Jio vs Airtel: రూ.3,599 ప్లాన్‌.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?

  • జియో, ఎయిర్‌టెల్ రెండిట్లో రూ.3,599 వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌ అందుబాటులో..
  • రెండు ప్లాన్‌లలో 365 రోజుల వ్యాలిడిటీ, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMSలు
  • రెండు ప్లాన్‌లలో అన్‌లిమిటెడ్ 5G డేటా సదుపాయం
  • కానీ అసలు తేడా ఇదే..
Jio Vs Airtel

Jio Vs Airtel

Jio vs Airtel: భారత్‌లోని ప్రముఖ టెలికాం సంస్థలు రిలయన్స్ జియో (JIO), భారతి ఎయిర్‌టెల్ (Airtel) రెండూ రూ.3,599 లకు వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తున్నాయి. ఏడాది వ్యాలిడిటీ కోరుకునే యూజర్లకు ఈ ప్లాన్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. అయితే డేటా, 5G, OTT, ఇతర అదనపు ప్రయోజనాల్లో రెండు ప్లాన్ల మధ్య భారీ తేడాలు ఉన్నాయి. మరి అవేంటో చూసేద్దామా..

రిలయన్స్ జియో ప్లాన్

రిలయన్స్ జియో రూ.3,599 ప్రీపెయిడ్ ప్లాన్‌తో 365 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ ప్లాన్‌లో రోజుకు 2.5GB డేటా, రోజుకు 100 SMSలు, అపరిమిత వాయిస్ కాలింగ్ అందిస్తారు. దీంతో ఏడాది కాలానికి మొత్తం 912.5GB డేటా లభిస్తుంది. ఇవే కాకుండా JioHotstar Mobile + హాలీవుడ్ సబ్‌స్క్రిప్షన్, JioTV ప్రో ప్యాక్ వంటి వినోద ప్రయోజనాలు ఉన్నాయి. అదనంగా 120GB డేటా బూస్టర్, 50GB ఉచిత AI క్లౌడ్ స్టోరేజ్ కూడా లభిస్తుంది.

ఈ ప్లాన్‌లో 18 నెలల పాటు “గూగుల్ జెమినీ AI ప్రో” సబ్‌స్క్రిప్షన్ కూడా అందిస్తున్నారు. దీని విలువ రూ.35,100గా ఉంటుంది. అలాగే AJio, Cinepolis, EaseMyTrip వంటి బ్రాండ్ల వోచర్లు, 12 నెలల కాన్వ ప్రో లైట్ సబ్‌స్క్రిప్షన్ వంటి అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. జియో 5G నెట్‌వర్క్ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో అన్‌లిమిటెడ్ 5G డేటాను అందిస్తోంది.

భారతి ఎయిర్‌టెల్ ప్లాన్

భారతి ఎయిర్‌టెల్ రూ.3,599 ప్రీపెయిడ్ ప్లాన్ కూడా 365 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఇందులో రోజుకు 2GB డేటా, రోజుకు 100 SMSలు, అపరిమిత వాయిస్ కాలింగ్ లభిస్తాయి. అంటే ఏడాది మొత్తానికి 730GB సాధారణ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్‌తో అన్‌లిమిటెడ్ 5G డేటా సదుపాయం కూడా ఉంది. అయితే ఎయిర్‌టెల్ నిబంధనల ప్రకారం అన్‌లిమిటెడ్ 5G వినియోగం 30 రోజుల వ్యవధిలో 300GB వరకు పరిమితం చేయబడింది.

ఇంకా అదనపు ప్రయోజనాల్లో 12 నెలల “Adobe ఎక్ష్ప్రెస్స్ ప్రీమియం” సబ్‌స్క్రిప్షన్, ఉచిత Hellotunes, Airtel Xstream ప్లే లో మాత్రమే అందుబాటులో ఉన్న కంటెంట్ ఉన్నాయి. అంతకు మించి ఎటువంటి ప్రయోజనాలు లభించవు.

రెండు ప్లాన్లలో ప్రధాన తేడాలు

రూ.3,599 ధరతో రెండు కంపెనీలు 365 రోజుల వ్యాలిడిటీని అందిస్తున్నప్పటికీ.. రోజువారీ డేటా విషయంలో జియో చాలా ముందుంది. జియో ప్లాన్‌లో రోజుకు 2.5GB డేటా ఉండగా, ఎయిర్‌టెల్ ప్లాన్‌లో రోజుకు కేవలం 2GB డేటా మాత్రమే లభిస్తుంది.

అంతేకాకుండా అదనపు డేటా, OTT ప్రయోజనాలు, AI సేవలు, క్లౌడ్ స్టోరేజ్, కాన్వ ప్రో లైట్ వంటి అనేక బెనిఫిట్స్ విషయంలో కూడా రెండు ప్లాన్లలో తేడా ఉంది. ముఖ్యంగా 5G వినియోగ నిబంధనలను కూడా యూజర్లు పరిశీలించాలి. జియో, ఎయిర్‌టెల్‌లో ఏది ఎంచుకోవాలనేది యూజర్‌కు అవసరమైన డేటా, 5G కవరేజ్, OTT మరియు ఇతర అదనపు ప్రయోజనాలపై ఆధారపడి ఉంటుంది.