7,000mAh బ్యాటరీ, 6.72 అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లేతో అమ్మకాల సునామి సృష్టించడానికి సిద్దమైన Moto G36!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Moto G36: మోటోరోలా నుండి మరో కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ మోటో G36 త్వరలో మార్కెట్లోకి రాబోతుంది. దీనికి సంబంధించిన వివరాలు చైనా రెగ్యులేటరీ అథారిటీ TENAA వెబ్‌సైట్‌లో దర్శనమిచ్చాయి. ఈ ఫోన్ కొన్ని అప్‌గ్రేడ్ ఫీచర్లతో గత సంవత్సరం విడుదలైన మోటో G35కు అప్డేటెడ్ గా రానుంది. ఇక లిస్టింగ్ ప్రకారం, మోటో G36 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు ఇలా ఉన్నాయి.
డిస్‌ప్లే:
మోటో జG36 6.72 అంగుళాల TFT డిస్‌ప్లేను 1,080×2,400 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో కలిగి ఉంటుందని TENAA లిస్టింగ్ సూచిస్తుంది. ఇది మోటో G35 కంటే పెద్ద డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.
Also Read
- Airtel Postpaid Plans Price Hike: Airtel కస్టమర్లకు షాక్.. పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్ ధరలు భారీగా పెంపు
- Lenovo ThinkBook 14x: లెనోవా ThinkBook 14x వచ్చేసింది.. 120Hz OLED డిస్‌ప్లే, Core Ultra ప్రాసెసర్
- Starlink India Row: ‘మార్కెట్ గుత్తాధిపత్యం కోసమే అడ్డుకుంటున్నారు’.. Starlink Indiaపై ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు
- Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
ప్రాసెసర్, మెమరీ:
ఈ ఫోన్ 2.4GHz బేస్ కోర్ ఫ్రీక్వెన్సీతో ఆక్టా కోర్ చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఇందులో 4GB, 8GB, 12GB, 16GB RAM ఆప్షన్లు అలాగే 64GB, 128GB, 256GB, 512GB స్టోరేజ్ ఆప్షన్లు లభించే అవకాశం ఉంది.
AP Secretariat: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. సచివాలయంలో ప్రమోషన్లు
కెమెరా:
Moto G36 వెనుక వైపు 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరాతో డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. సెల్ఫీల కోసం ముందు వైపు 32 మెగాపిక్సెల్ కెమెరా ఉండవచ్చని అంచనా.. ఇది మోటో G35లో ఉన్న 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కంటే అప్‌గ్రేడ్.
బ్యాటరీ:
ఈ హ్యాండ్‌సెట్‌లో 6,790mAh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. దీనిని మోటోరోలా 7,000mAhగా లాంచ్ చేయవచ్చు. ఇది పెద్ద బ్యాటరీ కావడంతో.. ఇది వినియోగదారులకు ఎక్కువ సేపు ఉపయోగించడానికి అవకాశం కల్పిస్తుంది.
Leica కెమెరా, 5,500mAh బ్యాటరీ, 1336 సింగిల్ కోర్ స్కోరుతో రాబోతున్న Xiaomi 15T!
డిజైన్, ఇతర ఫీచర్లు:
TENAA లిస్టింగ్ ప్రకారం, ఈ ఫోన్ పర్పుల్ రంగులో అందుబాటులో ఉంటుంది. ఇది ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌లను కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ కొలతలు 166.3×76.5×8.7mm కాగా, 210గ్రాములు ఉండనుంది.
మొత్తంగా మోటో G35 5G గత సంవత్సరం డిసెంబర్‌లో భారతదేశంలో రూ. 9,999 ధరతో విడుదలైన విషయం తెలిసిందే. కాబట్టి మోటో G36 కూడా బడ్జెట్ ఫ్రెండ్లీగా రానుంది. అయితే, మోటోరోలా ఇంకా దీని లాంచ్ తేదీని అధికారికంగా ప్రకటించలేదు.
తాజావార్తలు
-
Airtel Postpaid Plans Price Hike: Airtel కస్టమర్లకు షాక్.. పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్ ధరలు భారీగా పెంపు
-
Nana Patekar Funeral: నానా పటేకర్ చివరి కోరిక ఇదే.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు.. ఎక్కడంటే?
-
Kitchen Sink Tips: గిన్నెలు తోమేటప్పుడు బట్టలు తడుస్తున్నాయా? రూపాయి ఖర్చు లేకుండా ఈ 5 ట్రిక్స్ ట్రై చేయండి
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
AA 23 : అల్లు అర్జున్ – లోకేష్ కనకరాజ్ సినిమా క్యాన్సిల్?
ట్రెండింగ్
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్‌ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!