NTV Telugu Site icon

Best ACs: బడ్జెట్ ధరల్లో బ్రాండెడ్ ఏసీలు.. వేసవికి ముందే కొనేయండి!

Ac

Ac

ఎండలు బాబోయ్.. ఎండలు అనే పరిస్థితి రానే వచ్చింది. భానుడు భగభగమని మండిపోతున్నాడు. కొన్ని రోజుల క్రితం వరకు కూల్ కూల్ గా ఉన్న వాతావరణం నెమ్మదిగా వేడెక్కుతోంది. వేసవి వేళ ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లకు పని చెప్పాల్సిన రోజులు వచ్చేశాయ్. వేసవికి ముందే ఎయిర్ కండిషనర్లను కొనుగోలు చేస్తే ఎండతాపం నుంచి ఉపశమనం పొందొచ్చు. ఇదే సమయంలో ఈకామర్స్ సంస్థ అమెజాన్ లో ఏసీలపై ఆఫర్లు ప్రకటించింది. బ్రాండెడ్ కంపెనీకి చెందిన ఏసీలను బడ్జెట్ ధరల్లోనే సొంతం చేసుకునే ఛాన్స్ మిస్ చేసుకోకండి.

LG Super Convertible 5-in-1 Cooling 1.5 Ton Split AC

అమెజాన్ లో ఎల్జీ బ్రాండ్ కు చెందిన ఏసీపై అదిరిపోయే ఆఫర్ ఉంది. సగం ధరకే సొంతం చేసుకోవచ్చు. LG Super Convertible 5-in-1 Cooling 1.5 Ton Split AC పై 45 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. దీని అసలు ధర రూ. 89,990గా ఉంది. ఆఫర్లో భాగంగా దీన్ని మీరు రూ. 49,888కే సొంతం చేసుకోవచ్చు. ఇన్వర్టర్ కంప్రెసర్, రిమోట్ కంట్రోల్డ్, హీటింగ్, కూలింగ్ ఫంక్షన్, 4 వే స్వింగ్, ఆటో క్లీన్ వంటి స్పెషల్ ఫీచర్లను కలిగి ఉంది. ఈ AC వేసవిలో చల్లని గాలిని ఇవ్వడమే కాకుండా శీతాకాలంలో వెచ్చని గాలిని కూడా ఇస్తుంది.

Also Read:Supreme Court: దోషులుగా తేలిన రాజకీయ నాయకులు, పదవుల్లో ఉండొచ్చా?.. సుప్రీం కీలక ఆదేశాలు..

Voltas 1.5 ton 3 Star, Inverter Split AC

క్వాలిటీ ఏసీ కావాలనుకునే వారు వోల్టాస్ బ్రాండ్ కు చెందిన ఏసీలను కొనుగోలు చేయొచ్చు. అమెజాన్ లో Voltas 1.5 ton 3 Star, Inverter Split AC ధర రూ. 33,990గా ఉంది. రిమోట్ కంట్రోల్డ్, ఇన్వర్టర్ కంప్రెసర్, డస్ట్ ఫిల్టర్, ఫాస్ట్ కూలింగ్ వంటి స్పెషల్ ఫీచర్లను కలిగి ఉంది. మీడియం సైజ్ (111 నుంచి 150 చదరపు అడుగులు) రూమ్ లకు అనుకూలంగా ఉంటుంది. 52° సెల్సియస్ వద్ద కూడా చల్లటి వాతావరణాన్ని కల్పిస్తుంది.

Also Read:AP Liquor Rates Hike: మందుబాబులకు బిగ్ షాక్.. ఏపీలో పెరిగిన మద్యం ధరలు..

Godrej 1.5 Ton 5 Star

గోద్రేజ్ బ్రాండ్ కు చెందిన Godrej 1.5 Ton 5 Star పై అమెజాన్ లో 30 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ. 54,900గా ఉంది. ఆఫర్లో భాగంగా దీన్ని మీరు రూ. 38,490కే సొంతం చేసుకోవచ్చు. 5 ఇన్ 1 కన్వర్టిబుల్, ఐ-సెన్స్ టెక్నాలజీ, యాంటీ ఫ్రీజ్, సెల్ఫ్ క్లీన్ వంటి ఫీచర్లతో వస్తుంది. మీడియం సైజ్ రూమ్ లకు (111 నుంచి 150 చదరపు అడుగులు) అనుకూలంగా ఉంటుంది.