Site icon NTV Telugu

Motorola Edge 50 Pro Price Cut: అమెజాన్‌లో సూపర్ డీల్.. మోటరోలా ఎడ్జ్ 50 ప్రోపై 13 వేల తగ్గింపు!

Motorola Edge 50 Pro Price Drop

Motorola Edge 50 Pro Price Drop

ఇ-కామర్స్ దిగ్గజం ‘అమెజాన్’ ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారులకు మంచి అవకాశాన్ని అందిస్తోంది. ప్రస్తుతం అమెజాన్‌లో ఇయర్ ఎండ్ సేల్ నడుస్తోంది. ఇందులో భాగంగా ‘మోటరోలా ఎడ్జ్ 50 ప్రో’పై భారీ తగ్గింపును ఇస్తోంది. ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను చాలా తక్కువ ధరకు అందుబాటులో ఉంది. చాలా కాలంగా శక్తివంతమైన, వేగంగా ఛార్జ్ అయ్యే ఫోన్ కోసం చూస్తున్న వారికి ఈ డీల్ మంచి ఎంపిక అనే చెప్పాలి.

మోటరోలా ఎడ్జ్ 50 ప్రో స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో 12జీబీ+256జీబీ వేరియంట్‌ రూ.35,999 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. ఇప్పుడు అమెజాన్‌లో రూ.24,194కి లిస్ట్ చేయబడింది. అంటే మీరు రూ.11,805 తగ్గింపును పొందనున్నారు. మీరు ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి కొనుగోలు చేస్తే.. రూ.1,000 ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అంటే మోటరోలా ఎడ్జ్ 50 ప్రోపై మీకు దాదాపుగా 13 వేల తగ్గింపు లభిస్తుంది. ఈఎంఐలో కొనుగోలు చేస్తే.. మీరు రూ.1,250 వరకు అదనపు తగ్గింపును కూడా పొందవచ్చు. మొత్తంగా ఈ ఫోన్‌ను దాదాపుగా రూ.22,000కు పొందవచ్చు. ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్ ద్వారా ఎడ్జ్ 50 ప్రో ధర మరింత తగ్గనుంది.

Also Read: Naga Chaitanya: 2025 నాకెంతో ప్రత్యేకం.. ఆనందంలో నాగ చైతన్య!

మోటరోలా ఎడ్జ్ 50 ప్రో ఫీచర్స్:
# 6.7 అంగుళాల 1.5K పీఓఎల్‌ఈడీ కర్వ్‌డ్‌ డిస్‌ప్లే
# 144Hz రిఫ్రెష్‌ రేటు
# 2000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌
# క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 7 జనరేషన్‌ 3 ప్రాసెసర్‌
# ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత హెలో యూఐ
# ఐపీ68 రేటింగ్‌
# 50 ఎంపీ ప్రధాన కెమెరా, 13 ఎంపీ అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ కెమెరా, 10 టెలిఫొటో లెన్స్‌
# సెల్ఫీల కోసం 50 ఎంపీ కెమెరా
# 4500 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 125W వైర్డ్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌, 50W వైర్‌లెస్‌ టర్బో ఛార్జింగ్‌

Exit mobile version