లాస్ వెగాస్‌లో జరిగిన కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (CES 2026)లో ‘మోటరోలా’ టెక్ ప్రపంచాన్ని ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పటివరకు ఫ్లిప్ టైప్ ఫోల్డబుల్ ఫోన్‌లకే పరిమితమైన మోటరోలా.. తొలిసారిగా బుక్-స్టైల్ ఫోల్డింగ్ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. ‘మోటరోలా రేజర్ ఫోల్డ్’ పేరుతో ఫోల్డబుల్ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇది శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్, గూగుల్ పిక్సెల్ ఫోల్డ్‌లకు పోటీగా నిలవనుంది. ప్రీమియం ఫోల్డబుల్ సెగ్మెంట్‌లోకి మోటరోలా అడుగుపెట్టగా.. టెక్ అభిమానుల్లో అంచనాలు భారీ స్థాయికి చేరాయి.…