OLED డిస్‌ప్లే, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, డైమెన్సిటీ చిప్‌సెట్‌తో Moto G67, G77.. లాంచ్‌కు ముందే లీకైన స్పెసిఫికేషన్లు

Moto G67 G77 (1)

Moto G67 G77 (1)

Moto G67, G77: మోటరోలా(Motorola) G సిరీస్‌లో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లను త్వరలోనే లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. Moto G67, Moto G77 పేర్లతో ఇవి మార్కెట్లోకి రాబోతున్నట్లు సమాచారం. గ్రీక్ ఆన్‌లైన్ రిటైల్ వెబ్‌సైట్‌లో లభించిన లిస్టింగ్ ఆధారంగా ఈ ఫోన్లకు సంబంధించిన కీలక వివరాలు లీక్ అయ్యాయి. ఇప్పటివరకు Moto G57లో LCD డిస్‌ప్లే ఇచ్చిన మోటరోలా.. ఈసారి G67, G77 మోడళ్లలో OLED డిస్‌ప్లేకు మారనుందని సమాచారం.

CM Chandrababu Davos Visit: మూడో రోజు దావోస్ టూర్.. నేడు సీఎం చంద్రబాబు కీలక సమావేశాలు..

×
×
Ad

Moto G67లో మీడియాటెక్ డైమెంసిటీ 6300 ప్రాసెసర్ ఉండగా, Moto G77లో మరింత శక్తివంతమైన డైమెంసిటీ 6400 చిప్‌సెట్ ఇవ్వనున్నారు. అలాగే G67లో 4GB RAM, 50MP మెయిన్ కెమెరా ఉండగా.. G77లో 8GB RAM, 108MP మెయిన్ కెమెరా అందించనున్నారు. ఈ రెండు ఫోన్లలో 6.8 అంగుళాల 1.5K ఎక్స్‌ట్రీమ్ AMOLED డిస్‌ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్, గరిష్టంగా 5000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉంటాయి.

WhatsApp New Button Feature: వాట్సాప్‌లో కొత్త బటన్.. ఒకే క్లిక్‌తో సరికొత్త ఫీచర్లు..!

G67లో 50MP సోనీ LYT-600 సెన్సర్‌తో మెయిన్ కెమెరా, G77లో 108MP మెయిన్ కెమెరా ఇవ్వనున్నారు. రెండింటిలోనూ 8MP అల్ట్రా-వైడ్ కెమెరా, 32MP ఫ్రంట్ కెమెరా ఉంటాయి. ఇంకా ఇందులో 5200mAh బ్యాటరీతో పాటు 30W టర్బో ఛార్జింగ్ సపోర్ట్ అందించనున్నారు. అలాగే IP64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్, MIL-STD 810H మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, స్టీరియో స్పీకర్లు, డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంటాయి. ఈ ఫోన్లు Android 16తో రానున్నాయి. 5G, Wi-Fi 6, బ్లూటూత్ 5.4, NFC, USB Type-C వంటి ఆధునిక కనెక్టివిటీ ఆప్షన్లు ఉంటాయి. ఇప్పటివరకు ధర, అమ్మకాల తేదీపై ఎటువంటి అధికారిక సమాచారం రాలేదు. అయితే లాంచ్ త్వరలోనే జరిగే అవకాశం ఉందని టెక్ వర్గాలు అంచనా.