Site icon NTV Telugu

iQOO Z10 Turbo+ 5G vs OPPO Reno 14 5G: మిడ్ రేంజ్‌లో బ్యాటరీ, కెమెరా, పనితీరు.. ఎవరిదీ పైచేయి?

Iqoo Z10 Turbo+ 5g Vs Oppo Reno 14 5g

Iqoo Z10 Turbo+ 5g Vs Oppo Reno 14 5g

iQOO Z10 Turbo+ 5G vs OPPO Reno 14 5G: రూ.30,000 ధర శ్రేణిలో కొత్త ఫోన్ కొనాలనుకుంటున్నవారు లేదా అప్‌గ్రేడ్ చేయాలనుకుంటున్నవారికి కెమెరా ఫీచర్లు, బ్యాటరీ, పనితీరులో మంచి ఫీచర్లున్న ఫోన్స్ కు సంబంధించి కొత్తగా రాబోతున్న iQOO Z10 Turbo+ 5G, ఇటీవలే విడుదలవుతున్న OPPO Reno 14 5G ని వినియోగదారులు పరిగణలోకి తీసుకోవచ్చు. మరి ఈ మొబైల్స్ లో ఏ మొబైల్ ఇందులో బెస్ట్..? ఏ మొబైల్ ఎందుకు కొనవచ్చు లాంటి విశేషాలను నిశితంగా చూసేద్దాం.

డిస్ప్లే:
iQOO Z10 Turbo+ 5G లో 6.78 అంగుళాల AMOLED స్క్రీన్, 144Hz రిఫ్రెష్ రేట్, 2800×1260 పిక్సెల్ రిజల్యూషన్ కలిగిన డిస్‌ప్లే ఉంది. అలాగే ఈ మొబైల్ HDR సపోర్ట్, 1.07 బిలియన్ కలర్స్‌తో రిచ్ విజువల్స్ అందిస్తుంది. ఇక మరోవైపు OPPO Reno 14 5G లో 6.59 అంగుళాల 1.5K OLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, Corning Gorilla Glass 7i ప్రొటెక్షన్, 1,200 నిట్స్ బ్రైట్‌నెస్ ఉన్నాయి. మొత్తంగా iQOOలో అధిక రిఫ్రెష్ రేట్ ఉండగా, OPPOలో బ్రైట్‌నెస్, డ్యూరబిలిటీ పై ఎక్కువ ఫోకస్ ఉంది.

OPPO K13 Turbo Series: 7,000mAh భారీ బ్యాటరీ, కొత్త కూలింగ్ టెక్నాలజీతో ఒప్పో K13 టర్బో సిరీస్ లాంచ్.. ధరలు, ఫీచర్లు ఇలా!

పనితీరు:
iQOO Z10 Turbo+ 5G కి 3nm టెక్నాలజీతో తయారైన MediaTek Dimensity 9400+ SoC, Immortalis-G925 GPU, 16GB LPDDR5x RAM, 512GB UFS 4.1 స్టోరేజ్ ఉంది. గేమింగ్‌లో ఇది అద్భుతమైన పనితీరును ఇస్తుంది. అలాగే OPPO Reno 14 5G లో Dimensity 8350 SoC, గరిష్టంగా 12GB RAM, 512GB స్టోరేజ్ ఉంది. సాధారణ పనుల్లో బాగానే పనిచేసినప్పటికీ, హై-ఎండ్ గేమింగ్‌లో iQOO తో పోలిస్తే కొద్దిగా వెనుకబడి ఉంటుంది.

కెమెరా:
iQOO Z10 Turbo+ 5G లో 50MP ప్రైమరీ సెన్సార్ (OIS తో) + 8MP అల్ట్రా వైడ్ లెన్స్ రియర్ కెమెరా సెటప్ ఉంది. దీనితో 4K@30fps వీడియో రికార్డింగ్ చేయవచ్చు. ఫ్రంట్ కెమెరా 16MP ఉంది. అదే OPPO Reno 14 5G లో 50MP ప్రైమరీ సెన్సార్, 50MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ (3.5x ఆప్టికల్ జూమ్), 8MP అల్ట్రా వైడ్ లెన్స్ ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా 50MP ఉండటం వలన వ్లాగింగ్, సెల్ఫీలకు ఇది అద్భుతంగా ఉంటుంది. కెమెరా వెర్సటిలిటీ పరంగా ఒప్పో ముందుంది.

బ్యాటరీ:
iQOO Z10 Turbo+ 5G కి 8,000mAh భారీ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. దీర్ఘకాలం ఉపయోగం, వేగవంతమైన ఛార్జింగ్ దీని ప్రత్యేకత. ఇక ఒప్పో Reno 14 5G లో 6,000mAh బ్యాటరీ, 80W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. బ్యాటరీ కెపాసిటీ తక్కువైనా, ఫాస్ట్ ఛార్జింగ్ బాగా వేగంగా ఉంటుంది. మొత్తానికి బ్యాటరీ విషయంలో iQOO నే పైచేయి.

ISRO Satellite Images: ఈ ఒక్క ఫోటో చాలు.. ప్రకృతి కన్నెర్ర చేస్తే ఎలా ఉంటుందో చెప్పడానికి!

ధర:
iQOO Z10 Turbo+ 5G (12GB+256GB) ధర 2,299 CNY (రూ.28,000). హయ్యర్ వేరియంట్లు 2,499 CNY (రూ.30,500) నుంచి 2,999 CNY (రూ.36,500) వరకు ఉంటాయి. అదే ఒప్పో Reno 14 5G (8GB+256GB) ధర రూ.37,999, (12GB+256GB) ధర రూ.39,999 గా ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే ఒప్పో Reno 14 5G కాస్త ఎక్కువగానే కనపడుతుంది.

మొత్తంగా చూస్తే.. గేమింగ్, పెద్ద బ్యాటరీ కావాలనుకునే వారికి iQOO Z10 Turbo+ 5G బెటర్ ఆప్షన్ అవుతుంది. అదే కెమెరా క్వాలిటీ, డిస్‌ప్లే డ్యూరబిలిటీ కావాలనుకునే వారికి ఒప్పో రెనో 14 5G సరైన ఎంపిక అవుతుంది.

Exit mobile version