Human Washing Machine: ప్రస్తుత జనరేషన్ లో మనం కేవలం బట్టలు ఉతికే వాషింగ్ మెషిన్లు మాత్రమే చూస్తున్నాం.. కొన్నాళ్ల తర్వాత బట్టలు ఉతికి ఆరేసినట్లు.. మనుషులను ఉతికి ఆరేసే మెషీన్లు రాబోతున్నాయి.. రోజంతా రకరకాల పనులతో బాగా అలసిపోయిన వారికి స్నానం చేసే ఓపిక ఉండకపోతే.. మెషీన్ టబ్‌లో 15 నిమిషాలు కూర్చుంటే చాలు.. కాసేపటి తర్వాత తలతలలాడే శరీరంతో బయటకు వస్తారట.
Read Also: Burra Venkatesham : “నేనున్నా.. ధైర్యంగా పరీక్షలు రాయండి” నిరుద్యోగులకు TGPSC ఛైర్మన్ హామీ
అయితే, జపాన్‌కు చెందిన ‘సైన్స్ కో’ కంపెనీ ఇంజనీర్లు ఈ మెషీన్‌ను తయారు చేసినట్టు ఓ వార్త సంస్థ కథనం ప్రసారం చేసింది. ఇది ఈ మెషీన్‌లోని ఆ వ్యక్తి శరీరం, చర్మం తీరును బట్టి వాష్ అండ్ డ్రై ఆప్షన్స్ ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిర్ణయిస్తుందన్నారు. ఒసాకా కన్సాయ్ ఎక్స్‌పోలో 1,000 మంది అతిథులు ప్రయోగాత్మకంగా వాడుకోవటానికి ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. ఈ ప్రదర్శన తర్వాత మాస్ ప్రొడక్షన్ వర్షన్‌ను రిలీజ్ చేస్తామని జపనీస్ షవర్‌హెడ్ సంస్థ సైన్స్ కో కంపెనీ చైర్మన్ ఆయోమా వెల్లడించారు.
Read Also: Delhi: ఉబర్‌కు కోర్టు షాక్.. టైమ్‌కి క్యాబ్ రానందుకు రూ.54వేలు ఫైన్
ఇక, మనుషుల భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని జపాన్ ఇంజినీర్లు దీన్ని రూపొందించారు. ఈ ఫైటర్‌జెట్ కాక్‌పీట్ ఆకారంలోని ప్లాస్టిక్ ప్యాడ్‌లోకి మనిషి వెళ్లిన తర్వాత.. అది సగానికిపైగా గోరు వెచ్చని నీటితో నిండుతుంది. ఆ తర్వాత అందులోని హైస్పీడ్ జెట్స్ నీటిని వేగంగా చిమ్ముతాయి. స్నానం చేసే వ్యక్తిని ఆహ్లాదపర్చేందుకు ఇందులో మరిన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ఏఐ ద్వారా స్నానం చేస్తున్న వ్యక్తి శారీరక పరిస్థితిని మెషీన్ సేకరించి.. దానికి అనుగుణంగా పని చేస్తుందని సైన్స్ కో కంపెనీ పేర్కొంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఒసాకాలోని ఎక్స్‌పో 2025లో మిరాయ్ నింగెన్ సెంటకుకిని ప్రదర్శించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.