Site icon NTV Telugu

రూ. 6,799కే మిలిటరీ-గ్రేడ్ సర్టిఫికేషన్, 5000mAh భారీ బ్యాటరీ.. itel A100 స్మార్ట్‌ఫోన్‌ లాంచ్!

Itel 100 (1)

Itel 100 (1)

itel A100: ఐటెల్ (itel) లోని బడ్జెట్ ఫ్రెండ్లీ ‘A’ సిరీస్‌ను మరింత పెంచుతూ.. భారత మార్కెట్లో సరికొత్త ఐటెల్ A100 (itel A100) స్మార్ట్‌ఫోన్‌ ను లాంచ్ చేసింది. గత ఏడాది విడుదలైన itel A90 కి ఇది అప్డేటెడ్ గా నిలవనుంది. ఈ ఫోన్ లో ప్రధాన ఆకర్షణ MIL-STD-810H మిలిటరీ-గ్రేడ్ సర్టిఫికేషన్. ఇక ఇందులో 6.6 అంగుళాల HD+ డిస్ప్లేను అందించారు. ఇది 90Hz రిఫ్రెష్ రేట్, 180Hz టచ్ శాంప్లింగ్ రేట్ తో వస్తుంది. ఇందులో ఆపిల్ ఫోన్లలో కనిపించే డైనమిక్ ఐలాండ్ తరహాలోనే ‘డైనమిక్ బార్ (Dynamic Bar)’ ఫీచర్‌ను చేర్చారు. దీని ద్వారా బ్యాటరీ స్టేటస్, కాల్స్, నోటిఫికేషన్లను డిస్టర్బెన్స్ లేకుండా నేరుగా స్క్రీన్ పైభాగంలో చూడవచ్చు.

Scotland vs Italy: స్కాట్లాండ్‌ భారీ విజయం.. కట్ చేస్తే పాయింట్ల పట్టికలో!

ఈ ఫోన్‌లో మరో ఆసక్తికరమైన ఫీచర్ ‘IR బ్లాస్టర్’. దీని సహాయంతో టీవీలు, ఏసీలు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులను రిమోట్‌లా కంట్రోల్ చేయవచ్చు. అలాగే మెరుగైన ఆడియో అనుభవం కోసం DTS సౌండ్ టెక్నాలజీని అందించారు. భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. ఈ ఫోన్ భారతదేశం అంతటా ఉన్న ప్రముఖ రిటైల్ స్టోర్లలో లభిస్తుంది. కొనుగోలు చేసిన 100 రోజుల్లోపు ఒకసారి ఉచితంగా స్క్రీన్ రీప్లేస్‌మెంట్ చేసుకునే సదుపాయాన్ని కంపెనీ కల్పిస్తోంది.

itel A100 ఫీచర్లు:
ప్రాసెసర్: ఇందులో UNISOC T7100 (12nm) ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు.

ర్యామ్ & స్టోరేజ్: ఇది 3GB & 4GB ర్యామ్ ఆప్షన్లలో లభిస్తుంది. వర్చువల్ ర్యామ్ ఫీచర్ ద్వారా దీనిని మరో 8GB వరకు పెంచుకోవచ్చు. 64GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో పాటు మైక్రో SD కార్డ్ సదుపాయం కూడా ఉంది.

సాఫ్ట్‌వేర్: ఇది లేటెస్ట్ Android 15 (Go Edition) పై నడుస్తుంది.

కెమెరా: వెనుకవైపు 8MP కెమెరా (LED ఫ్లాష్‌తో), సెల్ఫీల కోసం 5MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.

బ్యాటరీ: 5000mAh భారీ బ్యాటరీతో పాటు 10W ఛార్జింగ్ సపోర్ట్ ఉంది.

Ambati Rambabu: అంబటి రాంబాబుకు మరో షాక్‌.. ఇంకో కేసులో 14 రోజుల రిమాండ్‌..

* itel A100 సిల్క్ గ్రీన్, ప్యూర్ బ్లాక్, టైటానియం గోల్డ్ రంగుల్లో అందుబాటులో ఉంది.

* 3GB + 64GB వేరియంట్ ధర: రూ. 6,799

* 4GB + 64GB వేరియంట్ ధర: రూ. 7,499.

Exit mobile version