India.. world’s start-up capital: భారతదేశం ప్రపంచ స్టార్టప్‌ల రాజధానిగా ఎదుగుతోందని మైక్రోసాఫ్ట్ ఇండియా స్టార్టప్ ఎకోసిస్టమ్ డైరెక్టర్ సంగీత బవి అన్నారు. ఇండియాలో ఒక వ్యాపారవేత్తగా ఉండటానికి ఇది సరైన సమయమని చెప్పారు. భారతదేశం సాంస్కృతికపరంగా కూడా చాలా మార్పులకు లోనవుతోందని, ఎంట్రప్రెన్యూర్‌షిప్ వైపు శరవేగంగా దూసుకుపోతోందని తెలిపారు. సొంత స్టార్టప్‌లను బిల్డ్ చేయాలనుకునేవారికి మైక్రోసాఫ్ట్ ఏవిధంగా సాయపడుతోందో ఆమె వివరించారు.
read also: T20 World Cup: పాకిస్థాన్‌కు షాక్.. జింబాబ్వే సంచలన విజయం
స్టార్టప్‌లు ఒడిదుడుకులకు లోనవుతున్నాయంటే అది ఎకానమీ మరియు మార్కెట్ పరిస్థితులకు సూచిక అని సంగీత బవి అభిప్రాయపడ్డారు. స్టార్టప్‌లను భవిష్యత్తుకు అనుగుణంగా సంసిద్ధం చేసేందుకు మైక్రోసాఫ్ట్ తన వంతు ప్రయత్నంగా ‘ఫ్యూచర్ రెడీ ఇన్నోవేషన్ హబ్’ను గతంలోనే ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మైక్రోసాఫ్ట్ సంస్థ ప్లాట్‌ఫామ్ ప్రొవైడర్‌గా మరియు సంబంధిత సొల్యూషన్ ప్రొవైడర్‌గా వ్యవహరించనుంది. తద్వారా పార్ట్నర్‌షిప్ మోడల్‌ను నిర్మించనుంది. ట్రస్ట్, ఇన్నోవేషన్లనే ఫౌండేషన్‌గా మలచుకొని ముందుకు సాగుతుంది. క్లౌడ్ టెక్నాలజీలు మరియు గో-టు-మార్కెట్ వనరులను వినియోగించుకుంటూ స్టార్టప్‌లు ఫ్యూచర్-రెడీగా తయారవుతాయి.
