Motorola Razr Flex Leaks: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఫోల్డబుల్ ఫోన్లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో మోటరోలా మరో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. Motorola Razr Flex పేరుతో ప్రచారంలో ఉన్న ఈ ఫోన్‌కు సంబంధించిన వివరాలు Geekbenchలో కనిపించాయి. పాస్‌పోర్ట్ తరహా డిజైన్, శక్తివంతమైన Snapdragon చిప్‌సెట్, అధునాతన కెమెరాలు, భారీ బ్యాటరీ వంటి ఫీచర్లు ఇందులో ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. లీకుల ప్రకారం, ఈ ఫోన్ పాస్‌పోర్ట్ తరహాలో వెడల్పుగా తెరుచుకునే బుక్-స్టైల్ ఫోల్డబుల్ డిజైన్‌తో రావచ్చు. లోపల 6.92 అంగుళాల OLED డిస్‌ప్లే, బయట 4.97 అంగుళాల కవర్ స్క్రీన్ ఉండే అవకాశం ఉంది. ప్రధాన డిస్‌ప్లేలో 165Hz రిఫ్రెష్ రేట్ ఉండవచ్చని సమాచారం.
ఈ ఫోన్ Geekbench బెంచ్‌మార్క్ ప్లాట్‌ఫామ్‌లో కనిపించినట్లు టెక్నాలజీ వెబ్‌సైట్లు వెల్లడించాయి. లిస్టింగ్ ప్రకారం, ఇందులో Qualcomm Snapdragon 8 Gen 5 ప్రాసెసర్, 12GB RAM ఉండవచ్చు. పరీక్షల్లో సింగిల్-కోర్‌కు 2,669 పాయింట్లు, మల్టీ-కోర్‌కు 8,837 పాయింట్లు వచ్చినట్లు సమాచారం. ఫోన్‌లో Android 17 కూడా ఉండవచ్చని అంచనా.
ఫోటోగ్రఫీ కోసం Motorola Razr Flexలో రెండు 50MP వెనుక కెమెరాలు ఉండవచ్చని లీకులు సూచిస్తున్నాయి.
– 50MP ప్రైమరీ కెమెరా: సాధారణ ఫోటోగ్రఫీ కోసం.
– 50MP అల్ట్రా-వైడ్ కెమెరా: వైడ్ రేంజింగ్ ఫొటో తీయడానికి.
– 32MP సెల్ఫీ కెమెరాలు: లోపలి, బయటి స్క్రీన్ల వద్ద సెల్ఫీ కెమెరాలు ఉండవచ్చని సమాచారం.
ఈ ఫోల్డబుల్ ఫోన్‌లో 5,000mAh బ్యాటరీ ఉండవచ్చని అంచనా. అలాగే 25W Qi2 వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతు లభించే అవకాశం ఉంది. ప్రస్తుతం Motorola Razr Flex విడుదల తేదీ, ధర, భారత మార్కెట్లో లభ్యతపై అధికారిక ప్రకటన లేదు. కొన్ని నివేదికలు ఈ ఫోన్‌ను డిసెంబర్‌లో విడుదల చేసే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి.

