3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Infinix GT 50 Pro: గేమింగ్ స్మార్ట్ఫోన్ల విభాగంలోకి ఇన్ఫినిక్స్ మరో కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. ఇందులో భాగంగానే ఇదివరకు గ్లోబల్ మార్కెట్ లో లాంచ్ అయిన Infinix GT 50 Pro స్మృతి ఫోన్ ఇప్పుడు భారత మార్కెట్లో అక్టోబర్ 27న లాంచ్ కానుంది. గతేడాది జూన్‌లో విడుదలైన GT 30 Proకు కొనసాగింపుగా ఈ ఫోన్ రానుంది. సూపర్‌కార్ల డిజైన్ నుంచి స్ఫూర్తి పొందిన ప్రత్యేక 3D ఎఫెక్ట్‌తో పాటు, వెనుక భాగంలో కనిపించే లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఈ ఫోన్లో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
ఈ మొబైల్ అమ్మకాలు ఫ్లిప్‌కార్ట్ ద్వారా జరగనున్నాయి. ఈ ఫోన్‌ను కంపెనీ సైబర్ మెకా డిజైన్ శైలిలో రూపొందించింది. సూపర్కార్లలో కనిపించే ఆకృతులు, ఏరోడైనమిక్ లైన్స్ ఆధారంగా దీని డిజైన్‌ను అభివృద్ధి చేశారు. వెనుక ప్యానెల్‌పై కెవ్లార్ తరహా టెక్స్చర్ను ఉపయోగించారు. ఇది ఫోన్‌కు తక్కువ బరువుతో పాటు మన్నికను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ స్మార్ట్‌ఫోన్ బ్లాక్ అబిస్, రెడ్ బ్లేజ్ అనే రెండు రంగుల్లో అందుబాటులోకి రానుంది. బ్లాక్ అబిస్ మోడల్లో గ్రీన్ కలర్ కూలింగ్ యాక్సెంట్స్ ఉండగా.. రెడ్ బ్లేజ్ వేరియంట్లో రెడ్ కలర్ యాక్సెంట్స్‌ను అందించారు. గేమింగ్ ఫోన్‌కు ప్రత్యేకమైన రూపాన్ని ఇచ్చేలా ఈ రంగుల కలయికను రూపొందించారు.
Also Read
- Amazon Great Indian Festival: iQOO, Redmi, OnePlus, Samsung కంపెనీ ఏదైనా సరే భారీ డిస్కౌంట్.. రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్లు..
- 50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
- 200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
- Amazon Festival Sale: ఈ కంపెనీ ల్యాప్‌టాప్‌లపై భారీ ఆఫర్లు.. ఓ లుక్కేయండి..
Infinix GT 50 Pro మొబైల్లో హైడ్రోఫ్లో లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌ను అందిస్తున్నారు. ఇందులో కంపెనీ పేర్కొన్న ఇండియాలో తొలి ‘ఎక్స్ప్లిసిట్ వ్యూపోర్ట్ డిజైన్’ ప్రత్యేకత ఉంది. ఫోన్ వెనుక భాగంలో ప్రత్యేక విండోను ఏర్పాటు చేసి, దాని ద్వారా లిక్విడ్ కూలింగ్ ఛానెల్స్ కనిపించేలా రూపొందించారు. ప్రత్యేక ప్రింటింగ్ టెక్నాలజీతో కాంతి, నీడల ప్రభావాన్ని సృష్టించి మెకానికల్ పైపుల తరహా 3D రూపాన్ని అందించారు. ఈ ఫోన్లో కంపెనీ అభివృద్ధి చేసిన ఫ్లో-ఛానెల్ డిజైన్‌తో పాటు డ్యూయల్ పంప్ సిస్టమ్‌ను ఉపయోగించారు. గేమింగ్ సమయంలో ఉత్పత్తయ్యే వేడిని సమర్థంగా బయటకు పంపించేందుకు ఈ వ్యవస్థ ఉపయోగపడుతుందని ఇన్ఫినిక్స్ చెబుతోంది.
భారత్‌లో ఈ ఫోన్‌తో పాటు గేమింగ్‌కు ఉపయోగపడే కొన్ని యాక్సెసరీలను పరిచయం చేసే అవకాశాన్ని కంపెనీ సూచించింది. అయితే, భారత వేరియంట్‌కు సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్లు, ధర, యాక్సెసరీల వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. లాంచ్ సమయంలో వీటిపై స్పష్టత రానుంది.
తాజావార్తలు
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
Ranabaali Trailer: ‘రణబాలి’ ట్రైలర్‌పై మంత్రి లోకేష్ రివ్యూ!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
-
IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!