NTV Telugu Site icon

Apple MacBook: ఈ ల్యాప్టాప్ పై భారీగా ధర తగ్గింపు.. ఇదే సువర్ణవకాశం

Laptop

Laptop

ల్యాప్టాప్ కొనేందుకు మీ దగ్గర తక్కువ బడ్జెట్ ఉందా.. అయితే యాపిల్ కంపెనీ ఓ శుభవార్త చెప్పింది. యాపిల్ మ్యాక్ బుక్ (Apple MacBook)ని తక్కువ ధరకే అందిస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ల్యాప్ టాప్ లు భారీ తగ్గింపుతో లభిస్తున్నాయి. M1 చిప్‌సెట్‌తో కూడిన మోడల్ ఎటువంటి బ్యాంక్ ఆఫర్ లేకుండా రూ. 31,000 డిస్కౌంట్ ఇస్తుంది. బ్యాంక్ ఆఫర్‌లో రూ. 5,000 ప్రత్యేక తగ్గింపు అందుబాటులో ఉంది. అదేవిధంగా.. M2 చిప్‌సెట్‌తో కూడిన మ్యాక్‌బుక్ మోడల్ కూడా భారీ తగ్గింపుతో లభిస్తుంది. దీనికి సంబంధించిన వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Gautam Adani Salary: ఆసియాలో రెండో అత్యంత సంపన్నుడైన.. గౌతమ్ అదానీ జీతం ఎంతో తెలుసా?

యాపిల్ మ్యాక్ బుక్ ఎయిర్ M1 మొదటగా ధర రూ.99,900 ఉండేది. కానీ ప్రస్తుతం మ్యాక్‌బుక్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.68,990కి అందుబాటులో ఉంది. అంటే లాంచ్ ధర కంటే రూ.31,000 తక్కువ. 8GB RAM, 256GB SSD కలిగిన మోడల్ ఈ ధరలో అందుబాటులో ఉంది. మరోవైపు.. ఈ ఆఫర్ ఐసీఐసీఐ, ఎస్బీఐ బ్యాంక్ కార్డ్‌లపై అత్యధిక తగ్గింపు లభిస్తుంది. ఐసీఐసీఐ, ఎస్బీఐ బ్యాంక్ కార్డ్‌ ఉంటే.. మీరు క్రెడిట్ కార్డ్ ఫుల్ స్వైప్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ EMI లావాదేవీల ద్వారా రూ. 5,000 పూర్తి తగ్గింపును పొందవచ్చు. బ్యాంక్ ఆఫర్‌ను కూడా సద్వినియోగం చేసుకుంటే, ఈ మోడల్ ధర కేవలం రూ. 63,990 మాత్రమే ఉంటుంది. అంటే లాంచ్ ధర కంటే రూ. 36,000 తక్కువకు కొనుగోలు చేయవచ్చు. దీనిపై రూ.33,000 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది.

Pranaya Godari: కోటి రిలీజ్ చేసిన ప్రణయ గోదారి సాంగ్..

ఫీచర్లు
మ్యాక్ బుక్ ఎయిర్ M1 2560×1600 పిక్సెల్ రిజల్యూషన్, 400 నిట్స్ బ్రైట్‌నెస్‌తో 13.3-అంగుళాల రెటినా డిస్‌ప్లేను కలిగి ఉంది. అంతేకాకుండా.. 8GB RAM, 256GB SSD స్టోరేజ్ ఉంటుంది. ఈ ల్యాప్ టాప్ 3.5x వేగవంతమైన CPU పనితీరును, 6x వేగవంతమైన GPU పనితీరును అందిస్తుంది. ఇంతకు ముందు ఉన్న మ్యాక్ ల కంటే రెండింతలు ఎక్కువ బ్యాటరీ అందిస్తుంది. ఇది చాలా తేలికగా ఉంటుంది. బ్యాక్‌లిట్ కీబోర్డ్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 720p HD వెబ్‌క్యామ్, స్టీరియో స్పీకర్లు, రెండు USB-C పోర్ట్‌లు, బ్లూటూత్ వెర్షన్ 5.0, 3.5 mm ఆడియో జాక్, ఫోర్స్ టచ్ కీప్యాడ్ మరియు Wi-Fi 802.11 AX సపోర్ట్ ఫీచర్లు కలిగి ఉంటుంది. ఇది 18 గంటల వరకు బ్యాటరీ లైఫ్ అందిస్తుందని కంపెనీ తెలిపింది.