iPhoneకు పోటీగా Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Motorola Razr Flex పేరుతో రంగం సిద్ధం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Motorola Razr Flex: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మరో కొత్త ఫోల్డబుల్ ఫోన్‌ను తీసుకొచ్చేందుకు మోటరోలా రంగం సిద్ధం చేస్తుంది. వచ్చే ఏడాదిలో Motorola Razr Flex పేరుతో వైడ్ స్క్రీన్ ఫోల్డబుల్ ఫోన్‌ను లాంచ్ చేయనున్నట్లు సమాచారం. కంపెనీ ఆస్ట్రేలియా సపోర్ట్ టెస్టింగ్ వెబ్సైట్లో ఈ ఫోన్ పేరు కనిపించడం ఇప్పుడు వార్తల్లో నిలుస్తుంది. అయితే మోటరోలా ఇప్పటివరకు అధికారికంగా లాంచ్ తేదీని ప్రకటించలేదు. మోటరోలా వెబ్‌సైట్‌లోని సపోర్ట్ పేజీలో ‘Motorola Razr Flex 2027’ అనే పేరు కనిపించింది. అయితే అందులో పేర్కొన్న సెక్యూరిటీ వివరాలు ప్రాథమిక దశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పేజీలో ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్, ఆగస్టు 2029 వరకు సపోర్ట్ వంటి వివరాలు ఉన్నాయి. అంతేకాకుండా ‘టెస్ట్ సెక్యూరిటీ అప్డేట్స్’ అనే వివరాలు కూడా ఉన్నాయి.
నిజానికి సెప్టెంబర్ 9, 2026న మోటరోలా తన అధికారిక X ఖాతాలో ఓ ఫోల్డబుల్ ఫోన్‌కు సంబంధించిన టీజర్‌ను విడుదల చేసింది. ఇందులో చిన్న పరిమాణంలో, వెడల్పాటి డిస్ప్లేతో ఉండే ఫోల్డబుల్ ఫోన్ సిల్హౌట్‌ను చూపించింది. చివర్లో ‘Our Next Move’ అనే ట్యాగ్‌లైన్‌ను ఉంచింది. అయితే ఆ సమయంలో ఫోన్ పేరును లేదా లాంచ్ తేదీని వెల్లడించలేదు. లీకుల ప్రకారం.. Motorola Razr Flexలో 6.92 అంగుళాల OLED మెయిన్ డిస్ప్లే ఉండనుంది. ఇది 165Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేయనున్నట్లు సమాచారం. బయటివైపు 4.97 అంగుళాల కవర్ డిస్ప్లే ఉండే అవకాశం ఉంది. వెనుక భాగంలో 50 MP చొప్పున రెండు కెమెరాలను అందించనున్నట్లు తెలుస్తోంది.
Also Read
- Jio Recharge: Buy 1 Get 1 ఆఫర్ తో ఈ రెండు ప్లాన్లపై డబుల్ బెనిఫిట్స్..!
- BSNL నుంచి కొత్త రీఛార్జ్ ప్లాన్లు.. రూ.172, రూ.184, రూ.190లకే అన్లిమిటెడ్ కాలింగ్..!
- డ్యూయల్ 200MP కెమెరాలు, 7,050mAh+ బ్యాటరీతో Xiaomi 18 Pro సిరీస్ గ్లోబల్ లాంచ్ డేట్ ఫిక్స్..!
- 7 అంగుళాల భారీ డిస్ప్లే, 10,000mAh కంటే ఎక్కువ బ్యాటరీతో రాబోతున్న iQOO Z12 సిరీస్..!
ఇతర స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. ఈ ఫోన్లో 12GB RAM, 5,000mAh బ్యాటరీ, ఆండ్రాయిడ్ 17 ఆపరేటింగ్ సిస్టమ్ ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. గీక్‌బెంచ్ లిస్టింగ్‌లో స్నాప్‌డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ ప్రస్తావన కూడా కనిపించినట్లు సమాచారం. అయితే ఈ వివరాలేవీ మోటరోలా అధికారికంగా ధృవీకరించలేదు. ధర విషయంలోనూ ఓ ఆసక్తికరమైన సమాచారం బయటకు వచ్చింది. యూరప్‌కు చెందిన ఓ రిటైలర్ వెబ్సైట్లో 12GB RAM, 256GB స్టోరేజ్ వేరియంట్ ధర 1,510.90 యూరోలుగా ఉంది.
తాజావార్తలు
-
iPhoneకు పోటీగా Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Motorola Razr Flex పేరుతో రంగం సిద్ధం..!
-
RGV Review: “నేనొక నాస్తికుడిని.. కానీ సినిమా ప్రేమికుడిగా చెబుతున్నా”.. రామాయణంపై ఆర్జీవీ సెకండ్ రివ్యూ..!
-
ICICI Bank Loan Fraud: ICICI బ్యాంకుకు టోకరా.. ఉద్యోగం లేదు.. బ్యాంక్ అకౌంట్ లేదు.. అయినా రూ.30 లక్షల లోన్!
-
Yogi Adityanath: దీపావళి కాలుష్యంపై యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు.. ఆందోళన అవసరం లేదన్న సీఎం
-
Amit Shah Vizag Visit Cancelled: హోంమంత్రి విశాఖ పర్యటనకు బ్రేక్.. అమిత్ షా పర్యటన రద్దు
ట్రెండింగ్
-
Captain Sanju Samson: పుట్టినరోజున కెప్టెన్‌గా సంజూ శాంసన్‌కు ప్రమోషన్..
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్‌కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!
-
Aryaveer Sehwag: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న.. వీరేంద్ర సెహ్వాగ్ కొడుకు ఎమోషనల్.!