స్మార్ట్ వాచ్ లు ట్రెండీగా మారాయి. వాచ్ లను ధరించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. స్మార్ట్ గాడ్జెట్స్ కు డిమాండ్ పెరిగింది. ఏజ్ తో సంబంధం లేకుండా స్మార్ట్ వాచ్ లను యూజ్ చేస్తున్నారు. హెల్త్ కు సంబంధించిన ఫీచర్లు, బ్లూటూత్ కాలింగ్, ఇతర ఫీచర్లు ఉండడంతో స్మార్ట్ వాచ్ లు యూజ్ చేసే వారి సంఖ్య పెరిగింది. బడ్జెట్ ధరల్లోనే స్మార్ట్ వాచ్ లు లభిస్తుండడంతో కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మీరు కొత్త స్మార్ట్ వాచ్ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్ లో స్మార్ట్ వాచ్ పై బిగ్ డీల్ అందుబాటులో ఉంది.
ఫైర్ బోల్ట్ కంపెనీకి చెందిన కోబ్రా స్మార్ట్ వాచ్ కేవలం రూ. 1300కే వచ్చేస్తోంది. స్టన్నింగ్ లుక్, లేటెస్ట్ ఫీచర్లతో అట్రాక్ట్ చేస్తోంది. అమెజాన్ లో కోబ్రా స్మార్ట్ వాచ్ పై 94 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ. 19,999గా ఉంది. ఆఫర్లో భాగంగా దీన్ని మీరు రూ. 1,299కే సొంతం చేసుకోవచ్చు. కోబ్రా స్మార్ట్ వాచ్ ఫీచర్ల విషయానికి వస్తే.. ఈ స్మార్ట్ వాచ్ IP68 రేటింగ్ తో వస్తుంది. 500 నిట్స్ బ్రైట్ నెస్, 60Hz రిఫ్రెష్ రేట్, 368×448 పిక్సెల్‌ల స్క్రీన్ రిజల్యూషన్‌తో 1.78-అంగుళాల AMOLED ఆల్ వేస్ ఆన్ డిస్ల్పేతో వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ లో దాదాపు 123 స్పోర్ట్స్ మోడ్ ఉన్నాయి.
బ్లూటూత్ కాలింగ్, బిల్ట్-ఇన్ మైక్ & స్పీకర్, వాయిస్ అసిస్టెంట్, గేమ్స్, ఫైండ్ ఫోన్, యాక్సిలరోమీటర్, యాక్టివిటీ ట్రాకర్, అలారం క్లాక్, క్యాలరీ ట్రాకర్, కెమెరా, నోటిఫికేషన్‌లు, పెడోమీటర్, ఫోన్ కాల్, సెడెంటరీ రిమైండర్, స్లీప్ మానిటర్, టెక్స్ట్ మెసేజ్, టైమ్ డిస్ప్లే, Spo2 (బ్లడ్ ఆక్సిజన్ మానిటరింగ్), హార్ట్ రేట్ ట్రాకింగ్, డైలీ వర్కౌట్ మెమరీ, డిస్టెన్స్ ట్రాకర్, మల్టీస్పోర్ట్ ట్రాకర్, మ్యూజిక్ ప్లేయర్ వంటి స్పెషల్ ఫీచర్లను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌వాచ్ సింగిల్ ఛార్జ్ తో 15 రోజుల వరకు వస్తుంది.