8100mAh భారీ బ్యాటరీ, 108MP కెమెరా వంటి క్రేజీ ఫీచర్లతో Honor X7e Plus (4G) లాంచ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Honor X7e Plus (4G): హానర్ (Honor) నుండి కొత్తగా Honor X7e Plus (4G) స్మార్ట్‌ఫోన్‌ను అధికారికంగా లాంచ్ చేసింది. జూన్‌లో Honor X7e (4G), జూలైలో Honor X7e Plus 5Gను విడుదల చేసిన సంస్థ.. ఇప్పుడు 4G వెర్షన్‌ను కూడా గ్లోబల్ మార్కెట్లో లాంచ్ చేసింది. భారీ 8100mAh బ్యాటరీ, 108MP కెమెరా, Snapdragon 685 ప్రాసెసర్ వంటి మంచి ఫీచర్లతో ఈ ఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చేస్తోంది.
120Hz డిస్ప్లే:
Honor X7e Plus (4G)లో 6.87 అంగుళాల TFT LCD డిస్ప్లేను అందించారు. ఇది HD+ (1592 × 720 పిక్సెల్స్) రిజల్యూషన్‌తో పాటు 120Hz రిఫ్రెష్ రేట్ ను సపోర్ట్ చేస్తుంది. హై బ్రైట్నెస్ మోడ్‌లో గరిష్టంగా 1020 నిట్స్ బ్రైట్నెస్ లభిస్తుంది. అలాగే కళ్లపై ఒత్తిడిని తగ్గించేందుకు డైనమిక్ డిమ్మింగ్, లో బ్లూ లైట్ మోడ్ వంటి ఐ కంఫర్ట్ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.
Also Read
- Honor Play 11 Pro: హానర్ ప్లే 11 ప్రో రిలీజ్.. 50MP కెమెరా, 7000mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్
- New Smart Phone: 9020mAH బ్యాటర్, 12GB RAM, AMOLED డిస్ప్లే.. విడుదలకు ముందే లీకైన ఫీచర్స్..
- Samsung Galaxy S26 FE: సామ్ సంగ్ గెలాక్సీ S26 FE.. 50MP ట్రిపుల్ కెమెరా సెటప్.. విడుదలకు ముందే స్పెసిఫికేషన్లు లీక్
- Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్‌తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!
Snapdragon చిప్సెట్:
ఈ స్మార్ట్‌ఫోన్‌కు Qualcomm Snapdragon 685 ప్రాసెసర్ శక్తినిస్తోంది. ఇందులో 6GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ అందుబాటులో ఉంది. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత MagicOS 10పై పనిచేస్తుంది. అంతేకాకుండా హానర్ ర్యామ్ టర్బో టెక్నాలజీ ద్వారా స్టోరేజ్‌లోని కొంత భాగాన్ని వర్చువల్ RAMగా ఉపయోగించి మల్టీటాస్కింగ్ అనుభవాన్ని బాగా అందిస్తుంది.
భారీ బ్యాటరీ & ఫాస్ట్ ఛార్జింగ్:
Honor X7e Plus (4G)లో 8100mAh భారీ బ్యాటరీను అమర్చారు. దీనికి 45W Honor SuperCharge ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. కంపెనీ ప్రకారం.. ఈ బ్యాటరీ 6 సంవత్సరాల తర్వాత కూడా 80%కి పైగా సామర్థ్యాన్ని నిలుపుకుంటుందని చెబుతున్నారు.
108MP కెమెరా:
ఫోటోగ్రఫీ కోసం ఈ ఫోన్లో 108MP ప్రధాన కెమెరాతో పాటు ఒక అదనపు సెన్సార్‌ను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5MP ఫ్రంట్ కెమెరా ఉంది. అలాగే ఇందులో పలు AI ఫీచర్లు కూడా ఉన్నాయి. వాటిలో AI బటన్, AI ఇమేజ్-టు-వీడియో 2.0, AI ఎరేజర్, AI సమ్మరీ, సర్కిల్ టు సెర్చ్, AI మెమరీస్ వంటి ఫీచర్లు వినియోగదారులకు మరింత సౌకర్యవంతమైన అనుభవాన్ని అందిస్తాయి.
డ్యూరబిలిటీ:
ఈ ఫోన్‌కు IP68, IP69, IP69K డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్స్ లభించాయి. అదనంగా SGS ప్రీమియం పనితీరు సర్టిఫికేషన్‌తో పాటు 2.5 మీటర్ల ఎత్తు నుంచి పడినా తట్టుకునే రక్షణను అందించారు. ఇక ఇతర ఫీచర్ల విషయానికి వస్తే ఇందులో స్టీరియో స్పీకర్లు (400% వరకు వాల్యూమ్ బూస్ట్), NFC సపోర్ట్, సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, LDAC, aptX, LHDC బ్లూటూత్ ఆడియో కోడెక్‌లకు సపోర్ట్ వంటివి ఉన్నాయి.
ధర:
Honor X7e Plus (4G)ను సన్‌రైజ్ ఆరెంజ్, డెసర్ట్ గోల్డ్, వెల్వెట్ బ్లాక్ రంగుల్లో గ్లోబల్ వెబ్సైట్లో లిస్ట్ చేసింది. అయితే ప్రస్తుతం ఈ ఫోన్ ధర, ఏ దేశాల్లో విడుదల చేయనున్నారు.? అమ్మకాల ప్రారంభ తేదీ వంటి వివరాలను కంపెనీ వెల్లడించలేదు. రాబోయే రోజుల్లో పూర్తి సమాచారం ప్రకటించే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
8100mAh భారీ బ్యాటరీ, 108MP కెమెరా వంటి క్రేజీ ఫీచర్లతో Honor X7e Plus (4G) లాంచ్..!
-
Cocktail 2 OTT Release: ఓటీటీలోకి రష్మిక, కృతి సనన్, షాహిద్ ల ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. తెలుగులోనూ చూడవచ్చు
-
Honor Play 11 Pro: హానర్ ప్లే 11 ప్రో రిలీజ్.. 50MP కెమెరా, 7000mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి వ్యాపారం, ఉద్యోగంలో అనుకూలతలు!
-
US Iran Talks: ట్రంప్ కీలక ప్రకటన.. ఇరాన్‌తో మరోసారి చర్చలకు సిద్ధం
ట్రెండింగ్
-
Vegetable Cleaning : కూరగాయలను ఉప్పు నీటితో కడుగుతున్నారా.? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.!
-
Car Maintenance: కారులో ఎలుకల బెడదా? ఈ 5 చిట్కాలతో వేల రూపాయల నష్టాన్ని తప్పించుకోండి.!
-
Door Mat Cleaning : డోర్‌మ్యాట్ ఇలా వాష్ చేస్తే చాలు.. దుమ్ము, దుర్వాసన, క్రిములు మాయం.!
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్‌తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!