Site icon NTV Telugu

Redmi K50 : రేపు లాంఛ్‌ కానున్న రెడ్‌మి కే50.. ఫీచర్స్‌ తెలుసా..?

Redmi K50

Redmi K50

Latest Smart Phone Redmi K50

ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ రెడ్‌మి మరో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ను తీసుకురానుంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్‌తో వినియోగదారులను కట్టిపడేస్తోన్న రెడ్‌మి ఇప్పుడు తీసుకువస్తున్న మొబైల్‌లో సైతం అత్యాధునిక ఫీచర్స్‌ను లోడ్‌ చేసింది. ఆగ‌స్ట్ 2019 త‌ర్వాత తొలిసారిగా రెడ్‌మి త‌న న్యూ కే సిరీస్ నుంచి కే50 పేరుతో స్మార్ట్‌ఫోన్‌ను భారత విపణిలోకి తీసుకురానుంది. అయితే ఈ ఫోన్‌ రేపు భారత్‌లో లాంఛ్‌ చేయనుంది రెడ్‌మి. . భార‌త్‌లో రెడ్‌మి కే50ఐ రూ 26,999 నుంచి ప్రారంభ‌మ‌వుతుంద‌ని ఓ అంచాన ఉండగా.. రెడ్‌మి లేటెస్ట్ స్మార్ట్‌పోన్ డెమెన్సిటీ 8100 మ్యాక్స్ చిప్‌సెట్‌, 64ఎంపీ ట్రిపుల్ కెమెరా సెట‌ప్ వంటి ఫీచ‌ర్ల‌తో అందుబాటులోకి రానుంది.

Today Gold Price : స్థిరంగా పసిడి.. కాస్త పెరిగిన వెండి..

గ‌త కొద్దినెల‌లుగా రూ 30,000లోపు ప‌లు స్మార్ట్‌ఫోన్‌లు లాంఛ్ అవ‌డంతో ఆయా స్మార్ట్‌ఫోన్‌ల నుంచి రెడ్‌మి లేటెస్ట్ కే సిరీస్ ఫోన్‌కు పోటీ ఎదురవుతుందనే చెప్పాలి. రెడ్‌మి కే50ఐ స్మార్ట్‌ఫోన్‌ ప్ర‌ధానంగా పోకో ఎఫ్‌4 5జీ, ఐక్యూఓఓ నియో 6 5జీ, వ‌న్‌ప్ల‌స్ నార్డ్ 2టీ 5జీ, ఒప్పో రెనో 8 5జీ, మోటో ఎడ్జ్ 30, శాంసంగ్ గెలాక్సీ ఎం53 5జీ వంటి ఫోన్లకు దీటైన పోటీ పడనుంది. అయితే తాజాగా ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ ఒప్పో తొలిసారి ఒప్పో ప్యాడ్ ఎయిర్‌ పేరుతో ట్యాబ్లెట్‌ను లాంఛ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

 

Exit mobile version