Instagram Offline Reels: రీల్స్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఇక ఇంటర్నెట్ లేకపోయినా ‘రీల్స్’ చూసేయొచ్చు .. ఎలాగంటే.!
- ఇన్‌స్టాగ్రామ్ కొత్తగా ‘ఆఫ్‌లైన్ రీల్స్’ ఫీచర్ పై పరీక్షలు
- ఇంటర్నెట్ లేకపోయినా ముందుగా డౌన్‌లోడ్ చేసిన రీల్స్ చూడగల అవకాశం
- యూజర్ ఆసక్తికి తగ్గట్టుగా ఆటోమేటిక్‌గా రీల్స్ డౌన్‌లోడ్
- కేవలం Wi-Fi లోనే డౌన్‌లోడ్ అయ్యేలా సెట్టింగ్స్ మార్చుకునే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Instagram Offline Reels: ఎప్పుడైనా ప్రయాణాల్లో ఉన్న సమయంలోనో లేదా సిగ్నల్ సరిగ్గా లేని ప్రాంతంలో ఉన్నప్పుడో ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే.. రీల్స్ లోడ్ అవ్వక తెగ బాధ పడిపోతుంటారు. కేవలం ఖాళీ స్క్రీన్ మాత్రమే కనిపిస్తూ మనల్ని నిరుత్సహ పెడుతుంది. అయితే ఈ సమస్యకు త్వరలోనే చెక్ పెట్టేందుకు ‘మెటా’ (Meta) యాజమాన్యంలోని ఇన్‌స్టాగ్రామ్ సిద్ధమవుతోంది. ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా రీల్స్ చూసేలా సరికొత్త ‘ఆఫ్‌లైన్ రీల్స్’ ఫీచర్ ను సంస్థ పరీక్షిస్తోంది.
Daily Horoscope: సోమవారం రాశి ఫలాలు.. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త సుమీ!
Also Read
- AI Home Appliances: కరెంట్ బిల్లు తగ్గించే టాప్ AI గృహోపకరణాలు.. ఏసీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్లో ఏది ఎక్కువ ఆదా చేస్తుంది..?
- OnePlus 16 లీక్స్ వైరల్.. 9,000mAh భారీ బ్యాటరీ, సరికొత్త ఫీచర్లతో భారీ అంచనాలు..
- Bank of Baroda Data Leak: బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ డేటా లీక్? ప్రమాదంలో కోట్లాది కస్టమర్ల సమాచారం!
- రూ.1,449కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్.. BSNL బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ అదిరిపోయింది..!
ఇందుకు సంబంధించిన విషయాలను ఓ ప్రముఖ మొబైల్ డెవలపర్, టిప్‌స్టర్ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ఆయన షేర్ చేసిన స్క్రీన్ షాట్‌ల ప్రకారం, ఇన్‌స్టాగ్రామ్ ఒక ఆటోమేటిక్ డౌన్ లోడ్ సిస్టమ్ పై ఇప్పుడు పనిచేస్తోంది. ఇది మీ ఆసక్తికి తగ్గట్టుగా కొన్ని రీల్స్ ను ముందే డౌన్‌లోడ్ చేసి ఉంచుతుంది. దీనితో డేటా లేని సమయంలో కూడా మీరు వినోదాన్ని అందుకోవచ్చు. ఈ కొత్త అప్డేట్ లో వినియోగదారులకు పూర్తి నియంత్రణ ఇచ్చేలా కొన్ని ఆప్షన్లను ఇన్‌స్టాగ్రామ్ రూపొందించింది.
ఇందులో మీరు వై-ఫైలో ఉన్నప్పుడు రీల్స్‌ను ఆటోమేటిక్‌గా సేవ్ చేసే ఆప్షన్ ఉంటుంది. అయితే ముఖ్యంగా మీ ఫోన్ స్టోరేజ్ నిండిపోకుండా ఉండేందుకు.. మీరు ఎన్ని వీడియోలను డౌన్లోడ్ చేయాలనేది నిర్ణయించుకోవచ్చు. ఉదాహరణకు 10, 30, లేదా 50 రీల్స్ వరకు లిమిట్ సెట్ చేసుకునే అవకాశం ఉండబోతోంది. అంతేకాకుండా వీటికోసం మీ మొబైల్ డేటా వృథా కాకుండా కేవలం వై-ఫై ఉన్నప్పుడే డౌన్‌లోడ్ అయ్యేలా సెట్టింగ్స్ కూడా మార్చుకోవచ్చు. ఆఫ్‌లైన్ లో ఉన్నప్పుడు ఈ వీడియోలను మీ సాధారణ ఫీడ్‌లో లేదా ప్రత్యేకంగా ఉండే ‘డౌన్‌లోడ్స్’ సెక్షన్ ద్వారా చూసుకోవచ్చు. (అచ్చం యూట్యూబ్ మాదిరి). ఇప్పటికే యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్ వంటి ప్లాట్‌ఫారమ్ లలో ఉన్న ‘స్మార్ట్ డౌన్‌లోడ్స్’ తరహాలోనే ఈ ఫీచర్ పనిచేయనుంది.
Chairman’s Desk : చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ పెను మార్పులు తెస్తుందా?
ప్రస్తుతం ఈ ఫీచర్ ఇంకా టెస్టింగ్ దశలోనే ఉంది. ఇన్‌స్టాగ్రామ్ దీనిపై అధికారికంగా ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు. ఒకసారి పరీక్షలు పూర్తయ్యాక, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులందరికీ ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. డేటా కనెక్టివిటీ సమస్యలు ఎదుర్కొనే మన దేశం వంటి ప్రాంతాల్లో ఈ ఫీచర్ రీల్స్ ప్రియులకు ఒక పెద్ద వరం అనే చెప్పాలి.
తాజావార్తలు
-
Pavala Shyamala: టాలీవుడ్ లో విషాదం.. సీనియర్ నటి కన్నుమూత..!
-
Abqaiq Refinery Fire: ఇరాక్ డ్రోన్ దాడులు.. సౌదీ అరేబియాలోని అబ్కైక్ ఆయిల్ రిఫైనరీలో భారీ అగ్నిప్రమాదం
-
Vadhandhi 2: సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్‌కు సీక్వెల్.. ‘వధండి 2’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్, ఈసారి హీరో మారిపోయాడు!
-
VVS Laxman vs Gautam Gambhir: ఇప్పుడు గంభీర్ వర్సెస్ లక్ష్మణ్ చర్చ ఎందుకు..?
-
TGPSC : రోడ్డుపై OMR షీట్ల కలకలం.. వివరణ ఇచ్చిన TGPSC
ట్రెండింగ్
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్‌మన్ గిల్!
-
రూ.1,449కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్.. BSNL బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ అదిరిపోయింది..!
-
15 నెలల వ్యాలిడిటీతో Jio ‘Freedom Pack’.. 1000+ టీవీ ఛానళ్లు, 12 OTTలు ఫ్రీ.!
-
Samsung Galaxy Z Fold 8 Ultra vs Galaxy Z Fold 7: ఏ ఫోల్డబుల్ ఫోన్ బెస్ట్.?
-
Vaibhav Sooryavanshi: నా కల నిజమైంది.. ఇక మరింత రెచ్చిపోతా.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!