Site icon NTV Telugu

ప్రాణాలు కాపాడే ఫీచర్.. Apple Watch‌లో ఇకపై హైపర్‌టెన్షన్ (బీపీ) హెచ్చరికలు..!

Apple

Apple

Apple Watch‌: ఆపిల్ (Apple) సంస్థ కొత్తగా watchOS 26 అప్‌డేట్‌తో వచ్చిన హైపర్‌టెన్షన్ (Hypertension) నోటిఫికెషన్స్ ఫీచర్‌ను భారత్ సహా మరిన్ని దేశాలకు తీసుకవచ్చింది. ఈ కొత్త స్మార్ట్ ఆరోగ్య ఫీచర్ ఆపిల్ వాచ్ సేకరించే హార్ట్ డేటాను 30 రోజుల పాటు విశ్లేషించి.. వాత్క్ వాడే వ్యక్తి రక్తపోటు ఎక్కువగా ఉన్న సంకేతాలు నిరంతరంగా కనిపిస్తే ముందుగానే నోటిఫికేషన్ రూపంలో హెచ్చరిస్తుంది. ఈ ఫీచర్‌ను ఉపయోగించాలంటే Apple Watch Series 9 లేదా Ultra 2 లేదా ఆపై మోడల్, కొత్త watchOS 26, అలాగే iPhone 11 లేదా ఆపై మోడల్ iOS 26 తో ఉండాలి. ఇందులో ‘రిస్ట్ డిటెక్షన్’ ఆన్‌గా ఉండాలి. అలాగే మనిషి వయస్సు 22 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉండాలి. అలాగే గర్భిణీ కూడా కాకుండా ఉండాలి. ఇంకా అప్పటికే హైపర్‌టెన్షన్‌గా డయాగ్నోస్ చేయబడిన వారు ఈ ఫీచర్‌ను ఉపయోగించడానికి అర్హులు కాదు.

ప్రపంచంలోనే మొదటి Snapdragon 8 Gen 5 చిప్‌సెట్ ఫోన్ భారీ డిస్కౌంట్‌తో OnePlus Ace 6T లాంచ్..!

ఈ సెటప్ కోసం ఐఫోన్ లో హెల్త్ యాప్ ఓపెన్ చేసి, ప్రొఫైల్ ఐకాన్‌ద్వారా Health Checklist లో Hypertension Notifications‌ను ఎంచుకుని.. వయస్సు, హెల్త్ హిస్టరీ కన్ఫర్మ్ చేసి సూచనలను అనుసరించాలి. సెటప్ పూర్తయిన తర్వాత, గత 30 రోజుల హార్ట్ డేటాలో హైపర్‌టెన్షన్ సూచనలను కనిపిస్తే ఆపిల్ వాచ్ నోటిఫికేషన్ ఇస్తుంది. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే వినియోగదారులు వైద్య నిపుణుల ద్వారా రక్తపోటును చెక్ చేయించాలి. వీటితోపాటు Blood Pressure Log‌ను సెటప్ చేసి.. థర్డ్-పార్టీ బీపీ కఫ్ సహాయంతో 7 రోజుల పాటు రక్తపోటు రీడింగ్స్‌ను రికార్డ్ చేయాలని ఆపిల్ సూచిస్తోంది. Apple Watch‌లోని ఆప్టికల్ సెన్సార్ రక్తనాళాలు హార్ట్‌బీట్‌కు ఎలా స్పందిస్తున్నాయో విశ్లేషించి, ఆల్గోరిథమ్ బ్యాక్‌గ్రౌండ్‌లో నిరంతరం డేటాను పరిశీలిస్తుంది. నిరంతర హైపర్‌టెన్షన్‌కు సంబంధించిన సంకేతాలు ఉంటే వినియోగదారులకు ముందస్తుగా అలర్ట్ పంపబడుతుంది. అయితే ఆపిల్ సంస్థ ఈ ఫీచర్ డయాగ్నోస్ చేయడానికి, చికిత్స చేయడానికి లేదా మందుల నిర్వహణకు ఉద్దేశించబడలేదని స్పష్టంగా తెలిపింది.

EPFO 3.O: ఖాతాదారులకు గుడ్ న్యూస్.. కొత్త ఏడాది నుంచి ఏటీఎమ్ నుంచి ఫీఎఫ్..

Exit mobile version