200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Motorola Moto G Max 5G Launched: మోటరోలా (Motorola) కొత్తగా Moto G Max 5Gను విడుదల చేసింది. ముఖ్యంగా 200MP ప్రైమరీ కెమెరాతో ఈ ఫోన్ ఫోటోగ్రఫీ ప్రియుల కోసం రూపొందించబడింది. ఇక ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్ ఉండటంతో ఫోటోలు, వీడియోలు మరింత స్థిరంగా రికార్డ్ చేయవచ్చు. దీనికి తోడు 120-డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూ కలిగిన 8MP అల్ట్రా-వైడ్ కెమెరా కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP ఫ్రంట్ కెమెరాను అందించారు. అలాగే ఈ ఫోన్‌తో 30fps వద్ద 2K వీడియో రికార్డింగ్ కూడా చేయవచ్చు.
డిస్ప్లే విషయానికి వస్తే.. 6.8 అంగుళాల AMOLED ప్యానెల్‌ను అందించారు. ఇది 1272 x 2772 పిక్సెల్ రిజల్యూషన్‌తో వచ్చే ఈ స్క్రీన్ గరిష్టంగా 5000 నిట్స్ బ్రైట్నెస్ను అందించగలదు. దీంతో ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ వల్ల స్క్రోలింగ్, గేమింగ్ అనుభవం మరింత స్మూత్‌గా ఉంటుంది. అంతేకాకుండా దీనికి గొరిల్లా గ్లాస్ 7i రక్షణను కూడా అందించారు.
Also Read
- 8000mAh బ్యాటరీ, 7-అంగుళాల OLED డిస్ప్లే, 50MP కెమెరా.. Redmi నుంచి కొత్త ఫోన్ విడుదల తేదీ ఖరారు..
- రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!
- Flipkart Freedom Sale 2026: ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ డేట్ ఫిక్స్.. iPhone 17, Galaxy S25పై భారీ డీల్స్
- 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, 165Hz రిఫ్రెష్ రేట్ తో రాబోతున్న iQOO Z11 5G..!
పర్ఫార్మెన్స్ కోసం ఈ స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ డిమెంసిటీ 6400 ప్రాసెసర్‌ను వాడారు. ఫోన్ 8GB RAM, 256GB స్టోరేజ్‌తో ఒకే వేరియంట్లో అందుబాటులోకి రానుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత Hello UIపై ఇది పనిచేస్తుంది. భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. బ్యాటరీ పరంగా Moto G Max 5Gలో 5,200mAh బ్యాటరీని అందించారు. దీనికి 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. USB Type-C పోర్ట్ ద్వారా వేగంగా ఛార్జ్ చేసుకునే అవకాశం ఉంటుంది.
మోటరోలా ఈ ఫోన్లో మన్నికకు కూడా పెద్దపీట వేసింది. IP66, IP68, IP69 రేటింగ్‌లతో నీరు, దుమ్ము నుంచి రక్షణ కల్పించారు. అంతేకాకుండా MIL-STD-810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ కూడా ఉండటంతో కఠిన పరిస్థితుల్లోనూ ఫోన్ నిలకడగా పనిచేయగలదు. ప్రస్తుతం Moto G Max 5Gను బ్రెజిల్లో BRL 2,519.10 (రూ.47,000) ధరకు విడుదల చేసింది. లైట్ బ్లూ, గ్రాఫైట్ రంగుల్లో అందుబాటులో ఉన్న ఈ ఫోన్‌ను అక్కడ మోటరోలా అధికారిక ఆన్లైన్ స్టోర్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. అయితే భారత మార్కెట్లో ఎప్పుడు విడుదల చేస్తారనే విషయంపై కంపెనీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా తీరుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం
-
EPFO New Portal: PF డబ్బులు ఎక్కడున్నాయో ఇక ఈజీగా తెలుసుకోండి.. EPFO కీలక మార్పులు
-
AP Government: వారసత్వ భూములపై గుడ్‌న్యూస్.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
Melania Trump: మెలానియా ట్రంప్‌కు హత్యా బెదిరింపులు.. ఇరాన్ వీడియో కలకలం
-
Off The Record: మంత్రులకు ఎమ్మెల్యేల షాక్? చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో ఆధిపత్య పోరు
ట్రెండింగ్
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?
-
Home Cleaning Hacks : టీ, కాఫీ కప్పుల మొండి మరకలా.? ఈ టిప్స్‌తో సులభంగా 5 నిమిషాల్లో క్లీన్ చేయండి.!
-
Clean Fridge Door Rubber: ఫ్రిజ్ డోర్ రబ్బర్‌కు మరకలా..? ఈ ట్రిక్‌తో 10 నిమిషాల్లో తలతల మెరిసిపోవాల్సిందే..!
-
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!