Pranaya Godari: కోటి రిలీజ్ చేసిన ప్రణయ గోదారి సాంగ్..
- ప్రణయగోదారి నుంచి ఈ సాంగ్ చూస్తుంటే ఫ్రెష్ ఫీలింగ్ కలుగుతోంది
- యువతను ఆకర్షించే ఎన్నో పాయింట్స్ కలగలిపి రాబోతున్నాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pranayagodari Movie Song: సరికొత్తగా ఆవిష్కరిస్తున్న కథలకు, నాచురల్ లొకేషన్స్‌లో షూట్ చేస్తున్న సినిమాలకు ఈ రోజుల్లో మంచి డిమాండ్ ఉంటోంది. సరిగ్గా ఇదే పాయింట్ బేస్ చేసుకొని ఓ డిఫరెంట్ కంటెంట్‌తో ప్రణయగోదారి అనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. పిఎల్ విఘ్నేష్ దర్శకత్వంలో ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో ప్రముఖ కమీడియన్ అలీ ఫ్యామిలీ నుంచి వచ్చిన నటుడు సదన్, ప్రియాంక ప్రసాద్, సునీల్ రావినూతల, 30 ఇయర్స్ పృథ్వీ, సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.
పిఎల్‌వి క్రియేషన్స్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా పారమళ్ళ లింగయ్య ఈ ‘ప్రణయగోదారి’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న యూనిట్.. జోరుగా ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఈ మూవీలో నుంచి ఫీల్ గుడ్ సాంగ్ లాంచ్ చేశారు. ప్రముఖ సంగీత దర్శకులు కోటి చేతుల మీదుగా ఈ సాంగ్ లాంచ్ చేశారు. కలలో కలలో.. అంటూ సాగిపోతున్న ఈ ప్రేమ గీతంలో లవ్ బీట్ అదిరిపోయిందని చెప్పుకోవాలి. ఇక గోదావరి అందాలు, నాచురల్ లొకేషన్స్ లో షూట్ చేసిన సీన్స్ ఫ్రెష్ ఫీలింగ్ తెప్పిస్తున్నాయి. హీరో హీరోయిన్ కాస్ట్యూమ్స్‌తో పాటు సైడ్ డాన్సర్స్ లుక్స్ కూడా ఈ పాటలో ఆకర్షణీయంగా మారాయి.
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం": జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
- Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
Also Read; Revu Party: “రేవు”పార్టీలో హేమాహేమీలు.. ఆర్జీవి మురళీమోహన్ సహా?
ఈ సాంగ్ లాంచ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ కోటి మాట్లాడుతూ.. ప్రణయగోదారి నుంచి ఈ సాంగ్ చూస్తుంటే ఫ్రెష్ ఫీలింగ్ కలుగుతోందని, అన్ని వర్గాల ఆడియన్స్ మెచ్చేలా ఈ సాంగ్ షూట్ చేశారని అన్నారు. పాటలోని లిరిక్స్, బీట్, అందుకు తగ్గ సన్నివేశాలు, నటీనటుల వేషధారణ అన్నీ కూడా చాలా బాగా కుదిరాయని అన్నారు. ఈ మేరకు చిత్రయూనిట్ మొత్తానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇప్పటివరకు ప్రణయగోదారి మూవీ నుంచి వదిలిన పోస్టర్స్, ఈ సాంగ్ చూస్తుంటే టైటిల్‌కి తగ్గట్టుగా నాచురల్ లొకేషన్స్ లో ఈ సినిమా చిత్రీకరించారని తెలుస్తోంది. గోదారి అందాలు, అక్కడి ప్రజల జీవన విధానాలు వెండితెరపై చూపించడమే గాక.. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అనుభూతిని ప్రేక్షకులకు ఇవ్వబోతున్నారని స్పష్టమవుతోంది. యువతను ఆకర్షించే ఎన్నో పాయింట్స్ కలగలిపి రాబోతున్న ఈ సినిమాకు మార్కండేయ సంగీతం అందిస్తున్నారు. ఈదర ప్రసాద్ కెమెరామెన్ గా పని చేస్తున్నారు. చీఫ్ కో డైరెక్టర్ గా జగదీశ్ పిల్లి, డిజైనర్ గా TSS కుమార్, అసిస్టెంట్ డైరెక్టర్ గా గంట శ్రీనివాస్ వర్క్ చేస్తున్నారు. కొరియోగ్రఫీ: కళాధర్ , మోహనకృష్ణ , రజిని, ఎడిటర్: కొడగంటి వీక్షిత వేణు, ఆర్ట్: విజయకృష్ణ అందిస్తున్నారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!