iQOO 16: iQOO 16 లాంచ్ డేట్ ఫిక్స్.. 50MP కెమెరా, 8,400mAh బ్యాటరీ, 165Hz డిస్‌ప్లే!

  • iQOO 16 స్పెసిఫికేషన్స్‌ లీక్‌
  • 2K 165Hz AMOLED డిస్‌ప్లే, 8,400mAh బ్యాటరీ
Iqoo 16

Iqoo 16

iQOO 16: స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లోకి మరో ప్రీమియం ఫోన్‌ వచ్చేందుకు సిద్ధమవుతోంది. iQOO 16ను కెమెరా ఫోకస్‌డ్‌ స్మార్ట్‌ఫోన్‌గా కంపెనీ తీసుకురానుంది. iQOO 16 చైనాలో విడుదల తేదీ ఖరారైంది. సెప్టెంబర్ 29న రిలీజ్ చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. అధునాతన ఇమేజింగ్‌ టెక్నాలజీతో పాటు భారీ బ్యాటరీ, హై-రిఫ్రెష్‌ రేట్‌ డిస్‌ప్లే, పవర్‌ఫుల్‌ చిప్‌సెట్‌ వంటి ఫీచర్లతో ఈ ఫోన్‌ లాంచ్‌ కానున్నట్లు సమాచారం. లాంచ్‌కు ముందే iQOO కొన్ని కెమెరా వివరాలను వెల్లడించింది.

50MP ప్రైమరీ కెమెరాతో భారీ అప్‌గ్రేడ్‌

iQOO 16లో 50 మెగాపిక్సెల్‌ ప్రైమరీ కెమెరాను అందించనున్నట్లు కంపెనీ ధృవీకరించింది. ఇందులో 1/1.3-అంగుళాల సెన్సార్‌ ఉండనుంది. గతేడాది వచ్చిన iQOO 15తో పోలిస్తే ఈ కొత్త సెన్సార్‌ 79 శాతం ఎక్కువ ఇమేజ్‌ డేటాను క్యాప్చర్‌ చేయగలదని కంపెనీ పేర్కొంది. తక్కువ వెలుతురు లేదా కష్టమైన లైటింగ్‌ పరిస్థితుల్లోనూ మెరుగైన ఫొటోలు తీసేందుకు ఈ కెమెరా ఉపయోగపడనుంది. దీనికి సూపర్‌ HDR ఇమేజింగ్‌ టెక్నాలజీ, NICE 3.0 ఆప్టికల్‌ రీకన్‌స్ట్రక్షన్‌ ఇంజిన్‌ను అందించనున్నారు. అలాగే కెమెరా సిస్టమ్‌కు CIPA 5.5-రేటెడ్‌ స్టెబిలైజేషన్‌ సపోర్ట్‌ ఉంటుందని కంపెనీ తెలిపింది. ఫొటోలు, వీడియోలు తీసే సమయంలో చేతులు కదలడం వల్ల ఏర్పడే ప్రభావాన్ని తగ్గించడంలో ఇది సహాయపడుతుంది.

ట్రిపుల్‌ 50MP కెమెరాలు?

ప్రముఖ టిప్‌స్టర్‌ Digital Chat Station వెల్లడించిన వివరాల ప్రకారం.. iQOO 16లో OV50Q 50MP ప్రైమరీ సెన్సార్‌ ఉండే అవకాశం ఉంది. దీనితో పాటు 50MP అల్ట్రావైడ్‌ కెమెరా, 50MP Sony IMX882 పెరిస్కోప్‌ టెలిఫొటో కెమెరా ఉండొచ్చని సమాచారం. పెరిస్కోప్‌ టెలిఫొటో కెమెరా ద్వారా 3x ఆప్టికల్‌ జూమ్‌ సపోర్ట్‌ లభించే అవకాశం ఉంది. అయితే టిప్‌స్టర్‌ వెల్లడించిన ఈ వివరాలను కంపెనీ అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.

6.85 అంగుళాల 2K AMOLED డిస్‌ప్లే

iQOO 16లో 6.85 అంగుళాల Samsung M16 AMOLED డిస్‌ప్లే ఉండొచ్చని సమాచారం. ఈ స్క్రీన్‌ 2K రిజల్యూషన్‌, 165Hz రిఫ్రెష్‌ రేట్‌తో రానున్నట్లు తెలుస్తోంది. అధిక రిఫ్రెష్‌ రేట్‌ కారణంగా స్క్రోలింగ్‌, గేమింగ్‌, యానిమేషన్లు మరింత స్మూత్‌గా ఉండే అవకాశం ఉంది. పనితీరు పరంగా iQOO 16లో Qualcommకు చెందిన Snapdragon 8 Elite Extreme Gen 6 చిప్‌సెట్‌ను ఉపయోగించే అవకాశం ఉందని సమాచారం. భారీ పనులు, గేమింగ్‌, మల్టీటాస్కింగ్‌ కోసం ఈ ప్రాసెసర్‌ను ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. బ్యాటరీ విషయంలోనూ ఫోన్‌ ఆకట్టుకునే స్పెసిఫికేషన్లతో రావచ్చని సమాచారం. ఇందులో 8,400mAh బ్యాటరీ, 100W వైర్డ్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌, 50W వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ ఉండొచ్చని తెలుస్తోంది.

Android 17, OriginOS 7

సాఫ్ట్‌వేర్‌ విషయానికి వస్తే iQOO 16 Android 17 ఆధారిత OriginOS 7పై పనిచేసే అవకాశం ఉంది. స్టోరేజ్‌ పరంగా ఈ ఫోన్‌ పలు వేరియంట్లలో అందుబాటులోకి రావచ్చని సమాచారం:

12GB RAM + 256GB స్టోరేజ్‌
12GB RAM + 512GB స్టోరేజ్‌
16GB RAM + 512GB స్టోరేజ్‌
16GB RAM + 1TB స్టోరేజ్‌

iQOO 16లో అల్ట్రాసోనిక్‌ ఇన్‌-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌ ఉండొచ్చని సమాచారం. అలాగే ఫోన్‌కు IP68/IP69 రేటింగ్‌ లభించే అవకాశం ఉంది. కలర్‌ ఆప్షన్ల విషయానికి వస్తే Chasing Light, Racing Track, Legend రంగుల్లో ఈ ఫోన్‌ను తీసుకురావచ్చని తెలుస్తోంది.