Site icon NTV Telugu

Child Abuse Case: చిన్నారిపై ఆయా దారుణం.. స్కూల్ సీజ్, యాజమాన్యంపై కేసు నమోదు.. పాప పరిస్థితి ఎలా ఉందంటే..?

School

School

Child Abuse Case: హైదరాబాద్‌లోని షాపూర్‌నగర్‌లో నాలుగేళ్ల చిన్నారిపై ఓ ప్రైవేట్ పాఠశాల ఆయా అమానుషంగా వ్యవహరించిన ఘటన వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. పూర్ణిమ స్కూల్‌లో జరిగిన ఈ దారుణంపై విద్యాశాఖ వెంటనే చర్యలు తీసుకొని స్కూల్‌ను సీజ్ చేసింది. బాధిత చిన్నారి ప్రస్తుతం కోలుకుంటోంది. అభం శుభం తెలియని చిన్న పాపపై ఈ అమానుష హింస అందరిని కలచివేసింది. పాప తండ్రితో జరిగిన గొడవను మనసులో పెట్టుకున్న ఆయా లక్ష్మి, చిన్నారిని స్కూల్ ప్రాంగణానికి తీసుకెళ్లి దారుణంగా కొట్టింది. పాప కాళ్లపై నిలబడి కొట్టడం వంటి నమ్మశక్యంకాని హింసను ఆచరించింది.

REDMI 15C 5G Lunch: 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా.. 10 వేలకే రెడ్‌మీ నుంచి పవర్ ఫుల్ ఫోన్!

ఈ సంఘటనను స్కూల్ పక్క భవనం పై అంతస్తులో ఉన్న యువకుడు వీడియోగా చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఘటన బయటపడింది. వీడియో వైరల్ కావడంతో పోలీసులు వెంటనే స్పందించి చిన్నారి కుటుంబాన్ని సంప్రదించారు. చిన్నారిని తల్లి దండ్రులతో కలిసి వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. బాలానగర్ ఏసీపీ నరేశ్ రెడ్డి, జీడిమెట్ల ఇన్‌స్పెక్టర్ గడ్డం మల్లేశ్ ఆసుపత్రికి చేరుకొని చిన్నారి ఆరోగ్య స్థితిని తెలుసుకున్నారు. అనంతరం బాధ్యురాలు అయిన ఆయా లక్ష్మిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు వారిపై కూడా కేసు నమోదు చేశారు. సంఘటన గురించి వివరాలు తెలుసుకోవడానికి MEO స్కూల్ కు చేరుకొని యాజమాన్యాన్ని విచారించారు. ఆపై అధికారుల ఆదేశాల మేరకు పూర్ణిమ స్కూల్‌ను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు.

kamal-vijay : ఆ ఒక్క విషయంలో విజయ్‌‌కి నేను సలహా ఇవ్వలేను – కమల్ హాసన్ షాకింగ్ కామెంట్

Exit mobile version