బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్‌లో లాంచ్.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Moto g77 Power: మోటరోలా (motorola)భారత మార్కెట్లో తన కొత్త moto g77 Power స్మార్ట్‌ఫోన్‌ను అధికారికంగా లాంచ్ చేసింది. భారీ 7000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, MediaTek Dimensity 6400 ప్రాసెసర్, 50MP Sony కెమెరాతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. ఇందులో 6.72 అంగుళాల Full HD+ LCD డిస్ప్లేను అందించారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, గరిష్టంగా 1050 నిట్స్ బ్రైట్‌నెస్‌తో స్క్రీన్ మరింత స్మూత్ అనుభూతిని అందిస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ (Corning Gorilla Glass) 7i రక్షణ కూడా దీనికి ఉంది.
ఈ ఫోన్ 6nm టెక్నాలజీపై రూపొందించిన MediaTek Dimensity 6400 ప్రాసెసర్ కలిగి ఉంది. ఇందులో 8GB LPDDR4X ర్యామ్‌తో పాటు అదనంగా 16GB వరకు వర్చువల్ ర్యామ్ సపోర్ట్ ఉంది. 128GB UFS 2.2 స్టోరేజ్‌ను మైక్రో SD కార్డ్ ద్వారా 1TB వరకు పెంచుకోవచ్చు.
Also Read
- Amazon Festival Sale: ఈ కంపెనీ ల్యాప్‌టాప్‌లపై భారీ ఆఫర్లు.. ఓ లుక్కేయండి..
- Apple iPhone Offers: ఐఫోన్ లవర్స్‌కు పండగే.. అమెజాన్ సేల్‌లో భారీగా తగ్గిన ఐఫోన్ 16, 17e ధరలు!
- iQOO 16 Launch in India Soon: iQOO 16 త్వరలో భారత్‌లోకి.. 8400mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న ఫోన్!
- iQOO Neo 12: iQOO Neo 12 లాంచ్‌కు రెడీ?.. గీక్‌బెంచ్‌లో 16GB RAMతో లిస్టింగ్.. 9,000mAh బ్యాటరీ?
కెమెరా సిస్టం:
ఫోటోగ్రఫీ కోసం moto g77 Powerలో Sony LYTIA 600 సెన్సార్‌తో కూడిన 50MP ప్రైమరీ కెమెరాను అందించారు. దీనికి తోడు 8MP అల్ట్రా వైడ్ కెమెరా కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP ఫ్రంట్ కెమెరాను అందించారు. ముందు, వెనుక కెమెరాలతో 2K వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ ఉంటుంది.
మూడు సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్:
ఈ ఫోన్ Android 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తుంది. Android 17 వరకు ఒక ప్రధాన OS అప్డేట్తో పాటు మూడు సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్డేట్స్ అందిస్తామని మోటరోలా హామీ ఇచ్చింది.
7000mAh బ్యాటరీ:
moto g77 Powerలో ప్రధాన ఆకర్షణ 7000mAh భారీ బ్యాటరీ. దీనికి 30W TurboPower ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అలాగే 6W వైర్డ్ రివర్స్ ఛార్జింగ్ ఫీచర్ కూడా అందించారు. దీంతో ఇతర డివైస్‌లను కూడా ఈ ఫోన్ ద్వారా ఛార్జ్ చేసుకోవచ్చు.

ప్రీమియం ఫీచర్లు:
ఈ స్మార్ట్‌ఫోన్‌కు IP64 డస్ట్, వాటర్ స్ప్లాష్ రెసిస్టెన్స్ రేటింగ్ లభించింది. అలాగే MIL-STD-810H మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ సర్టిఫికేషన్ కూడా ఉంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, స్టీరియో స్పీకర్లు, Dolby Atmos, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, FM రేడియో, Bluetooth 5.4, Wi-Fi 5, 5G కనెక్టివిటీ వంటి అనేక ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
ధర:
ఈ Motorola moto g77 Power 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.25,999గా నిర్ణయించారు. ఈ ఫోన్ పాంటోన్ ఇంపెనెట్రబుల్, పాంటోన్ నాటికల్ బ్లూ, పాంటోన్ ఫ్యూషియా రెడ్ రంగుల్లో అందుబాటులోకి రానుంది. ఫ్లిప్‌కార్ట్, మోటరోలా అధికారిక వెబ్సైట్, ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. ఫోన్ కొనుగోలు చేసే వారికి యాక్సిస్ బ్యాంక్, HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డులపై రూ.2,000 ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. లేదా పాత ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేస్తే రూ.2,000 వరకు అదనపు తగ్గింపు పొందే అవకాశం ఉంది.
Why settle for ordinary when you can wow all the way?
moto g77 POWER starting at 23,999*.
Sale starts 13th July on Flipkart, https://t.co/azcEfy2uaW and leading retail stores.#motorolaindia #motog77power #wowalltheway pic.twitter.com/0YRLjiBpIt
— Motorola India (@motorolaindia) July 8, 2026
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు