Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lenovo: భారత మార్కెట్లో లెనోవో (Lenovo) గేమింగ్ & ఎంటర్టైన్మెంట్ విభాగాలను లక్ష్యంగా చేసుకుని Lenovo LOQ గేమింగ్ మానిటర్ సిరీస్‌తో పాటు కొత్త Lenovo Tab Plus Gen 2 ట్యాబ్లెట్‌ను విడుదల చేసింది. అధునాతన డిస్ప్లే, AI ఆధారిత ఫీచర్లు, శక్తివంతమైన ఆడియో వ్యవస్థతో ఈ ఉత్పత్తులు వినియోగదారులను ఆకట్టుకునేలా ఉన్నాయి.
Lenovo Tab Plus Gen 2:
Lenovo Tab Plus Gen 2ను వినోదం, చదువు, పని వంటి వివిధ అవసరాలకు అనుగుణంగా రూపొందించారు. ఇందులో 12.1 అంగుళాల 2.5K డిస్ప్లేను అందించారు. 120Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు Dolby Vision, HDR10 సపోర్ట్ ఉండటంతో వీడియోలు, సినిమాలు, గేమింగ్ అనుభవం మరింత మెరుగ్గా ఉంటుంది. ఆడియో కోసం JBL రూపొందించిన 9-స్పీకర్ సిస్టమ్‌ను అందించారు. Dolby Atmos టెక్నాలజీతో ఈ స్పీకర్లు శక్తివంతమైన సౌండ్‌ను అందిస్తాయి. సినిమాలు చూడటం, సంగీతం వినడం, గేమింగ్ లేదా వర్చువల్ మీటింగ్‌ల కోసం ఇది అనువుగా ఉంటుంది.
Also Read
- Redmi 17 5G: రెడ్ మీ 17 5G భారత్‌లో లాంచ్.. 7900mAh బ్యాటరీ.. 50MP కెమెరా!.. ధర, ఫీచర్లు ఇవే
- TCL P80, P80 Pro: 8GB RAM.. 50MP కెమెరా.. IP68! TCL P80, P80 Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
- Motorola Edge 70 Plus: 200MP కెమెరా.. 6500mAh బ్యాటరీ! Motorola Edge 70 Plus ఫోన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
- iQOO 16: ఐకూ 16 అదిరిపోయే గేమింగ్ ఫోన్.. 8,500mAh బ్యాటరీ, 16GB RAM, 50MP ట్రిపుల్ కెమెరా!
ఈ ట్యాబ్లెట్లో పలు AI ఆధారిత ఫీచర్లను లెనోవో అందించింది. రియల్ టైమ్ ట్రాన్స్క్రిప్షన్, రియల్ టైమ్ ట్రాన్స్లేషన్, లెనోవో స్మార్టర్ రీడర్, AI నోట్స్ వంటి టూల్స్ వినియోగదారుల ఉత్పాదకతను పెంచేందుకు ఉపయోగపడతాయి. అలాగే ఇందులో 360 డిగ్రీలు తిరిగే కిక్స్టాండ్ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా హ్యాంగింగ్ మోడ్, స్టాండ్ మోడ్, థియేటర్ మోడ్, లీన్ మోడ్లలో ట్యాబ్లెట్‌ను ఉపయోగించుకోవచ్చు.
10,200mAh సామర్థ్యం గల బ్యాటరీను ఇందులో అందించారు. ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే 15 గంటల వరకు యూట్యూబ్ వీడియోలను వీక్షించవచ్చని కంపెనీ తెలిపింది. 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా ఇది మద్దతు ఇస్తుంది. అదనంగా లెనోవో ట్యాబ్ పెన్ ప్లస్, లెనోవో వైర్ లెస్ కీబోర్డు, లెనోవో 68W USB-C చార్జర్ వంటి యాక్సెసరీలకు కూడా సపోర్ట్ ఉంటుంది.
LOQ మానిటర్ సిరీస్:
గేమింగ్ ప్రియులను దృష్టిలో పెట్టుకుని Lenovo LOQ గేమింగ్ మానిటర్ సిరీస్‌ను కూడా కంపెనీ విడుదల చేసింది. ఈ సిరీస్‌లో ప్రధాన ఆకర్షణ LOQ 27Q-10 మోడల్. ఇందులో 27 అంగుళాల QHD IPS డిస్ప్లేను అందించారు. 180Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు 0.5ms వరకు స్పందన సమయాన్ని అందించడం వల్ల వేగవంతమైన గేమింగ్‌కు ఇది అనుకూలంగా ఉంటుంది.
LOQ మానిటర్ సిరీస్‌లో HDR10 సపోర్ట్, 99% NsRGB కలర్ కవరేజ్, AMD ఫ్రీసింక్, VESA అడాప్టివ్ సింక్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీంతో గేమింగ్ సమయంలో స్క్రీన్ టియరింగ్, ల్యాగ్ వంటి సమస్యలు తగ్గుతాయి. ఈ మానిటర్లు ప్లేస్టేషన్ 5, Xbox కన్సోళ్లు, Nintendo స్విచ్ వంటి ప్రస్తుత తరం గేమింగ్ కన్సోళ్లకు కూడా అనుకూలంగా ఉంటాయి. LOQ మానిటర్లలో HDMI 2.1, డిస్ప్లే పోర్ట్ 1.4 కనెక్టివిటీ ఎంపికలు ఉన్నాయి. అలాగే లెనోవో Artery సాఫ్ట్వేర్ సపోర్ట్ ద్వారా డిస్ప్లే సెట్టింగ్‌లు, పనితీరు ఆప్టిమైజేషన్, మానిటర్ మేనేజ్మెంట్ను సులభంగా నిర్వహించవచ్చు.
ధర:
లెనోవో LOQ గేమింగ్ మానిటర్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ డే సేల్ సందర్భంగా ప్రత్యేకంగా అమెజాన్ ఇండియాలో అందుబాటులోకి రానుంది. ఈ సిరీస్ ప్రారంభ ధర రూ.9,799గా నిర్ణయించారు. ఇందులో LOQ 24-10, LOQ 27-10, LOQ 27Q-10 మోడళ్లు ఉన్నాయి. త్వరలో 32 అంగుళాల LOQ మానిటర్‌ను కూడా విడుదల చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఇక లెనోవో ట్యాబ్ ప్లస్ జెన్ 2 త్వరలో లెనోవో అధికారిక వెబ్సైట్, ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు, రిటైల్ స్టోర్లలో అమ్మకలకు అందుబాటులోకి రానుంది. దీని ప్రారంభ ధర సుమారు రూ.35,999గా ఉండే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Baljit Singh: ఇంట్లో కుళ్లిన స్థితిలో పంజాబీ గాయకుడి మృతదేహం.. రక్తపు మరకలు, చివరికి షాకింగ్ ట్విస్ట్!
-
Konda Surekha: ఇక నిరీక్షణ ముగిసింది.. అతి త్వరలోనే బిగ్ అప్డేట్.. వేచి చూడండి!
-
Kaaka : వచ్చే సంక్రాంతికి మెగాస్టార్ ‘కాకా’ లేనట్టేనా..?
-
Kareena Kapoor: ఆ టైంలో హీరోయిన్ అవ్వాలనే పిచ్చితో అలా చేశాను.. కానీ ఇప్పుడు అది బిగ్ రిగ్రెట్!
-
Irumudi: 200 కోట్లు దాటినా తగ్గని ‘ఇరుముడి’ జోరు.. సెప్టెంబర్ లో మరింత జోరు ఉంటుందా ?
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!