Site icon NTV Telugu

Infinix Hot 60i 5G: మార్కెట్‌ను ఏలడానికి సిద్దమైన ఇన్‌ఫినిక్స్‌.. 6,000mAh బ్యాటరీ, 6.75 అంగుళాల డిస్ప్లేతో రాబోతున్న కొత్త ఫోన్!

Infinix Hot 60i 5g

Infinix Hot 60i 5g

Infinix Hot 60i 5G: ఇన్‌ఫినిక్స్‌ తన కొత్త స్మార్ట్‌ఫోన్ ఇన్ఫినిక్స్ హాట్ 60i 5G (Infinix Hot 60i 5G)ను ఆగష్టు 16న భారత మార్కెట్లో విడుదల చేయడానికి సిద్ధమైంది. ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేక మైక్రోసైట్‌ ద్వారా ఈ ఫోన్ లాంచ్ కానుందని అధికారికంగా వెల్లడించింది. ఈ మైక్రోసైట్, కంపెనీ సమాచారం ప్రకారం, ఫోన్‌ యొక్క డిజైన్, చిప్‌సెట్, బ్యాటరీ సామర్థ్యం వంటి ముఖ్యమైన స్పెసిఫికేషన్లు తెలిసిపోయాయి. ఈ ఫోన్‌ MediaTek Dimensity 6400 SoC బంతి ట్రెండింగ్ ప్రాసెసర్‌తో రానుంది.

ఇన్ఫినిక్స్ హాట్ 60i 5G షాడో బ్లూ, మాన్సూన్ గ్రీన్, స్లీక్ బ్లాక్, ప్లమ్ రెడ్ అనే నాలుగు కలర్‌ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఫ్లిప్‌కార్ట్, ఇన్ఫినిక్స్ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా విక్రయించబడుతుంది. 4G వెర్షన్ ఇప్పటికే రెండు నెలల క్రితం బంగ్లాదేశ్‌లో విడుదల అయ్యింది. అక్కడ 6GB RAM + 128GB స్టోరేజ్ మోడల్‌ సుమారు 10,000 ధరతో లభ్యమవుతుంది. అయితే, భారతదేశంలో 5G వెర్షన్‌ కూడా కొద్దిగా ఎక్కువ ధరలో వచ్చే అవకాశం ఉంది.

Lenovo Tab: డాల్బీ ఆటమ్స్ సౌండ్‌, 5,100mAh బ్యాటరీ, 4 సంవత్సరాల సెక్యూరిటీతో కొత్త ట్యాబ్ లాంచ్!

ఇన్ఫినిక్స్ హాట్ 60i 5G Android 15 ఆధారంగా XOS 15తో రానుంది. ఈ మొబైల్ 6.75 అంగుళాల HD+ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఇక ఇందులో 6,000mAh భారీ బ్యాటరీ ఈ ఫోన్‌ ప్రత్యేకతగా చెప్పవచ్చు. కంపెనీ ప్రకారం ఇది తన ధర విభాగంలో మొదటిసారి ఇంత పెద్ద బ్యాటరీ కలిగిన ఫోన్ అవుతుందని పేర్కొంది. ఈ బ్యాటరీ 128 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ అందించగలదని ఇన్ఫినిక్స్ చెబుతోంది.

shocking incident from Bihar: బీహార్‌లో దారుణం.. స్తంభానికి కట్టేసి ఛీ..

ఇక కెమెరా విభాగంలో, ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో కూడిన డ్యుయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. డ్యుయల్ LED ఫ్లాష్ లైట్లు, HDR, పానోరమా మోడ్‌లకు సపోర్ట్ అందించబడుతుంది. రియర్ ప్యానెల్‌పై మ్యాట్ ఫినిష్ డిజైన్, రెక్టాంగ్యులర్ కెమెరా ఐలాండ్ ఉంటాయి. ఈ ఫోన్ బడ్జెట్ సెగ్మెంట్‌లో మంచి ఫీచర్లు, ఆకర్షణీయమైన డిజైన్, ఇంకా భారీ బ్యాటరీతో మార్కెట్‌లో ప్రత్యేక స్థానం సంపాదించడానికి రంగం సిద్ధం చేస్తుంది.

Exit mobile version