6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
- హువావే గ్లోబల్ మార్కెట్లో HUAWEI WATCH D3 స్మార్ట్‌వాచ్‌ను విడుదల..
- వాచ్‌లో ప్రధాన ఆకర్షణగా 24 గంటల అంబులేటరీ బ్లడ్ ప్రెజర్ మానిటరింగ్ ఫీచర్
- 1.92 అంగుళాల HD 2.5D AMOLED డిస్ప్లే
- 80కి పైగా ఎక్సర్సైజ్ మోడ్లు అందుబాటులో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HUAWEI WATCH D3: స్మార్ట్‌వాచ్ మార్కెట్లో ప్రముఖ టెక్నాలజీ సంస్థ హువావే (HUAWEI) మరో కొత్త స్మార్ట్‌వాచ్‌ను గ్లోబల్ మార్కెట్లో విడుదల చేసింది. జర్మనీలో నిర్వహించిన గ్లోబల్ లాంచ్ ఈవెంట్లో HUAWEI WATCH D3ను కంపెనీ లాంచ్ చేసింది. ఈ వాచ్‌లో ప్రధాన ఆకర్షణగా 24 గంటల అంబులేటరీ బ్లడ్ ప్రెజర్ మానిటరింగ్ ఫీచర్‌ను అందించారు.
24 గంటల పాటు బీపీ మానిటరింగ్..
సాధారణంగా క్లినిక్‌లో చేసే బ్లడ్ ప్రెజర్ పరీక్ష ఒక నిర్దిష్ట సమయానికి మాత్రమే రీడింగ్‌ను అందిస్తుంది. అయితే హువావే వాచ్ డీ3లో నిరంతర అంబులేటరీ బ్లడ్ ప్రెజర్ మానిటరింగ్ సదుపాయం ఉంది. యూరోపియన్ సొసైటీ ఆఫ్ హైపర్‌టెన్షన్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ఫీచర్‌ను రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. వాచ్ స్ట్రాప్‌లో ప్రత్యేకంగా రూపొందించిన మెకానికల్ మైక్రో ఎయిర్‌బ్యాగ్, హై-ప్రెసిషన్ సెన్సర్, అడాప్టివ్ అల్గారిథమ్ కలిసి పనిచేస్తాయి. ఇవి రోజంతా, రాత్రి సమయంలోనూ సుమారు 15 నుంచి 30 నిమిషాల వ్యవధిలో ఆటోమేటిక్‌గా బీపీ రీడింగ్స్‌ను తీసుకుంటాయి. నిద్రకు ఇబ్బంది కలగకుండా ఎయిర్‌బ్యాగ్ ఇన్ఫ్లేషన్ మెకానిజాన్ని తక్కువ శబ్దంతో పనిచేసేలా రూపొందించారు.
Also Read
- 7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
- 6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
- IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!
- 8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
బ్లడ్ ప్రెజర్ మానిటరింగ్ ఫంక్షన్‌కు యూరోపియన్ యూనియన్ మెడికల్ డివైస్ రెగ్యులేషన్ ప్రకారం సీఈ మార్కింగ్ కూడా ఉంది. సేకరించిన బీపీ డేటాను దీర్ఘకాలిక ట్రెండ్స్‌గా పరిశీలించడంతో పాటు వైద్య నిపుణులతో పంచుకునే సదుపాయం ఉంది. వ్యాయామానికి ముందు, తర్వాత కూడా అవసరమైనప్పుడు ప్రత్యేకంగా బీపీ రీడింగ్ తీసుకోవచ్చు.
కాంపాక్ట్ డిజైన్:
రోజంతా, నిద్ర సమయంలోనూ ధరించే విధంగా హువావే వాచ్ D3ను కాంపాక్ట్ డిజైన్‌తో రూపొందించింది. దీని మందం 11.3 మిల్లీమీటర్లు కాగా, స్ట్రాప్ లేకుండా బరువు 40 గ్రాములు. స్ట్రాప్లోని స్లిమ్ ఎయిర్‌బ్యాగ్ డిజైన్ మణికట్టుపై ఒత్తిడిని తగ్గించేలా రూపొందించారు. ఈ స్మార్ట్‌వాచ్ బ్లాక్, గోల్డ్, మోకా గోల్డ్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది.
ఆరోగ్య వివరాలు:
వాచ్‌లో హెల్త్ గ్లాన్స్ అనే ఫీచర్ ఉంది. ఇది సుమారు 60 సెకన్లలో బ్లడ్ ప్రెజర్, హార్ట్‌రేట్, Spo2 సహా 11 వరకు బయోమెట్రిక్ సూచికలపై సమగ్ర సమాచారాన్ని అందిస్తుంది. అదేవిధంగా హెల్త్ ఇన్సైట్స్ ఫీచర్ ద్వారా శరీరానికి సంబంధించిన కొలతలను దీర్ఘకాలిక యాక్టివిటీ, నిద్ర డేటాతో కలిపి విశ్లేషించి ఆరోగ్యానికి సంబంధించిన అనేక నమూనాలను గుర్తించేందుకు ప్రయత్నిస్తుంది. హెల్త్ కమ్యూనిటీ ద్వారా కుటుంబ సభ్యులతో ఆరోగ్య డేటాను రిమోట్‌గా పంచుకోవచ్చు. అసాధారణ రీడింగ్స్ నమోదైతే ఆటోమేటిక్ నోటిఫికేషన్లు కూడా అందుతాయి.
స్పెసిఫికేషన్లు:
హువావే వాచ్ డీ3లో 1.92 అంగుళాల HD 2.5D అమోలెడ్ టచ్ డిస్ప్లే ఉంది. ఇది 408×408 పిక్సెల్స్ రిజల్యూషన్, 328 పీపీఐని కలిగి ఉంటుంది. బ్లూటూత్ 6.0, జీపీఎస్, ఎన్ఎఫ్సీ వంటి కనెక్టివిటీ సదుపాయాలు ఉన్నాయి. ఆండ్రాయిడ్ 8.0, ఆపై వెర్షన్లతో పాటు ఐఓఎస్ 13, ఆపై వెర్షన్లు కలిగిన డివైస్లతో ఈ వాచ్ పనిచేస్తుంది. IP68 వాటర్ రెసిస్టెన్స్‌తో పాటు యాక్సిలరోమీటర్, గైరోస్కోప్, మాగ్నటోమీటర్తో కూడిన 9-యాక్సిస్ ఐఎంయూ, ఆప్టికల్ హార్ట్‌రేట్ సెన్సర్, ఈసీజీ సెన్సర్, యాంబియంట్ లైట్ సెన్సర్, బారోమీటర్, టెంపరేచర్ సెన్సర్, డిఫరెన్షియల్ ప్రెజర్ సెన్సర్, హాల్ సెన్సర్ ఉన్నాయి.
వాచ్‌లో 80కి పైగా ఎక్సర్సైజ్ మోడ్లు ఉన్నాయి. ఆరు సాధారణ కార్యకలాపాలను ఆటోమేటిక్‌గా గుర్తించే సదుపాయం కూడా అందించారు. దీని కొలతలు 46.5 × 41 × 11.3 మిల్లీమీటర్లు. సాధారణ వినియోగంలో బ్యాటరీ ఆరు రోజుల వరకు పనిచేస్తుంది. అయితే 24 గంటల బీపీ మానిటరింగ్ ఫీచర్‌ను యాక్టివ్‌గా ఉంచితే బ్యాటరీ బ్యాకప్ ఒక రోజుకు తగ్గుతుంది.
ధర:
హువావే వాచ్ డీ3 ధరను 449 యూరోలుగా కంపెనీ నిర్ణయించింది. భారత కరెన్సీలో దీని విలువ సుమారు రూ.49,420. ప్రస్తుతం యూరప్‌లోని పలు దేశాల్లో ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 11 నుంచి ఈ వాచ్ షిప్పింగ్ ప్రారంభం కానుంది.
A lighter feel for everyday wear. With a slimmer design, larger screen, and soft straps, the #HUAWEIWATCHD3 brings greater comfort to blood pressure management. pic.twitter.com/oLXDSaORdJ
— Huawei Mobile (@HuaweiMobile) August 28, 2026
తాజావార్తలు
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
Uravakonda Theft: విచిత్ర దొంగ.. చోరీకి ముందు వెంకన్నకు నమస్కారం.. ఆ తర్వాత..!
-
Kurnool DSC: టెట్ అర్హత లేకుండానే టీచర్ ఉద్యోగం.. కర్నూలులో వెలుగులోకి సంచలన వ్యవహారం!
-
EMI Movie: ఫోన్, బైక్ కొన్నారా? గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ప్రతి నెలా ‘ఇ.ఎం.ఐ’ టెన్షన్
-
BKU : తెలుగులో బెత్లెహం కుడుంబ యూనిట్.. మరో ప్రేమలు అవుతుందా..?
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!