Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Technology Iqoo 15 Ultra Gaming Smartphone Launch

ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ డిజైన్+ రెండు కలర్ వేరియంట్స్+ UFS 3.1 స్టోరేజ్‌తో iQOO 15 Ultra

Published Date :January 23, 2026 , 9:19 am
By Chandra Shekhar Pamena
  • స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లో ‘అల్ట్రా’ మోడల్‌ను తీసుకొచ్చిన iQOO..
  • iQOO 15 Ultra ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ డిజైన్+ రెండు కలర్ వేరియంట్స్ వెల్లడి..
  • ఫిబ్రవరి మొదటి వారంలో iQOO 15 Ultra విడుదల అయ్యే అవకాశం..
ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ డిజైన్+  రెండు కలర్ వేరియంట్స్+ UFS 3.1 స్టోరేజ్‌తో iQOO 15 Ultra
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

iQOO 15 Ultra: iQOO తొలిసారిగా తన స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లో ‘అల్ట్రా’ మోడల్‌ను తీసుకురాబోతోంది. iQOO లైనప్‌లో ఇప్పటివరకు వచ్చిన అత్యంత శక్తివంతమైన, ఖరీదైన ఫోన్‌గా నిలవనుంది. కంపెనీ ఇప్పటికే ఈ ఫోన్‌ను టీజర్ల ద్వారా పరిచయం చేయగా, తాజాగా పూర్తి డిజైన్‌తో పాటు కలర్ ఆప్షన్లను కూడా వెల్లడించింది. అధికారిక లాంచ్ డేట్ ఇంకా ప్రకటించకపోయినా, ఫిబ్రవరి తొలి వారంలోనే ఇది విడుదల కానుందని iQOO నిర్ధారించింది. కాగా, iQOO 15 Ultra డిజైన్, దాని సోదర మోడల్ iQOO 15తో పోలిస్తే పూర్తి భిన్నంగా ఉంది. ఇందులో పెద్ద స్క్వేర్ ఆకారంలోని కెమెరా మాడ్యూల్, స్పష్టంగా కనిపించే కెమెరా సెన్సర్లు, అలాగే కొత్తగా హారిజాంటల్ లైట్ స్ట్రిప్ ఉన్నాయి. మధ్య భాగంలో హనీకాంబ్ డిజైన్‌తో ఇది ఫ్యూచరిస్టిక్ లుక్‌ను అందిస్తోంది. ఈ ఫోన్ రెండు సై-ఫై కోడ్ నేమ్ కలర్ వేరియంట్స్‌లో రానుంది. ఇవి 2049 కోల్డ్ బ్లూ, 2077 ఫ్లోయింగ్ ఆరెంజ్ తో పాటు గేమింగ్ అనుభూతిని మరింత మెరుగుపరచేందుకు సైడ్ ఫ్రేమ్‌పై షోల్డర్ బటన్స్‌ను కూడా అందించారు.

Read Also: Subhas Chandra Bose Jayanti: “జై హింద్”.. నేతాజీ గురించి ఆసక్తికర విషయాలు..

Also Read

  • Redmi Watch 6: కొత్త Redmi Watch 6 లాంచ్.. AMOLED డిస్‌ప్లే, GPS ఫీచర్లతో అదిరింది
  • WhatsApp Shutdown ALERT: అలర్ట్.. ఆ తేదీ నుండి ఈ స్మార్ట్‌ఫోన్‌లలో వాట్సాప్ పనిచేయదు.. లిస్ట్ ఇదే
  • Honor Play 80 Plus: హానర్ ప్లే 80 ప్లస్ విడుదల.. 7,500mAh బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌
  • Motorola Razr Fold: మోటరోలా రేజర్ ఫోల్డ్ త్వరలో భారత్ లో విడుదల.. 80W ఛార్జింగ్, 6000mAh బ్యాటరీ
Add as a preferred
source on google

అయితే, ఈ డిజైన్ మొత్తం చూసినప్పుడు, iQOO 15 Ultra పూర్తిగా గేమింగ్, పెర్ఫార్మెన్స్‌పై దృష్టి పెట్టి రూపొందించిన ఫోన్ అని స్పష్టంగా అర్థమవుతుంది. ROG లేదా RedMagic లాంటి ఫోన్లంత పూర్తిగా గేమింగ్ స్టైల్ కాకపోయినా, ప్రీమియం లుక్‌తో పాటు గేమింగ్ టచ్‌ను సమతుల్యంగా కలిపినట్టుగా కనిపిస్తోంది. పెర్ఫార్మెన్స్ విషయంలో ఈ ఫోన్ నిజంగా సంచలనంగా మారనుంది. కంపెనీ వెల్లడించిన AnTuTu బెంచ్‌మార్క్ స్కోరు 4.5 మిలియన్లకు మించి ఉంది. ఇది ఇప్పటివరకు నమోదైన అత్యధిక స్కోర్లలో ఒకటిగా నిలుస్తుంది. అంతేకాదు, ఇది ఫోన్ యొక్క గరిష్ట సామర్థ్యం కాదని, ఇంకా ఎక్కువ పెర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం ఉందని కంపెనీ చెబుతోంది.

Read Also: Delhi Rain: ఢిల్లీలో ఈదురుగాలులతో కూడిన వర్షం.. ప్రజలకు ఇక్కట్లు

ఇక, కూలింగ్ సిస్టమ్ విషయంలో కూడా iQOO 15 Ultra ప్రత్యేకతను చూపిస్తోంది. ఇది తన సెగ్మెంట్‌లోనే అతి పెద్ద యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌ను కలిగి ఉంటుందని సమాచారం. 17 × 17 × 4 మిల్లీమీటర్ల పరిమాణంలో ఉన్న ఈ ఫోన్‌లో వేడి త్వరగా బయటకు వెళ్లేలా డిజైన్ చేశారు. ఎయిర్ ఇన్‌టేక్ వెనుక కెమెరా మాడ్యూల్ కింద ఉండగా, ఎగ్జాస్ట్ సైడ్ ఫ్రేమ్‌పై ఉంటుంది. దీని వల్ల దీర్ఘకాలం గేమింగ్ చేసినా ఫోన్ వేడెక్కకుండా స్థిరమైన పని తీరును అందించగలుగుతుంది. అయితే, స్టోరేజ్ విషయంలో iQOO 15 Ultra UFS 3.1 టెక్నాలజీతో రానుంది. మెమరీ వేరియంట్స్ 16GB ర్యామ్ + 512GB స్టోరేజ్ నుంచి ప్రారంభమై, 24GB ర్యామ్ + 1TB స్టోరేజ్ వరకూ ఉండనుంది. ఇది ఈ ఫోన్‌ను నిజమైన పవర్‌హౌస్‌గా మార్చే అంశం.

Read Also: Oscar Nominations 2026 : ఆస్కార్స్ నామినేషన్ 2026 ఫైనల్ లిస్ట్ ఇదే..

అలాగే, ఇప్పటికీ కొన్ని స్పెసిఫికేషన్లు రహస్యంగానే ఉన్నప్పటికీ, iQOO 15 Ultra పూర్తిగా పెర్ఫార్మెన్స్‌ను కేంద్రంగా చేసుకుని రూపొందుతోందన్న విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. గేమింగ్, హెవీ మల్టీటాస్కింగ్, దీర్ఘకాల పని తీరు కోసం అవసరమైన అన్ని హార్డ్‌వేర్ అంశాలను ఇందులో జోడించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫోన్ చైనాలో లాంచ్ అవుతుందని మాత్రమే అధికారికంగా నిర్ధారించారు. భారత్‌లో విడుదలపై ఇంకా ఎలాంటి సమాచారం రాలేదు. కాగా, భారత మార్కెట్‌లోకి వస్తే గేమింగ్ స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లో గట్టి పోటీదారుగా నిలిచే అవకాశాలు ఉన్నాయి. హెవీ పెర్ఫార్మెన్స్‌కు ప్రాధాన్యం ఇచ్చే యూజర్లు ఈ ఫోన్‌పై తప్పక దృష్టి పెట్టాల్సిందే.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • gaming phone China
  • gaming smartphone iQOO
  • iQOO 15 Ultra
  • iQOO 15 Ultra AnTuTu score
  • iQOO 15 Ultra design

తాజావార్తలు

  • Ugly Story: మొన్న సైక్, ఇప్పుడు సైకో.. ఆసక్తికరంగా నందు ‘అగ్లీ స్టోరీ’ ట్రైలర్

  • CSK: సంజూ కాదు.. ఆ యువ ఆటగాడి ఆట అమోఘం: బ్యాటింగ్ కోచ్ మైఖేల్ హస్సీ

  • BJP Bengal Win: పాక్ నుంచి యూఎస్ వరకు.. బీజేపీ బెంగాల్ విక్టరీపై అంతర్జాతీయ చర్చ..

  • TVK Vijay: విజయ్‌కు వామపక్షాలు బిగ్ షాక్.. మద్దతు ఇవ్వబోమని ప్రకటన

  • Bhagyashri Borse: భాగ్యశ్రీ భోర్సే బర్త్ డే.. ‘లెనిన్’ డిఫరెంట్ పోస్టర్ విడుదల

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions