NTV Telugu Site icon

Jio Bharat K1 Karbonn 4G: క్రేజీ డీల్.. రూ. 699కే జియో 4G ఫోన్

Jio

Jio

సంచలనాలకు మారుపేరు జియో అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. జియో నెట్ వర్క్, జియో ఫోన్లతో మార్కెట్ లో అదరగొడుతోంది. తక్కువ ధరల్లోనే 4జీ ఫోన్లను తీసుకొచ్చి మొబైల్ ఇండస్ట్రీని సర్ ప్రైజ్ కు గురిచేసింది. ఇప్పుడు యూజర్లకు గుడ్ న్యూస్ అందించింది. కేవలం రూ. 699కే జియో 4G ఫోన్ ను అందిస్తోంది. జియోభారత్ కే1 కార్బన్ 4జీ కీప్యాడ్ ఫీచర్ ఫోన్ కేవలం రూ. 699 రూపాయలకు అందుబాటులో ఉంది. ఈ ధర నలుపు, బూడిద రంగు వేరియంట్లకు వర్తిస్తుంది. వినియోగదారులు ఈ ఫోన్‌ను అమెజాన్ ఇండియాతో పాటు, జియోమార్ట్ నుంచి కూడా కొనుగోలు చేయవచ్చు.

Also Read:Russia Ukraine War: యుద్ధానికి 3 ఏళ్లు.. 267 డ్రోన్లతో ఉక్రెయిన్‌పై రష్యా దాడి..

ఫీచర్ల విషయానికి వస్తే.. జియో భారత్ K1 స్మార్ట్‌ఫోన్ 0.05 GB RAM, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంది. ఫోన్‌లో లాక్ చేయబడిన జియో సింగిల్ నానో సిమ్‌ను మాత్రమే ఉపయోగించవచ్చు. ఈ ఫోన్ బ్యాటరీ కెపాసిటీ 1000mAh. ఈ ఫోన్ 4G నెట్‌వర్క్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇందులో Jio TV, Jio Sound Pay, JioSaavn లతో పాటు Jio Pay ని ఉపయోగించవచ్చు. ఈ కీప్యాడ్ ఫోన్ డిస్ప్లే 1.77 అంగుళాలు. ఇది 720 పిక్సెల్ రిజల్యూషన్‌ తో వస్తుంది. ఫోటోగ్రఫీ కోసం ఈ ఫోన్‌లో డిజిటల్ కెమెరాను అందించారు. జియో యొక్క ఈ ఫీచర్ ఫోన్ 23 భాషలకు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ FM రేడియోకి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ జియో సినిమా సపోర్ట్‌తో వస్తుంది.

Also Read:IND vs PAK: ముగిసిన తొలి ఇన్సింగ్స్.. పాకిస్థాన్ ఆలౌట్

జియోభారత్ V3 4G
జియోకి చెందిన ఈ ఫీచర్ ఫోన్ అమెజాన్ ఇండియాలో రూ. 799 రూపాయలకు లభిస్తుంది. ఫీచర్ల విషయానికి వస్తే.. ఈ జియో ఫోన్ 0.13 GB స్టోరేజ్‌తో వస్తుంది. 1.8 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ Threadx RTOS ఆపరేటింగ్ సిస్టమ్ పై నడుస్తుంది. ఈ 4G ఫోన్ క్రిస్టల్ క్లియర్ వాయిస్ కాలింగ్‌ కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్‌లో లైవ్ టీవీ ఛానల్, UPI చెల్లింపు ఫీచర్‌ను పొందుతారు. ఈ ఫోన్‌లో ఫోటోగ్రఫీ కోసం డిజిటల్ కెమెరా కూడా ఉంది. ఈ ఫీచర్ ఫోన్ జియో నెట్‌వర్క్‌లో మాత్రమే పనిచేస్తుంది.