అత్యంత చవకగా iPhone 18e .. ప్రో మోడల్స్ కంటే తక్కువ ధరకే ఎంట్రీ!

Iphone 18e Launch

Iphone 18e Launch

iPhone 18e: ఆపిల్ బ్రాండ్ ఫోన్ చేతిలో ఉండాలని చాలామందికి కోరిక ఉంటుంది. కానీ లక్షల్లో పలికే ధరలను చూసి వెనకడుగు వేస్తుంటారు. అలాంటి బడ్జెట్ యూజర్లకు, ఆపిల్ లవర్స్‌కు టెక్ దిగ్గజం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పబోతోంది. ఇటీవలే అత్యంత ఖరీదైన ఐఫోన్ 18 ప్రో సిరీస్‌తో పాటు ఐఫోన్ డుయో మోడళ్లను మార్కెట్లోకి తెచ్చిన ఆపిల్.. వచ్చే ఏడాది ఆరంభంలో సామాన్యులను ఆకట్టుకునేలా సరికొత్త లైనప్‌ను సిద్ధం చేస్తోంది. ఇందులో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న మోడల్ ‘ఐఫోన్ 18e’. తాజా నివేదికల ప్రకారం.. వచ్చే ఏడాది ప్రారంభంలో స్టాండర్డ్ ఐఫోన్ 18, ఐఫోన్ ఎయిర్ 2లతో పాటు ‘ఐఫోన్ 18e’ అధికారికంగా లాంచ్ కానుంది. ఈ మొత్తం లైనప్‌లోనే అత్యంత చవకైన మోడల్‌గా ఐఫోన్ 18e మార్కెట్‌లోకి రాబోతోంది. లక్షలు పోసి ప్రో మోడల్స్ కొనలేని వారికి, తక్కువ బడ్జెట్‌లో లేటెస్ట్ ఐఫోన్ అనుభూతిని పొందాలనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ఆప్షన్‌గా నిలవనుంది. కంపెనీ ఇంకా అధికారిక ధరను ప్రకటించనప్పటికీ, భారత మార్కెట్లో పోటీని తట్టుకునేలా దీన్ని అందుబాటు ధరలోనే తీసుకురానున్నట్లు టెక్ వర్గాలు చెబుతున్నాయి.

ధర తక్కువగా ఉన్నప్పటికీ, రోజువారీ యూజ్‌కి అవసరమైన ప్రీమియం ఫీచర్లను ఇందులో అందించేలా ఆపిల్ ప్లాన్ చేస్తోంది. తాజా ఆపరేటింగ్ సిస్టమ్ సపోర్ట్, ఆపిల్ సొంత చిప్‌సెట్ పవర్, నాణ్యమైన కెమెరా పనితీరు ఇందులో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ప్రీమియం లుక్‌తో పాటు ఆపిల్ ఎకోసిస్టమ్‌లోకి సులభంగా ఎంట్రీ ఇవ్వాలనుకునే వారికి ఈ మోడల్ ప్రధాన ఎంపిక కానుంది. ఓవైపు రూ.99,990 అంచనా ధరతో, 256GB బేస్ వేరియంట్, 48 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా, పవర్ ఫుల్ 2nm A20 చిప్‌సెట్, పెద్ద బ్యాటరీతో ఐఫోన్ 18 రాబోతుండగా.. మరోవైపు అల్ట్రా స్లిమ్ లుక్‌లో ఐఫోన్ ఎయిర్ 2 కూడా సిద్ధమవుతోంది. వీటన్నింటి మధ్య అత్యంత తక్కువ ధరకే వచ్చే ‘ఐఫోన్ 18e’ మిడ్-రేంజ్, అప్పర్ మిడ్-రేంజ్ మార్కెట్‌ను ఒక ఊపు ఊపడం ఖాయంగా కనిపిస్తోందని చెబుతున్నారు. వచ్చే ఏడాది మొదట్లోనే ఈ బడ్జెట్ ఐఫోన్ లాంచ్ కానుండటంతో టెక్ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.