Meta AI-Powered Smart Glasses: 3K వీడియో రికార్డింగ్, లైవ్ ట్రాన్స్లేషన్.. ఏఐ పవర్డ్ మెటా గ్లాసెస్ విడుదల
- ఏఐ పవర్డ్ మెటా గ్లాసెస్
- 3K వీడియో రికార్డింగ్, లైవ్ ట్రాన్స్లేషన్
- ప్రారంభ ధర 299 డాలర్లు (సుమారు రూ. 28,000)
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టెక్నాలజీ దిగ్గజం మెటా ప్లాట్‌ఫామ్స్, ప్రముఖ కళ్లద్దాల తయారీ సంస్థ ఎస్సిలార్ లక్సోటికాతో కలిసి కొత్త తరం ఏఐ పవర్డ్ స్మార్ట్ గ్లాసెస్‌ను ఆవిష్కరించింది. ‘మెటా గ్లాసెస్’ పేరుతో విడుదలైన ఈ వేరబుల్ డివైస్‌లు, ఇప్పటికే మార్కెట్లో ఉన్న రే-బాన్ మెటా, ఓక్లీ మెటా సిరీస్‌లకు మరింత అధునాతన వెర్షన్‌గా నిలుస్తున్నాయి. అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, 3K వీడియో రికార్డింగ్, లైవ్ ట్రాన్స్లేషన్, హ్యాండ్స్-ఫ్రీ ఫోటోగ్రఫీ వంటి ఫీచర్లతో ఈ స్మార్ట్ గ్లాసెస్ టెక్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారాయి.
ధర, లభ్యత
మెటా గ్లాసెస్ ప్రారంభ ధర 299 డాలర్లు (సుమారు రూ. 28,000). ఈ గ్లాసెస్ ప్రస్తుతం మెటా అధికారిక వెబ్‌సైట్‌తో పాటు లెన్స్క్రాఫ్టర్స్, సన్‌గ్లాస్ హట్, బెస్ట్ బై, అమెజాన్, ఇతర ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఇవి అమెరికా, యూకే, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, స్వీడన్, స్విట్జర్లాండ్ సహా పలు దేశాల్లో విక్రయిస్తున్నారు. భారత మార్కెట్లో విడుదలపై మెటా ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.
Also Read
- 144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
- ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
- 8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
- Apple iPhone 18 Series: సెప్టెంబర్ లాంచ్‌పై కీలక సమాచారం.. ప్రో మోడల్స్‌కే ఛాన్స్!
ఆకర్షణీయమైన డిజైన్
మెటా గ్లాసెస్ మూడు ఫ్రేమ్ స్టైల్స్‌లో అందుబాటులో ఉన్నాయి. క్లాసిక్ బ్లాక్, టార్టాయిస్, రేసింగ్ గ్రీన్, లినెన్, మెర్లాట్, మహోగని, సాండ్స్టోన్ వంటి రంగుల్లో వీటిని అందిస్తున్నారు. వినియోగదారులు క్లియర్, సన్, ట్రాన్సిషన్, పోలరైజ్డ్ లెన్స్ ఎంపికలను కూడా ఎంచుకోవచ్చు. మొత్తం 26 డిజైన్ కాంబినేషన్లు అందుబాటులో ఉన్నాయని కంపెనీ తెలిపింది.
AIతో మరింత స్మార్ట్ అనుభవం
ఈ గ్లాసెస్‌లో మెటా అభివృద్ధి చేసిన “మ్యూస్ స్పార్క్” AI మోడల్ పనిచేస్తుంది. దీనివల్ల వినియోగదారులు తమ చుట్టూ కనిపించే వస్తువులు, ప్రదేశాలు, పరిస్థితుల గురించి నేరుగా ప్రశ్నలు అడగవచ్చు. అలాగే లైవ్ ట్రాన్స్లేషన్, కాంటెక్స్ట్ బేస్డ్ AI అసిస్టెన్స్, షెడ్యూల్ మేనేజ్మెంట్, హ్యాండ్స్-ఫ్రీ సమాచారం పొందడం, వాయిస్ కమాండ్ల ద్వారా నియంత్రణ వంటి సదుపాయాలు లభిస్తాయి.
20 భాషల్లో లైవ్ ట్రాన్స్లేషన్
ఈ గ్లాసెస్ హిందీ, స్పానిష్, ఫ్రెంచ్, జర్మన్, అరబిక్, జపనీస్, కొరియన్, మాండరిన్ చైనీస్, పోర్చుగీస్ సహా 20 భాషల్లో ప్రత్యక్ష అనువాదానికి మద్దతు ఇస్తాయి. భవిష్యత్తులో మరో 14 భాషలను జోడించనున్నట్లు మెటా వెల్లడించింది.
12MP కెమెరా, 3K వీడియో రికార్డింగ్
మెటా గ్లాసెస్‌లో 100-డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూ కలిగిన 12 మెగాపిక్సెల్ కెమెరా అమర్చారు. దీని ద్వారా 3024 × 4032 పిక్సెల్ ఫోటోలు.. 3K వీడియో రికార్డింగ్ (30fps), 1080p వీడియో (60fps), 720p వీడియో (120fps) స్లో మోషన్ వీడియో హైపర్‌ల్యాప్స్ రికార్డింగ్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. అలాగే కొత్త “డైనమిక్ ఫోటో” ఫీచర్ ద్వారా ఒకేసారి అనేక ఫ్రేమ్‌లను క్యాప్చర్ చేసి ఉత్తమమైన ఫోటోను AI ఎంపిక చేస్తుంది.
శక్తివంతమైన ఆడియో సిస్టమ్
మెటా గ్లాసెస్‌లో ఓపెన్-ఇయర్ స్పీకర్లు, అడాప్టివ్ వాల్యూమ్ టెక్నాలజీ ఉన్నాయి. అదనంగా ఆరు మైక్రోఫోన్లతో కూడిన ప్రత్యేక వ్యవస్థ వాయిస్‌ను స్పష్టంగా క్యాప్చర్ చేస్తుంది. గాలి శబ్దాన్ని తగ్గించే నాయిస్ రిడక్షన్ టెక్నాలజీ కూడా ఇందులో ఉంది.
బ్యాటరీ, స్టోరేజ్
ఒకే ఛార్జ్‌పై ఈ గ్లాసెస్ 8 గంటలకు పైగా పనిచేస్తాయి. ఛార్జింగ్ కేస్ సహాయంతో మొత్తం బ్యాటరీ బ్యాకప్ 40 గంటల వరకు పెరుగుతుంది. 32GB అంతర్గత స్టోరేజ్‌తో 1000 ఫోటోలు, 100కు పైగా 30 సెకన్ల వీడియోలు స్టోర్ చేసుకోవచ్చు.
భవిష్యత్ అప్డేట్స్
భవిష్యత్ సాఫ్ట్వేర్ అప్డేట్ల ద్వారా డిస్ప్లే లేకుండానే పాదచారుల నావిగేషన్, టర్న్-బై-టర్న్ దిశానిర్దేశాలు వంటి కొత్త ఫీచర్లను అందించనున్నట్లు మెటా ప్రకటించింది. AI, కెమెరా, లైవ్ ట్రాన్స్లేషన్, స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్ల సమ్మేళనంగా వచ్చిన మెటా గ్లాసెస్ వేరబుల్ టెక్నాలజీలో మరో కీలక ముందడుగుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్‌గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!