Site icon NTV Telugu

80W ఫాస్ట్ ఛార్జింగ్, 100x జూమ్ కెమెరాతో HONOR Magic V6 ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!

Honor Magic V6

Honor Magic V6

HONOR Magic V6 Launch: గత వారం జరిగిన MWC 2026 కార్యక్రమంలో హానర్ సంస్థ హానర్ మ్యాజిక్ V6 (HONOR Magic V6) ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ ను పరిచయం చేసింది. అయితే అప్పట్లో ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్లు, ధర, అందుబాటుపై వివరాలు వెల్లడించలేదు. తాజాగా చైనా లాంచ్ ఈవెంట్‌లో కంపెనీ ఈ ఫోన్‌కు సంబంధించిన అన్ని వివరాలను ప్రకటించింది. గ్లోబల్ వెర్షన్‌తో పోలిస్తే ఎక్కువ స్పెసిఫికేషన్లు ఒకేలా ఉన్నప్పటికీ, చైనా మోడల్‌లో బ్యాటరీ విషయంలో మార్పు ఉంది. 16GB + 1TB వేరియంట్‌లో 7150mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీను పొందుపరిచారు. ఇది ఫోల్డబుల్ ఫోన్లలో ఇప్పటివరకు వచ్చిన అతిపెద్ద బ్యాటరీలలో ఒకటిగా నిలుస్తుంది. ఇతర వేరియంట్లలో 6850mAh బ్యాటరీను మాత్రమే అందించారు. ఇది గ్లోబల్ వెర్షన్‌లో ఉన్న 6660mAh బ్యాటరీ కంటే ఎక్కువ సామర్థ్యం కలిగి ఉంది.

Harish Shankar : హరీష్ శంకర్ వివాదాస్పద ‘తథాస్తు’ ట్వీట్.. ఉస్తాద్ భగత్ సింగ్ పై ట్రోలింగ్

HONOR Magic V6 స్పెసిఫికేషన్లు:
* 7.95 అంగుళాల ఫోల్డబుల్ OLED డిస్‌ప్లే (2352×2172 రిజల్యూషన్)
* 6.52 అంగుళాల అవుటర్ OLED డిస్‌ప్లే (2420×1080 రిజల్యూషన్)
* 120Hz రిఫ్రెష్ రేట్, 1.07 బిలియన్ కలర్స్
* HDR Vivid, Dolby Vision, ZREAL సపోర్ట్
* పీక్ బ్రైట్‌నెస్: బయట స్క్రీన్ 6000 నిట్స్, లోపలి స్క్రీన్ 5000 నిట్స్
* 4.6GHz వరకు వేగం కలిగిన Octa Core Snapdragon 8 Elite Gen 5 (3nm) ప్రాసెసర్
* Adreno 840 GPU
* 12GB / 16GB RAM
* 256GB / 512GB / 1TB స్టోరేజ్
* Android 16 ఆధారిత MagicOS 10
* కెమెరా: 50MP మెయిన్ కెమెరా (f/1.6), 50MP అల్ట్రా వైడ్ కెమెరా (f/2.2), 64MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా (f/2.5)
* 3x ఆప్టికల్ జూమ్, 100x డిజిటల్ జూమ్
* లోపల, బయటి భాగాల్లో 20MP ఫ్రంట్ కెమెరాలు.

Jasprit Bumrah Records: ‘వన్స్ ఇన్ ఏ జనరేషన్ బౌలర్’.. మరీ ఇన్ని అరుదైన రికార్డులా బుమ్రా?

ఇతర ఫీచర్లు:
* Type-C ఆడియో
* స్టీరియో స్పీకర్లు
* IP68 & IP69 డస్ట్ మరియు వాటర్ రెసిస్టెన్స్
* Wi-Fi 7, బ్లూటూత్ 6.0
* GPS, NavIC, NFC సపోర్ట్
* డిజైన్ & బరువు: ఫోల్డ్ చేసినప్పుడు మందం: 8.75mm (వైట్ మోడల్), 9mm (ఇతర రంగులు)
* అన్‌ఫోల్డ్ చేసినప్పుడు మందం: 4.0mm / 4.1mm
* బరువు: 219g (వైట్), 224g (ఇతర రంగులు)
* బ్యాటరీ & ఛార్జింగ్: 7150mAh (16GB + 1TB మోడల్), 6850mAh (ఇతర మోడల్స్),
* 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 66W వైర్‌లెస్ ఛార్జింగ్, వైర్‌లెస్ రివర్స్ ఛార్జింగ్

IPL 2026: క్రికెట్ ఫాన్స్‌కు కిక్కిచ్చే న్యూస్.. ఫస్ట్ మ్యాచ్‌లో కీలక మార్పు.. ఈ రెండు టీమ్‌ల మధ్యే తొలి పోరు!

ధరలు:
* 12GB + 256GB: 8999 యువాన్ (రూ.1,20,220)
* 12GB + 512GB: 9999 యువాన్ (రూ.1,33,580)
* 16GB + 512GB: 10999 యువాన్ (రూ.1,46,940)
* 16GB + 1TB: 11999 యువాన్ (రూ.1,60,300)
ఈ ఫోన్ ప్రస్తుతం చైనాలో ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉంది. మార్చి 13 నుంచి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.

Exit mobile version