NTV Telugu Site icon

Motorola: తక్కువ ధరలో బెస్ట్ మోటరోలా స్మార్ట్ ఫోన్లు ఇవే!.. కేవలం రూ. 6,999కే

Moto

Moto

మీ స్మార్ట్ ఫోన్ పనితీరు స్లో అయిపోయిందా? పదే పదే హ్యాంగ్ అవుతున్నదా? తక్కువ ధరలోనే బెస్ట్ ఫీచర్లతో వచ్చే ఫోన్ కొనాలని చూస్తున్నారా? అయితే ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ మోటరోలా తీసుకొచ్చిన మొబైల్స్ పై ఓ లుక్కేయండి. Motorola G05, Motorola G35 5G, Motorola G45 5G స్మార్ట్‌ఫోన్లు అధునాతన ఫీచర్లతో, తక్కువ ధరలో అందుబాటులో ఉన్నాయి. బడ్జెట్ ఫ్రెండ్లీ, గేమింగ్ ఫ్రెండ్లీ, 5G సపోర్ట్ ఉన్న ఫోన్లు కావాలంటే ఇవి బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. అత్యంత తక్కువ ధరలో అందుబాటులో ఉన్న మోటరోలా ఫోన్ కేవలం రూ. 6,999 నుంచి ప్రారంభమవుతుంది. వీటిలో అధిక ర్యామ్, పవర్ ఫుల్ ప్రాసెసర్, అద్భుతమైన కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి.

Motorola G35 5G:

ఫ్లిప్ కార్ట్ లో Motorola G35 5G (4GB RAM + 128GB స్టోరేజ్) వేరియంట్ రూ. 9,999కే అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 6.7-అంగుళాల HD+ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. Unisoc T760 5G చిప్‌సెట్ అమర్చారు. ఫోటోల కోసం 50MP ప్రైమరీ + 8MP సెకండరీ (డ్యుయల్ రియర్ కెమెరా), 16MP సెల్ఫీ కెమెరా అందించారు. 5000mAh బ్యాటరీ, 20W టర్బో ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది.

Also Read:PM Modi: ఎలాన్ మస్క్‌తో భేటీ కానున్న ప్రధాని మోడీ..

Motorola G45 5G:

ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో Motorola G45 5G (4GB RAM + 128GB స్టోరేజ్) స్మార్ట్ ఫోన్ రూ. 10,999కే వచ్చేస్తోంది. ఈ మొబైల్ 6.5-అంగుళాల FHD+ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. Snapdragon 6s Gen 3 ప్రాసెసర్ ను అందించారు. ఫోటోల కోసం 50MP ప్రైమరీ + 8MP అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, 16MP సెల్ఫీ కెమెరా అందించారు. IP52 రేటింగ్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డాల్బీ ఆడియో వంటి ఫీచర్లను కలిగి ఉంది. 5000mAh బ్యాటరీ, 20W టర్బో ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది.

Also Read:PM Modi US Visit: ప్రధాని మోడీ, ట్రంప్ మధ్య చర్చకు రానున్న అంశాలు ఇవే..

Motorola G05:

తక్కువ ధరలో బెస్ట్ ఫీచర్లతో స్మార్ట్ కావాలనుకుంటే Motorola G05 బెస్ట్ అని చెప్పొచ్చు. ఫ్లిప్ కార్ట్ లో ఈ ఫోన్ (4GB RAM + 64GB స్టోరేజ్)రూ. 6,999కే లభిస్తోంది. ఈ ఫోన్ 6.67-అంగుళాల HD+ LCD డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. MediaTek Helio G81 Extreme ప్రాసెసర్ ను అందించారు. 50MP ప్రైమరీ కెమెరా (Quad Pixel టెక్నాలజీ), 8MP సెల్ఫీ కెమెరా తో వస్తుంది. 5200mAh జంబో బ్యాటరీతో వస్తుంది.