NTV Telugu Site icon

Aadhaar Mobile Number: మీ ఆధార్‌కి వేరొకరి ఫోన్ నెంబర్ లింక్ అయ్యిందా?.. చిక్కుల్లో పడినట్లే!

Adhar Mobile Number

Adhar Mobile Number

ఆధార్ కార్డ్ ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ డాక్యుమెంట్ గా మారింది. ఐడెంటిటీ కోసం, ప్రభుత్వ పథకాల కోసం, ఇతర ప్రయోజనాలు పొందడానికి ఆధార్ కార్డును యూజ్ చేస్తుంటారు. అయితే ఒక్కోసారి మనకు తెలియకుండానే ఆధార్ కార్డ్ మిస్ యూజ్ అవుతుంటుంది. దీన్ని ఆసరాగా చేసుకుని సైబర్ క్రిమినల్స్ మోసాలకు పాల్పడుతుంటారు. ఇదిలా ఉంటే.. మొబైల్ యూజ్ చేస్తున్నవారు సిమ్ కార్డు కోసం తమ ఆధార్ ను ఇవ్వాల్సి ఉంటుంది. అయితే కొన్ని సార్లు పొరపాటున వేరొకరి ఫోన్ నెంబర్ కు లింక్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది.

కొన్నిసార్లు చట్టపరమైన చర్యలకు గురికావాల్సి ఉంటుంది. జైలు శిక్షకు కూడా గురికావాల్సి ఉంటుంది. ఎందుకంటే.. మీ ఆధార్ తో వేరొకరి ఫోన్ నెంబర్ కనెక్ట్ అయ్యి ఉంటే ఆ వ్యక్తులు క్రిమినల్స్ అయ్యుంటే అప్పుడు మీరు కూడా చిక్కుల్లో పడతారు. ఆ వ్యక్తి చేసే నేర కార్యకలాపాలకు మీరు బాధ్యతవహించాల్సి ఉంటుంది. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికమ్యునికేషన్స్ న్యూ సిమ్ కార్డ్ కొనుగోలు నిబంధనలను కఠినతరం చేసింది. మోసాలు, ఫేక్ కాల్స్ ను అరికట్టడానికి టెలికమ్యూనికేషన్ డిపార్ట్ మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది.

కాబట్టి మీ ఆధార్ కార్డుతో ఏయే నెంబర్స్ లింక్ అయి ఉన్నాయో తెలుసుకోవడం ఉత్తమం. కొన్ని సందర్భాల్లో మీ ఆధార్ తో లింక్ అయిన మొబైల్ నెంబర్ ఎక్కడైనా పోగొట్టుకుని ఉండొచ్చు. కాబట్టి మీ ఆధార్ తో వేరొకరి ఫోన్ నెంబర్ లింక్ అయి ఉంటే వెంటనే బ్లాక్ చేయడం బెటర్. మరి దీని కోసం మీరు చేయాల్సింది ఏంటంటే.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంచార్ సాథి పోర్టల్ ను సందర్శించాల్సి ఉంటుంది. అక్కడ మీ ఆధార్ కార్డుతో ఏయే నెంబర్లు లింక్ అయి ఉన్నాయో తెలుసుకుని మీవి కాని నెంబర్లను బ్లాక్ చేసుకోవచ్చు.

మీ ఆధార్ తో లింక్ అయిన వేరొక నెంబర్ బ్లాక్ చేయడానికి..

Show comments