డబుల్ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇది శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్, గూగుల్ పిక్సెల్ ఫోల్డ్‌లకు పోటీగా నిలవనుంది. ప్రీమియం ఫోల్డబుల్ సెగ్మెంట్‌లోకి మోటరోలా అడుగుపెట్టగా.. టెక్ అభిమానుల్లో అంచనాలు భారీ స్థాయికి చేరాయి. మోటరోలా రేజర్ ఫోల్డ్ ఫీచర్స్ ఇంకా తెలియరాలేదు కానీ కొన్ని స్పెక్స్ లీక్ అయ్యాయి. ఆ డీటెయిల్స్ తెలుసుకుందాం.
ఇప్పటివరకు రేజర్ సిరీస్ అంటే క్లామ్‌షెల్ డిజైన్‌తో నాస్టాల్జిక్ ఫీల్ ఇచ్చే ఫోన్‌లే గుర్తుకొచ్చేవి. కొత్త డిజైన్‌తో రేజర్ ఫోల్డ్‌ను మోటరోలా తీసుకొస్తోంది. పెద్ద స్క్రీన్, మల్టీటాస్కింగ్, ఎంటర్‌టైన్‌మెంట్, ప్రొడక్టివిటీ.. ఇలా ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్‌గా ఈ ఫోన్‌ను కంపెనీ డిజైన్ చేసింది. ఫోల్డబుల్ మార్కెట్‌లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించాలన్నదే మోటరోలా లక్ష్యం. CES 2026లో అధికారికంగా రేజర్ ఫోల్డ్ ఫోన్‌ను ప్రకటించినప్పటికీ.. గ్లోబల్ లాంచ్ డేట్స్‌ను మోటరోలా వెల్లడించలేదు. అయితే 2026 సమ్మర్‌లో మొదట ఉత్తర అమెరికాలో విడుదలై.. ఆ తర్వాత ఇతర మార్కెట్లలో రానున్నట్లు తెలిపింది. భారత మార్కెట్‌లో ఈ ఫోన్ 2026 చివర్లో లాంచ్ అయ్యే అవకాశముంది.
రేజర్ ఫోల్డ్ అధికారిక ధరను మోటరోలా ఇంకా ప్రకటించలేదు. అయితే లీకులు, ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం. ఇది ప్రీమియం ధరతో రానుంది. అంచనాల ప్రకారం.. ఈ ఫోన్ ప్రారంభ ధర సుమారు $1,500 (భారత కరెన్సీలో రూ.1,25,000 పైగా) ఉండొచ్చని సమాచారం. ఫోల్డబుల్ డిజైన్, ఫ్లాగ్‌షిప్ స్పెసిఫికేషన్ల కారణంగా ధర ఎక్కువగానే ఉండనుంది. ఈ కొత్త ఫోల్డబుల్‌లో స్టైలస్ సపోర్ట్, మెరుగైన హార్డ్‌వేర్, ఫీచర్లను అందించడానికి కంపెనీ ప్రయత్నిస్తోంది. ప్రాసెసర్, బ్యాటరీ గురించి కంపెనీ ఇంకా ఏ డీటెయిల్స్ వెల్లడించలేదు. తాజా స్నాప్‌డ్రాగన్ లేదా మీడియాటెక్ ఫ్లాగ్‌షిప్ చిప్‌సెట్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఇది ఆండ్రాయిడ్ 16-ఆధారిత హలో UIతో రానుంది. ఈ ఫోల్డబుల్ ఫోన్ పెన్ అల్ట్రా స్టైలస్‌కు మద్దతు ఇవ్వడం ప్రత్యేకం.
డ్యూయల్ స్క్రీన్ డిజైన్ వల్ల మడిచినపుడు సాధారణ స్మార్ట్‌ఫోన్‌లా, తెరిచినపుడు టాబ్లెట్‌లా ఉపయోగించుకోవచ్చు. LTPO టెక్నాలజీ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్స్‌తో బ్యాటరీ ఎఫిషియెన్సీని మెరుగుపరుస్తుంది. రేజర్ ఫోల్డ్ బుక్-స్టైల్ డిజైన్‌లో ఓ చిన్న టాబ్లెట్‌లా ఓపెన్ అవుతుంది. మల్టీటాస్కింగ్, వీడియో స్ట్రీమింగ్, గేమింగ్‌కు చాలా అనుకూలంగా ఉంటుంది. రేజర్ ఫోల్డ్‌లో మోటరోలా కెమెరాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ట్రిపుల్ 50MP సెటప్‌తో వైడ్ షాట్స్, పెరిస్కోప్ జూమ్, డీటెయిల్డ్ మాక్రో ఫోటోగ్రఫీ చేయొచ్చు.డాల్బీ విజన్ వీడియో రికార్డింగ్ వల్ల వీడియో క్రియేటర్స్, సోషల్ మీడియా యూజర్లకు ఇది మరింత ఆకర్షణీయంగా మారుతుంది. ఫోన్ మడిచినా, తెరిచినా.. రెండు స్క్రీన్లపై సెల్ఫీ కెమెరాలు ఉంటాయి.
Also Read: Ashleigh Gardner: వచ్చే 5-10 ఏళ్లలో భారత జట్టును ఓడించడం చాలా కష్టం!
మోటరోలా రేజర్ ఫోల్డ్ స్పెసిఫికేషన్లు (అంచనా):
# ఇన్నర్ డిస్‌ప్లే: 8.1-ఇంచ్ 2K LTPO ఫోల్డబుల్ స్క్రీన్
# ఔటర్ డిస్‌ప్లే: 6.6-ఇంచ్ స్క్రీన్ (డైలీ యూజ్ కోసం)
# రియర్ కెమెరాలు: ట్రిపుల్ 50MP సెటప్
సోనీ LYTIA మెయిన్ సెన్సార్
50MP అల్ట్రా-వైడ్ + మాక్రో
50MP పెరిస్కోప్ టెలిఫోటో (3x జూమ్)
#ఫ్రంట్ కెమెరా
ఔటర్ స్క్రీన్‌పై 32MP
ఇన్నర్ డిస్‌ప్లేలో 20MP
# వీడియో: డాల్బీ విజన్ రికార్డింగ్ సపోర్ట్
# స్టైలస్: Moto Pen Ultra సపోర్ట్
