ISRO NVS-03 Satellite: నేడు రాత్రి 11:51 గంటలకు ఇస్రో కీలక ప్రయోగం.. నింగిలోకి NVS-03 ఉపగ్రహం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ISRO NVS-03 Satellite: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. దేశీయ నావిగేషన్ వ్యవస్థ ‘నావిక్’ (NavIC) సేవలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో నేడు (అక్టోబర్ 30) రాత్రి 11:51 గంటలకు ఎన్వీఎస్-03 (NVS-03) ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జీఎస్ఎల్వీ-ఎఫ్18 (GSLV-F18) రాకెట్ ద్వారా ఈ ప్రయోగం చేపట్టనున్నారు.
నావిక్ వ్యవస్థలో లోపాల సవరణే ప్రధాన లక్ష్యం
అమెరికాకు చెందిన జీపీఎస్ (GPS)కు ప్రత్యామ్నాయంగా భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో నావిక్ నావిగేషన్ వ్యవస్థను అభివృద్ధి చేసింది. అయితే ఈ వ్యవస్థలో తలెత్తిన కొన్ని సాంకేతిక సమస్యలను పరిష్కరించి, మరింత కచ్చితమైన లొకేషన్ సేవలను అందుబాటులోకి తీసుకురావడమే ఎన్వీఎస్-03 ఉపగ్రహ ప్రయోగం ప్రధాన ఉద్దేశం. ఈ ఉపగ్రహంలో ప్రత్యేకంగా రూపొందించిన అధునాతన రూబిడియం అటామిక్ క్లాక్‌ను అమర్చారు. అహ్మదాబాద్‌లోని ఇస్రో కేంద్రం ఈ క్లాక్ ను స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసింది. ఉపగ్రహ నావిగేషన్ వ్యవస్థలో సమయ నిర్ధారణ అత్యంత కీలకం కావడంతో, ఈ అటామిక్ క్లాక్ కచ్చితమైన స్థాన సమాచారాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించనుంది.
Also Read
- మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!
- IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!
- 200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, 1.5K LTPO AMOLED ఫ్లాట్ డిస్ప్లేతో OnePlus Ace 7 Pro లాంచ్..!
- Honor X8e 4G: హానర్ X8e 4G లాంచ్.. 108MP కెమెరా, 7,700mAh బ్యాటరీతో కొత్త స్మార్ట్‌ఫోన్!
2,232 కిలోల బరువు.. 12 ఏళ్ల సేవలు
ఎన్వీఎస్-03 ఉపగ్రహం మొత్తం 2,232 కిలోల బరువు కలిగి ఉంది. దీని సేవా కాలం సుమారు 12 సంవత్సరాలుగా అంచనా వేస్తున్నారు. ఈ ఉపగ్రహం అందించే నావిగేషన్ సేవలు పలు రంగాలకు ఉపయోగపడనున్నాయి. ముఖ్యంగా ప్రజలకు కచ్చితమైన లొకేషన్ సమాచారం అందించడం, విపత్తుల నిర్వహణ, రైల్వే రవాణా వ్యవస్థ, రక్షణ రంగానికి సంబంధించిన భద్రతా అవసరాల్లో ఈ ఉపగ్రహ సేవలు కీలకంగా మారనున్నాయి.
ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో శాస్త్రవేత్తలు
శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఇస్రో వెల్లడించింది. శాస్త్రవేత్తలు ప్రయోగానికి సంబంధించిన తుది సన్నాహాల్లో నిమగ్నమయ్యారు. ఎన్వీఎస్-03 విజయవంతంగా కక్ష్యలోకి చేరితే భారత స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ మరింత పటిష్టం కానుంది. జీపీఎస్‌పై ఆధారపడకుండా దేశీయంగా అభివృద్ధి చేసిన నావిగేషన్ సేవలను విస్తరించడంలో ఈ ప్రయోగం మరో కీలక ముందడుగుగా నిలవనుంది.
తాజావార్తలు
-
ISRO NVS-03 Satellite: నేడు రాత్రి 11:51 గంటలకు ఇస్రో కీలక ప్రయోగం.. నింగిలోకి NVS-03 ఉపగ్రహం!
-
Hyderabad: నిమ్స్ ఆస్పత్రిలో ముగిసిన ఏసీబీ సోదాలు.. అర్ధరాత్రి వరకు తనిఖీలు
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
Operation Firewall 2026: పాక్ ఏజెంట్లకు సహకారం.. బీహార్‌లో ఇద్దరిని అరెస్ట్ చేసిన ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం
-
School Holidays: అర్నబ్ తుఫాన్ ప్రభావం.. సెలవులు పొడిగించిన విద్యాశాఖ!
ట్రెండింగ్
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!
-
IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, 1.5K LTPO AMOLED ఫ్లాట్ డిస్ప్లేతో OnePlus Ace 7 Pro లాంచ్..!
-
IND vs NZ: క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. నేడే నాలుగో టీ20.. ప్లేయింగ్ XIలోకి ఇషాన్ కిషన్..!
-
World Savings Day : నెలాఖరుకు చేతిలో డబ్బు ఉండాలంటే ఇలా చేయండి!