యువత వారానికి 70 గంటలు పని చేయాలని తాను చేసిన ప్రకటనను ఐటీ రంగ ప్రముఖుడు, ఇన్ఫోసిస్ సహ వ్యవవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి మరోసారి సమర్థించారు. కృషి మాత్రమే భారతదేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తుందన్నారు. సీఎన్‌బీసీ గ్లోబల్ లీడర్‌షిప్ సమ్మిట్‌లో ఆయన ఈ వారానికి 70 గంటల పని గురించి మరోసారి ప్రస్తావించారు. “క్షమించండి, నా అభిప్రాయం మారలేదు. నేను చనిపోయే వరకు ఈ ఆలోచన నాలో ఉంటుంది.” అని ఆయన స్పష్టం చేశారు. 1986లో వారానికి 6 రోజుల పని నుంచి 5 రోజులకు మారినప్పుడు.. తాను చాలా బాధపడ్డానన్నారు. దేశాన్ని అభివృద్ధి చేయాలంటే విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం లేదని, కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీని కూడా ప్రస్తావిస్తూ.. మోడీ వారానికి 100 గంటలు పనిచేస్తున్నారని చెప్పారు. ఆయన అంత కష్టపడగలిగితే మనం ఎందుకు చేయలేమని ప్రశ్నించారు.
READ MORE: Anil Ambani: అనిల్ అంబానీకి మళ్లీ భారీ ఎదురుదెబ్బ! ఎస్‌ఈసీఐ షోకాజ్ నోటీసు
మనం కూడా పనిచేసి ఈ దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో అనే అంశంపై ఆలోచించలన్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీ, జపాన్‌లు ఎలా అభివృద్ధి చెంది మళ్లీ ధనిక దేశాలుగా మారాయో ఒక్కసారి తెలుసుకోవాలన్నారు. మనం వారిని చూసి నేర్చుకోవాలని అభిప్రాయపడ్డారు. భారతదేశం కూడా ఈ మార్గాన్ని అనుసరించాలని, దాని ద్వారానే దేశ పునర్నిర్మాణం సాధ్యమవుతుందని సూచించారు. జర్మనీ, జపాన్ ప్రజలు చేసిన ప్రయత్నాలే మనం కూడా చేయాలని చెప్పారు. తాను తన జీవితాంతం ఈ ఆలోచనను అనుసరిస్తానని.. ఎల్లప్పుడూ 14 గంటలు పనిచేశాస్తానన్నారు. వారంలో ఆరున్నర రోజులు పని చేస్తూనే ఉన్నానని చెప్పారు. రోజూ ఉదయం 6:30 గంటలకు ఆఫీసుకు చేరుకునేవాడిని, తిరిగి రాత్రి 9 గంటలకు ఇంటికి బయలుదేరేవాడినని చెప్పారు. ఈ జీవనశైలికి తాను గర్వపడుతున్నారు. ప్రపంచంలో విజయానికి ఒకే ఒక్క మార్గమని.. అది కష్టపడి పనిచేయడమేనని 78 ఏళ్ల వ్యాపారవేత్త స్పష్టం చేశారు.
READ MORE: PM Modi: పీఎం మోడీ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం..
సాధారణంగా… భారత్‌లో రోజుకు 8గంటల పనిగంటలు ఉంటాయి. ప్రైవేట్ సెక్టార్‌లో వారానికి ఒక రోజు సెలవు ఉండగా… ఐటీ సెక్టార్‌లో మాత్రం శని, ఆదివారాలు సెలవు. ఈ లెక్కన వారానికి ఒక్కో ఉద్యోగి దాదాపు 50 గంటల వరకు పనిచేస్తుంటారు. అయితే… ఇది సరిపోదని.. వారానికి 70 గంటల పనిచేయాలన్నది ఇన్పోసిస్ నారాయణ మూర్తి వాదన అంటే. రోజుకు సగటును… 12గంటలు పనిచేయాలని ఆయన చెప్తున్నారు. దేశం కోసం శ్రమిస్తామని యువత ప్రతిబూని పనిచేయాలని ఆయన వాదన. గతంలో కూడా ఆయన ఈ విషయాన్ని నొక్కి చెప్పారు. ప్రస్తుతం మరోసారి గుర్తుచేశారు.