Motorola Edge 60 Fusion vs Vivo T4 Pro 5G vs Realme P4 Pro 5G: భారతదేశంలో మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ పోటీపోటీగానే జరుగుతూనే ఉంటుంది. ప్రతి నెల అనేక కంపెనీలలో కొత్త ఫోన్లు విడుదలవుతుండటంతో ఏ మొబైల్ కొనాలి అనే సందేహం రావడం సహజం. అయితే ఆగస్టు 2025లో Motorola Edge 60 Fusion, Vivo T4 Pro 5G, Realme P4 Pro 5G, Motorola Edge 60 Fusion అనే మూడు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యి వినియోగదారులతో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసాయి. ప్రతి ఫోన్ ప్రత్యేక ఫీచర్లతో వస్తుండటంతో మీ బడ్జెట్‌కి ఏది సరైన మొబైల్ అవుతుందో ఒకసారి చూద్దాం.
డిజైన్ అండ్ స్టైల్:
Realme P4 Pro 5G స్టైలిష్ లుక్ ఇచ్చే డ్యూయల్-టోన్ బ్యాక్ డిజైన్‌తో వస్తోంది. దీని IP65/IP66 రేటింగ్ దీనిని మరింత మన్నికైనదిగా మారుస్తుంది. మరోవైపు Vivo T4 Pro 5G క్వాడ్-కర్వ్డ్ AMOLED డిజైన్ తో ప్రీమియం ఫీల్ ఇస్తుంది. Motorola Edge 60 Fusion మాత్రం IP68/IP69 రేటింగ్, మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ తో రఫ్ అండ్ టఫ్ యూజర్స్ కోసం పర్ఫెక్ట్ ఆప్షన్.
ప్రాసెసర్:
Realme P4 Pro 5G, Vivo T4 Pro 5G రెండూ Snapdragon 7 Gen 4 చిప్‌సెట్‌పై నడుస్తాయి. గేమింగ్, మల్టీటాస్కింగ్, AI టాస్క్ లు అన్నీ సూపర్ స్మూత్‌గా ఉంటాయి. Motorola Edge 60 Fusion మాత్రం Dimensity 7400 ప్రాసెసర్‌తో వస్తుంది. ఇది డైలీ యూజ్‌కి బాగానే సరిపోతుంది కానీ హెవీ గేమింగ్‌లో Snapdragon కంటే కొంచెం వెనుకబడుతుంది.
INDIA: ప్రతి భారతీయుడు గర్వించే విషయం.. పరదేశి మహిళా తన కూతురికి ఏమని పేరు పెట్టిందంటే?
డిస్‌ప్లే:
డిస్‌ప్లే విషయంలో Realme P4 Pro 5G 6.8 అంగుళాల OLED కర్వ్డ్ డిస్‌ప్లేతో వస్తోంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు 6500 నిట్స్ బ్రైట్నెస్ ఇస్తుంది. ఇక Vivo T4 Pro 5G 6.78 అంగుళాల క్వాడ్-కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేను అందిస్తోంది. ఇది 1.5K రెజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 5000 నిట్స్ బ్రైట్నెస్‌తో ఆకట్టుకుంటుంది. అలాగే Motorola Edge 60 Fusion 6.67 అంగుళాల pOLED డిస్‌ప్లేతో వస్తుంది. దీనిలో కూడా 1.5K రెజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్నా, బ్రైట్నెస్ 4500 నిట్స్ మాత్రమే. కాబట్టి క్లారిటీ, బ్రైట్నెస్ విషయంలో Realme ముందంజలో ఉంది.
కెమెరా సెటప్:
ఈ విషయానికి వస్తే Vivo T4 Pro 5G 50MP మెయిన్ కెమెరా, 50MP టెలిఫోటో (3X జూమ్) లెన్స్, 8MP అల్ట్రావైడ్ లెన్స్ కలిపి ఒక వెర్సటైల్ సెట్‌ని ఇస్తుంది. Realme P4 Pro 5G 50MP మెయిన్, 8MP అల్ట్రావైడ్ లెన్స్‌తో వస్తూనే, 50MP సెల్ఫీ కెమెరాతో సెల్ఫీ లవర్స్‌కి బెస్ట్ ఆప్షన్ అవుతుంది. Motorola Edge 60 Fusionలో 50MP OIS మెయిన్, 13MP అల్ట్రావైడ్, 32MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. కాబట్టి జూమ్, పోర్ట్రెయిట్ కావాలంటే వివో, సెల్ఫీల కోసం Realme, బాలెన్స్ కెమెరా కోసం Moto మంచి ఎంపిక.
బ్యాటరీ, ఛార్జింగ్:
బ్యాటరీ సెగ్మెంట్ లో Realme P4 Pro 5G 7000mAh భారీ బ్యాటరీతో వస్తోంది. ఇది 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. Vivo T4 Pro 5Gలో 6500mAh బ్యాటరీ ఉన్నా, 90W ఫాస్ట్ ఛార్జింగ్‌తో త్వరగా ఛార్జ్ అవుతుంది. Motorola Edge 60 Fusionలో 5500mAh బ్యాటరీ, 68W ఫాస్ట్ ఛార్జింగ్ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి రెండు రోజుల బ్యాకప్ కోసం Realme బెస్ట్, ఫాస్ట్ ఛార్జింగ్ కావాలంటే Vivo, సాధారణ వినియోగదారులకు Moto సరిపోతుంది.
ధర:
Realme P4 Pro 5G ప్రారంభ ధర రూ.24,999. Vivo T4 Pro 5G ధర రూ.25,000–రూ.30,000 మధ్య ఉంటుంది. Motorola Edge 60 Fusion మాత్రం అత్యంత తక్కువ ధరలో రూ.22,999కే లభిస్తోంది.
మొత్తానికి వినియోగదారుల అవసరాల మీద ఆధారపడి ఎంపిక వేరుగా ఉంటుంది. బ్యాటరీ, డిస్‌ప్లే కోసం Realme, కెమెరా అనుభవం కోసం Vivo, డ్యూరబుల్ మరియు బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ కావాలనుకుంటే Moto మంచి ఆప్షన్. మొత్తంగా మూడు ఫోన్లు తమ తరహాలో బెస్ట్. మీరు ఏ ఫీచర్‌కి ప్రాధాన్యం ఇస్తారో దాని ఆధారంగా మొబైల్ ను ఎంపిక చేసుకోవాలి.
