Site icon NTV Telugu

Motorola: సరికొత్త ఫీచర్లతో భారత మార్కెట్లోకి రానున్న మోటరోలా ఎడ్జ్ 70

Untitled Design (2)

Untitled Design (2)

మోటరోలా యాజమాన్యం తాజాగా ఓ ప్రకటన చేసింది. ఇప్పటికే యూరప్, మిడిల్ ఈస్ట్ మార్కెట్లలో విడుదలైన మోటరోలా ఎడ్జ్ 70 స్మార్ట్‌ఫోన్, గ్లోబల్ వేరియంట్‌తో పోలిస్తే భారత వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొన్ని ముఖ్యమైన అప్‌గ్రేడ్‌లతో డిసెంబర్ 15న భారత మార్కెట్లోకి రానున్నట్లు కంపెనీ ప్రకటించింది.

మోటరోలా ఎడ్జ్ 70 మూడు ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులోకి రానుంది. పాంటోన్ బ్రాంజ్ గ్రీన్, పాంటోన్ లిల్లీ ప్యాడ్, గాడ్జెట్ గ్రే రంగులు ఈ ఫోన్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. భారత మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ స్మార్ట్‌ఫోన్‌లో మూడు 50MP కెమెరాలతో కూడిన అధునాతన కెమెరా సెటప్‌ను, పెద్ద బ్యాటరీని అందించారు. అల్ట్రా-స్లిమ్ డిజైన్‌తో పాటు శక్తివంతమైన ఫీచర్లు ఈ ఫోన్‌ను మరింత ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి.

ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ ఈ-కామర్స్ వెబ్‌సైట్‌తో పాటు ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు. డిసెంబర్ 15న లాంచ్ అయిన వెంటనే అమ్మకాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం. డిస్‌ప్లే విషయానికి వస్తే, మోటరోలా ఎడ్జ్ 70లో 6.67 అంగుళాల pOLED డిస్‌ప్లేను అందించారు. ఇది 1220 x 2712 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో పాటు 120Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది.ప్రీమియం డిజైన్, ఆధునిక కెమెరా ఫీచర్లతో మోటరోలా ఎడ్జ్ 70 భారత మార్కెట్లో మంచి స్పందన పొందే అవకాశముందని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Exit mobile version