Site icon NTV Telugu

పడిపోయినా భయపడాల్సిన అవసరం లేని ఫోన్.. 7500mAh బ్యాటరీ, 108MP కెమెరాతో HONOR Magic8 Lite గ్లోబల్ లాంచ్..!

Honor

Honor

HONOR Magic8 Lite: హానర్ (HONOR) నుండి మ్యాజిక్ 8 సిరీస్‌ లో భాగంగా.. కొత్తగా హానర్ మ్యాజిక్8 లైట్ (HONOR Magic8 Lite) స్మార్ట్‌ఫోన్‌ను గ్లోబల్ మార్కెట్‌లో అధికారికంగా విడుదల చేసింది. ఇప్పటికే Magic8 Pro విడుదలైన నేపథ్యంలో ఈ లైట్ వెర్షన్ మిడ్-ప్రీమియం సెగ్మెంట్ వినియోగదారులను టార్గెట్ చేస్తోంది. ఈ ఫోన్ కేవలం 189 గ్రాముల బరువుతో రెడ్డీస్ బ్రౌన్, ఫారెస్ట్ గ్రీన్, మిడ్ నైట్ బ్లాక్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది.

డిజైన్, డ్యూరబిలిటీ విషయంలో అల్యూమినోసిలికేట్ గ్లాస్‌తో రూపొందించిన ఈ ఫోన్, డ్రాప్, నీరు, దుమ్ము నిరోధకతకు సంబంధించిన SGS ట్రిపుల్ రెసిస్టెంట్ ప్రీమియం పెర్ఫార్మన్స్ సర్టిఫికేషన్ పొందిన తొలి స్మార్ట్‌ఫోన్‌గా నిలిచింది. ఇది 2.5 మీటర్ల ఎత్తు నుంచి పడిపోయినా తట్టుకునే సామర్థ్యం కలిగి ఉంది. అలాగే IPX8, IPX9K వాటర్ రెసిస్టెన్స్, IP6X డస్ట్ ప్రొటెక్షన్‌తో పాటు IP68, IP69K రేటింగ్‌లు కూడా ఉన్నాయి. ఆరు లేయర్ల కుషనింగ్ గ్లాస్ స్ట్రక్చర్, వన్-ట్యాప్ డస్ట్ & వాటర్ ఈజెక్షన్, వర్షంలో కూడా పనిచేసే టచ్ ఇన్‌పుట్, గ్లోవ్స్‌తో వాడే టచ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

IP69K రేటింగ్‌, 200MP కెమెరా, Snapdragon 8 Elite చిప్ తో HONOR Magic8 Pro లాంచ్‌.. ధర ఎంతంటే..?

ఇక డిస్‌ప్లే పరంగా ఇందులో 6.79 అంగుళాల OLED డిస్‌ప్లే ఉంది. ఇది 1.5K రిజల్యూషన్, 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 6000 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌ను సపోర్ట్ చేస్తుంది. 1.3 మిమీ స్లిమ్ బెజెల్స్, DCI-P3 కలర్ గ్యామట్‌తో పాటు 3840Hz PWM డిమ్మింగ్, AI సర్కేడియన్ నైట్ డిస్‌ప్లే, లో బ్లూ లైట్ హార్డ్‌వేర్ ప్రొటెక్షన్, AI డిఫోకస్ డిస్‌ప్లే వంటి ఐ కేర్ ఫీచర్లు ఉన్నాయి.

ఇక కెమెరా సెక్షన్‌లో 108MP మెయిన్ రియర్ కెమెరా (OISతో), 5MP అల్ట్రా వైడ్ కెమెరా ఉన్నాయి. ఇది 10x డిజిటల్ జూమ్‌ను సపోర్ట్ చేస్తుంది. ముందు భాగంలో 16MP సెల్ఫీ కెమెరా ఉంది. అండర్‌వాటర్ ఫోటో మోడ్, 4K HD మూవింగ్ ఫోటో కాలేజ్, AI ఎరేసర్, AI ఫేస్ ట్యూన్, రిఫ్లెక్షన్ రిమూవల్, AI కటౌట్, AI అప్స్కేల్ వంటి అధునాతన AI ఫోటోగ్రఫీ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

పర్ఫార్మెన్స్ కోసం ఈ ఫోన్‌లో Snapdragon 6 Gen 4 (4nm) ప్రాసెసర్‌ను ఉపయోగించారు. హానర్ ప్రత్యేకంగా రూపొందించిన VC ఐస్ కూలింగ్ సిస్టమ్ ఇందులో ఉంది. 3,490 చ.మి. స్టెయిన్లెస్ స్టీల్ వేపర్ చాంబర్‌తో కలిపి మొత్తం 29,500 చ.మి. కూలింగ్ ఏరియా అందిస్తుంది. దీంతో గేమింగ్, హెవీ యూజ్ సమయంలో కూడా ఫోన్ కూల్‌గా పనిచేస్తుంది.

మిడ్‌రేంజ్‌లో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. 165Hz డిస్‌ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Turbo 6 సిరీస్ లాంచ్..!

బ్యాటరీ విభాగంలో 7500mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీతో వచ్చిన ఈ ఫోన్ 66W HONOR SuperCharge ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటంతో ఇతర డివైస్‌లను కూడా ఛార్జ్ చేయవచ్చు. అంతేకాదు, –30°C నుంచి 55°C వరకు ఉష్ణోగ్రతల్లో కూడా పనిచేసేలా డిజైన్ చేశారు. సాఫ్ట్‌వేర్‌గా ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత MagicOS 9.0పై రన్ అవుతుంది. గూగుల్ జెమినీ లైవ్ ఇంటరాక్షన్, AI రైటింగ్ టూల్స్, మ్యాజిక్ పోర్టల్ వంటి అనేక AI ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఆడియో కోసం డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, హానర్ సౌండ్ 7.3 టెక్నాలజీని అందించారు. NFC సపోర్ట్ కూడా ఉంది.

మెమరీ పరంగా గ్లోబల్‌గా 8GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్ అందుబాటులో ఉండగా.. కొన్ని ప్రాంతాల్లో 8GB + 256GB వేరియంట్ కూడా లభించనుంది. ధర విషయానికి వస్తే యూకే మార్కెట్‌లో £399.99గా నిర్ణయించారు. లాంచ్ ఆఫర్లలో భాగంగా £50 డిస్కౌంట్‌తో పాటు ఉచిత HONOR ఛాయస్ వాచ్ 2 ప్రో, 66W హానర్ సూపర్ ఛార్జ్ పవర్ అడాప్టర్ అందిస్తున్నారు. ఈ ఆఫర్లు హానర్ UK వెబ్‌సైట్‌లో పరిమిత కాలానికి అందుబాటులో ఉంటాయి. త్వరలోనే ఈ ఫోన్ ఇతర యూరోపియన్ మార్కెట్లలో కూడా విడుదలయ్యే అవకాశం ఉంది.

Exit mobile version