షేర్ ఆగయ.. 144Hz OLED డిస్ప్లే, 6500mm IceCore VC కూలింగ్ సిస్టమ్,100W ఫ్లాష్ ఛార్జ్ తో iQOO 15R లాంచ్..!
- iQOO 15R భారతదేశంలో అధికారికంగా లాంచ్..
- Snapdragon 8 Gen 5 ప్రాసెసర్, Android 16 ఆధారిత OriginOS 6
- 6.59 అంగుళాల 1.5K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 5000 నిట్స్ బ్రైట్నెస్
- 50MP Sony LYT-700V ప్రధాన కెమెరా, 8MP అల్ట్రా వైడ్, 32MP సెల్ఫీ కెమెరా
- 7600mAh భారీ బ్యాటరీ, 100W ఫ్లాష్ ఛార్జ్‌తో
- 4 సంవత్సరాల Android updates, 6 సంవత్సరాల security updates
- ప్రారంభ ధర రూ. 44,999, బ్యాంక్ ఆఫర్లతో రూ. 4000 వరకు డిస్కౌంట్
- మార్చి 3 నుంచి అందుబాటులో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
iQOO 15R Launch: స్మార్ట్ ఫోన్ మార్కెట్లో సంచనాలు సృష్టిస్తున్న ఐక్యూ (iQOO) భారతదేశంలో ఐక్యూ 15 సిరీస్‌లో భాగంగా ఐక్యూ 15R (iQOO 15R)ను అధికారికంగా లాంచ్ చేసింది. ప్రీమియం ఫీచర్లు, శక్తివంతమైన ప్రాసెసర్, భారీ బ్యాటరీతో ఈ ఫోన్ వినియోగదారులను ఆకుట్టుకొనే విధంగా ఉంది. గేమింగ్, మల్టీటాస్కింగ్, కెమెరా పనితీరులో ఈ ఫోన్ వేరే లెవెల్ అనుభవాన్ని అందిస్తుందని కంపెనీ తెలిపింది.
డిస్ప్లే, ప్రీమియం డిజైన్:
iQOO 15Rలో 6.59 అంగుళాల 1.5K OLED ఫ్లాట్ డిస్ప్లే అందించారు. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 5000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 4320Hz PWM డిమ్మింగ్ సపోర్ట్‌తో వస్తుంది. దీంతో సూర్యరశ్మిలో కూడా స్క్రీన్ క్లియర్‌గా కనిపిస్తుంది. ‘స్చోట్ షీల్డ్’ గ్లాస్ రక్షణతో స్క్రీన్ మరింత బలంగా ఉంటుంది. ఈ ఫోన్ డార్క్ నైట్ (మ్యాట్ బ్లాక్), ట్రియంఫ్ సిల్వర్ రంగుల్లో అందుబాటులో ఉంది.
Also Read
- 18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
- Vivo V80 Lite: వివో వి80 లైట్ లాంచ్ డేట్ ఫిక్స్.. 10,000mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న వివో ఫోన్
- 16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!
- Lava Bold N4 Lite: లావా బోల్డ్ N4 లైట్ భారత్‌లో రిలీజ్ డేట్ ఫిక్స్.. 13MP కెమెరా, MIL-STD-810H రేటింగ్
Kalki 2898 AD Sequel: ఎట్టకేలకు మొదలెట్టేశారు..పిక్స్ చూశారా?
ప్రాసెసర్:
ఈ ఫోన్లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 5 (Qualcomm Snapdragon 8 Gen 5) ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది మంచి పనితీరు, వేగవంతమైన గేమింగ్, మల్టీటాస్కింగ్‌ను సులభం చేస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆరిజిన్OS 6పై ఈ ఫోన్ పనిచేస్తుంది. కంపెనీ ఈ ఫోన్‌కు 4 సంవత్సరాల ఆండ్రాయిడ్ అప్డేట్లు, 6 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్లను అందిస్తుంది. ఇంకా ఇది AnTuTu బెంచ్‌మార్క్‌లో 3.5 మిలియన్‌కు పైగా స్కోర్ సాధించినట్లు కంపెనీ తెలిపింది.

అడ్వాన్స్డ్ కూలింగ్ సిస్టమ్:
iQOO 15Rలో 6500mm ఐస్ స్కోర్ VC కూలింగ్ సిస్టమ్, డ్యూయల్ గ్రాఫైట్ షీట్, అధిక థర్మల్ కండక్టివిటీ టెక్నాలజీ ఉంది. ఇది ఫోన్ ఉష్ణోగ్రతను వేగంగా తగ్గించి, గేమింగ్ సమయంలో ఫోన్ వేడెక్కకుండా కాపాడుతుంది. ఇంకా ఇది నెట్వర్క్ ఎన్హాన్స్మెంట్ చిప్ సిగ్నల్ శక్తిని పెంచుతుంది.
CM Chandrababu: ఇద్దరు టీటీడీ చైర్మన్లు కల్తీ జరిగిందని ఒప్పుకున్నారు..
కెమెరా సెటప్:
ఈ ఫోన్లో 50MP సోనీ LYT-700V ప్రధాన కెమెరా OIS సపోర్ట్‌తో అందించారు. అలాగే 8MP అల్ట్రా వైడ్ కెమెరా, 32MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఇవి AI ఫీచర్లు, లైవ్ ఫొటోస్, 4K వీడియో రికార్డింగ్ వంటి ఆధునిక కెమెరా ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. దీంతో ఫోటోగ్రఫీ, వీడియో రికార్డింగ్ లో బెస్ట్ గా రిజల్ట్స్ అందిస్తుంది.

బ్యాటరీ, ఛార్జింగ్:
ఈ కొత్త స్మార్ట్ ఫోన్ లో 7600mAh భారీ బ్యాటరీ అందించారు. ఇది 100W ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్‌తో కేవలం 33 నిమిషాల్లో 50% వరకు ఛార్జ్ అవుతుంది. అధునాతన సిలికాన్ అనోడ్, సెమీ-సాలిడ్ స్టేట్ బ్యాటరీ టెక్నాలజీతో ఇది దీర్ఘకాలిక బ్యాటరీ లైఫ్ అందిస్తుంది.
ధరలు:
iQOO 15R ధరలు ఇలా ఉన్నాయి.
* 8GB + 256GB – రూ. 44,999
* 12GB + 256GB – రూ. 47,999
* 12GB + 512GB – రూ. 52,999.
ICC: ఐసీసీ సంచలన నిర్ణయం.. భారత్- పాకిస్థాన్ సెమీఫైనల్ వెన్యూ ఫిక్స్.. ట్విస్ట్ ఏంటంటే..?
ఈ ఫోన్ అమెజాన్ ఇండియా, iQOO అధికారిక వెబ్సైట్, ఆఫ్‌లైన్ స్టోర్లలో మార్చి 3 నుంచి అందుబాటులో ఉంటుంది. ప్రీ-బుకింగ్ చేసిన వారికి మార్చి 2 నుంచే లభిస్తుంది. ఇంకా HDFC బ్యాంకు, Axis బ్యాంకు కార్డులతో రూ. 4000 ఇన్స్టంట్ డిస్కౌంట్, ఉచిత iQOO TWS 1e ఇయర్‌బడ్స్, 6 నెలల నో-కాస్ట్ EMI ఆఫర్ కూడా అందిస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్‌ఫర్డ్‌కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్‌లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!