ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ మోటోరోలా ఎప్పటికప్పుడు మొబైల్ ప్రియులను ఆకట్టుకొనే విధంగా సరికొత్త లుక్ తో అదిరిపోయే ఫీచర్స్ తో కొత్త ఫోన్లను మార్కెట్ లోకి వదులుతుంది.. తాజాగా మోటో మరో కొత్త ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది.. మోటో జీ స్టైలస్ 2024 పేరుతో కొత్త ఫోన్‌ను త్వరలోనే మార్కెట్లోకి లాంచ్ చేయనున్నారు.. ఇక కంపెనీ ఈ ఫోన్ ఫీచర్లకుకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయిన్పటికీ. నెట్టింట కొన్ని ఫీచర్లు లీక్ అవుతున్నాయి. ఈ ఫోన్ ఫీచర్స్, ధర ఎంత వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
2024 స్మార్ట్ ఫోన్‌లో పాత మోడల్‌తో పోల్చితే అధునాతన ఫీచర్లను అందించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి ఈ ఫోన్ సేల్ ప్రారంభం అవుతుందని చెబుతున్నారు.. ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ విషయానికొస్తే.. 6.5 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఇవ్వనున్నారని సమాచారం. ఇకపోతే 2,200 x 1,080 పిక్సెల్‌తో ఈ స్క్రీన్‌ను తీసుకొస్తున్నట్లు సమాచారం. ఈ స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో పనిచేస్తుందని తెలుస్తోంది. ఈ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందించారు..
ఇకపోతే కెమెరా విషయానికొస్తే.. సెల్ఫీ ప్రియులకు పండగే అని చెప్పాలి.. 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అలాగే, సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇందులో 20 వాట్స్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని అందించనున్నారు.. ఇక ఫీచర్స్ లీక్ అయ్యాయి కానీ ధర ఎంత అనేది మాత్రం తెలియలేదు..